- Home
- Entertainment
- Guppedantha Manasu: ఒంటరి తనం కోరుకుంటున్న రిషి.. వసుధార గుండెల్లో బాంబు పేల్చిన ఏంజెల్?
Guppedantha Manasu: ఒంటరి తనం కోరుకుంటున్న రిషి.. వసుధార గుండెల్లో బాంబు పేల్చిన ఏంజెల్?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి సాగుతుంది. తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు నీ కంట్లో కన్నీరు రాకుండా చూసుకునేవాడు నీ పెదాలపై ఎప్పుడూ నవ్వులు పూయించేవాడు నీకు భర్తగా రావాలని ఆశపడుతున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే పెళ్లి చేసేస్తాను అంటాడు. ఆగు విశ్వం నన్ను కొంచెం ఆలోచించుకోని.. తర్వాత నా నిర్ణయం చెప్తాను అంటుంది ఏంజెల్.
సరేనమ్మా నువ్వు ఎలాంటి వాడిని చేసుకుంటానని చెప్పినా నాకేమీ అభ్యంతరం లేదు అని విశ్వనాథం చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్. నేరుగా రిషి దగ్గరికి వెళ్లి ప్రేమంటే ఏంటి అని అడుగుతుంది. ప్రేమ అంటే ఇద్దరి మనసులు కలవడం ఒకరి గురించి ఒకరు ఆలోచించటం. అతను ఒక తండ్రిగా బాధ్యతలు తీసుకోవాలి, ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పాలి అలాగే ఆమె ఒక తల్లిలాగా కల్మషం లేని ప్రేమని చూపించాలి అంటాడు రిషి.
అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారా అంటుంది ఏంజెల్. ఎందుకు ఉండరు ఉంటారు అంటూ ప్రేమ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించావా అని అడగటంతో కోపంగా ఆమె వైపు చూస్తాడు రిషి. కొంచెం కంగారు పడుతుంది ఏంజెల్. అలా అని కాదు వసుధార కూడా నీలానే ఆలోచిస్తుంది కదా మీరిద్దరూ ఎక్కువ మాట్లాడుకోరు.
కానీ ఒకరి మీద ఒకరు కేర్ తీసుకుంటారు అందుకే తనమీద నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది ఏంజెల్. నా ప్రేమ గురించి ఎప్పుడూ అడగకు నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టము నీకు ఎవరైనా నచ్చితే చెప్పు వాడిని ఎలాగైనా తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అంతేగాని నన్ను ప్రేమ గురించి ఎప్పుడూ అడగకు అని సీరియస్ గా చెప్తాడు రిషి. అయితే నీ లైఫ్ లో ఎలాంటి చేదు అనుభవాలు ఎలాంటి లవ్ ఫెయిల్యూర్స్ లేవు కదా అంటుంది ఏంజెల్.
అవును అంటాడు రిషి. సీన్ కట్ చేస్తే వసుధార కాలేజీకి బయలుదేరుతువుంటుంది. ఇంతలో చక్రపాణి వచ్చి నాకు కొంచెం బయట పని ఉంది వెళ్లి వస్తాను అంటాడు. అలాగే అంటుంది వసుధార. ఇంతలో ఏంజెల్ సడన్గా ఇంటికి వస్తుంది. చక్రపాణి ఆమెని పలకరించి విశ్వనాథం ఆరోగ్యం గురించి అడుగుతాడు. ఇష్టం బాగానే ఉన్నాడు అని చెప్పటంతో నాకు పని ఉంది మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి చక్రపాణి వెళ్ళిపోతాడు.
అప్పుడు వసుధార ఏంటి ఈ టైం లో వచ్చావు అని అడుగుతుంది. ఏం రాకూడదా.. నిన్ను కాలేజీకి వెళ్లకుండా డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది ఏంజెల్. అలా ఏం కాదు ఏదో ఇంపార్టెంట్ పని లేకపోతే నువ్వు రావు.. విషయం ఏంటో చెప్పు, నీ పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అంటుంది వసుధార. ఆలోచించాను కానీ నువ్వే అతని మనసులో ఏముందో కనుక్కోవాలి అంటుంది ఏంజెల్.
నువ్వు నిర్ణయం తీసుకోవటానికి చాలా టైం తీసుకుంటావు అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్ గానే డెసిషన్ తీసుకున్నావు, ఇంతకీ ఎవరతను అంటూ ఏంజెల్ ని ఆట పట్టిస్తుంది వసుధార. చెప్తాను కానీ గెస్ చేయు అంటుంది ఏంజెల్. నేను ఎలా గెస్ చేయగలను ఈ మధ్యకాలంలో నిన్ను ఎలాంటి అబ్బాయిలతోని చూడలేదు గెస్ చేయలేను కానీ నువ్వే చెప్పు అంటుంది వసుధార. ఇంకెవరు మీ రిషి సార్ అంటుంది ఏంజెల్.
ఒక్కసారిగా పంచదార గుండెల్లో బాంబు పేలినట్టుగా ఫీల్ అవుతుంది. కానీ ఆ ఫీలింగ్స్ ని గమనించని ఏంజెల్ రిషికి నేనంటే ఇష్టమే కానీ పెళ్లి విషయంలో కాదు అసలు తన మనసులో ఏముందో నువ్వే కనుక్కోవాలి నాకు ఈ సాయం చేసి పెట్టు సాయంత్రం ఎలాగైనా మా ఇంటికి రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంజెల్. కన్నీరు పెట్టుకుంటూ నేల మీద కూలబడిపోతుంది వసుధార. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.