Guppedantha Manasu: కోపంతో రగిలిపోతున్న ఏంజెల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన అనుపమ!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ, కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తను ప్రేమించిన వాడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటాన్ని చూసి బాధపడుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు నవంబర్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో విష్ కాలేజీకి వెళ్తున్నాం అని మహేంద్ర కి చెప్తారు రిషి దంపతులు. ఇప్పుడు అక్కడికి ఎందుకు అంటాడు మహేంద్ర. వాళ్లు మమ్మల్ని ఇన్వైట్ చేశారు మీరు కూడా మాతోపాటు వస్తున్నారు, రెడీ అవ్వండి అంటాడు రిషి. రాలేను మీరు వెళ్ళండి అంటాడు మహేంద్ర. అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అంటాడు రిషి. ఇప్పుడు నన్ను ఎందుకు అంత బలవంతం చేస్తున్నారు?
మీ భయం నాకు అర్థమైంది నేను మీకు మాట ఇస్తున్నాను అసలు తాగను కావాలంటే మీరు వచ్చాక మీ అమ్మని సాక్ష్యం అడగండి అంటాడు మహేంద్ర. అప్పుడు వసుధార మహేంద్రని నాక్కూడా ఒక మాట ఇవ్వండి మేము విష్ కాలేజీకి వెళ్తున్నాం కదా మీరు డిబిఎస్టీ కాలేజీ కి వెళ్ళండి అని చెప్తుంది. నేను వెళ్ళను అక్కడ నాకు జగతితో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి అంటాడు మహేంద్ర.
రిషి కూడా డాడ్ ని ఇబ్బంది పెట్టొద్దు, నేను పెదనాన్నకి ఇన్ఫర్మ్ చేశాను ఆయన చూసుకుంటారు అని చెప్తాడు. మరోవైపు జగతిని హత్య చేసిన స్పాట్లో ఉంటారు ముకుల్, పాండ్యన్. పాండ్యన్ ని అన్ని వివరాలు అడుగుతాడు ముకుల్. ఇంతలో రిషి వాళ్ళు అక్కడికి వస్తారు. ఏంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు అని అడుగుతాడు రిషి. నాకు కొన్ని వివరాలు కావాలి అందుకే రమ్మన్నాను.
అని చెప్పి రిషి దగ్గర నుంచి ఆరోజు జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు. షూట్ చేసిన పొజిషన్ రిషి చూపించడంతో అక్కడికి వెళ్లి అంతా చెక్ చేస్తాడు. మళ్లీ రిషి వాళ్ళ దగ్గరికి వచ్చి షూటర్ ముందుగా రాలేదు, మీతో పాటే వచ్చాడు అతని బైక్ నెంబర్ కూడా మేము సిసి కెమెరాలో చెక్ చేసాము.
అది పట్టుకొని అతని ఇంటికి వెళ్తే అతను చనిపోయి ఉన్నాడని తెలిసింది. అతని ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్నాము. వివరాలు అన్నీ తెలిశాక మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను అంటాడు ముకుల్. ముకుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతని కారు డ్రైవర్ శైలేంద్ర కి ఫోన్ చేసి ఈ సార్ మామూలు ఆయన కాదు ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు అని చెప్తాడు.
నువ్వు నాకు ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పి అతని అకౌంట్లో డబ్బులు వేస్తాడు శైలేంద్ర. తర్వాత ముకుల్ రావటంతో ఫోన్ పెట్టేసి అక్కడినుంచి వెళ్ళిపోతారు. శైలేంద్ర వాళ్లని పట్టుకోవడం ఆ ఆఫీసర్ తరం కాదు, ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాను అని మనసులో అనుకుంటాడు. మరోవైపు కాలేజీకి వెళ్లిన రిషి వాళ్ళకి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు కాలేజీ వాళ్ళు.
మీరు ఇద్దరూ పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటారు. పాండ్యన్ వాళ్ళు రిషికి వసుధార కి కలిపి దండ వేస్తారు. ఇంతలో విశ్వనాథం, ఏంజెల్ అక్కడికి వస్తారు. వాళ్ళిద్దర్నీ అలా చూసి కోపంతో రగిలిపోతుంది ఏంజెల్. ఏదో మాట్లాడబోతే విశ్వనాథం వారించి మనం ఇంటికి పిలిపించి మాట్లాడదాం ఇక్కడ ఏమీ వద్దు అంటాడు. ఆ తర్వాత లోపల స్టాఫ్ అంతా కూర్చుంటారు.
ప్రిన్సిపల్ కాలేజీకి చేసిన సేవలకు గాను రిషి వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. తర్వాత క్లాసులకి టైం అవ్వటంతో అక్కడినుంచి వెళ్ళిపోతారు. విశ్వనాథం వాళ్లు కూడా బయలుదేరుతూ ఇంటికి వస్తున్నారు కదా, త్వరగా వచ్చేయండి కోపంగా రిషి వాళ్ళతో చెప్పి అక్కడినుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత అనుపమ విశ్వనాథం వాళ్ళ ఇంటికి వస్తుంది.
పనిమనిషిని క్లోజ్డ్ రూమ్ తాళాలు అడుగుతుంది. మీరు ఎవరు మీకు ఆ క్లోజ్ రూమ్స్ సంగతి ఎలా తెలుసు అని అడుగుతుంది పనిమనిషి. ఆ రూమ్ నాదే కానీ నువ్వు వెళ్లి స్ట్రాంగ్ కాఫీ తీసుకొని రా అని ఆర్డర్ వేసి తన రూమ్ వైపు బయలుదేరుతుంది అనుపమ.తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.