Guppedantha Manasu: ఏంజెల్ కు మొదలైన అనుమానం.. నట విశ్వరూపం చూపిస్తున్న దేవయాని!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. తను ప్రేమించిన అమ్మాయిని అసహ్యించుకుంటున్నా ఆమె బాగోగులు చూసుకుంటున్న ఒక ప్రేమికుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజీకి వెళ్లి అట్నుంచి ఇంటికి వెళ్ళిపోతాను అని లగేజ్ సర్దుకొని బయలుదేరుతుంది వసు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు అయినా ఇంట్లో మీ నాన్నగారు కూడా లేరు కదా ఇట్లు మీ వరకు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అంటుంది ఏంజెల్. లేదు మేడం క్లాసులు మిస్ అవుతాయి. పిల్లల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంటుంది వసుధార.
అప్పుడు ఏంజెల్ పక్కనే ఉన్న రిషితో నువ్వైనా చెప్పు రిషి అంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఇబ్బంది పడటం కన్నా ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకోవటమే మంచిది క్లాసులు సంగతి నేను చూస్తాను ప్రిన్సిపల్ సార్ తో మాట్లాడుతాను అంటాడు రిషి ఇంతలోనే విశ్వనాధం వచ్చి ఏంటి విషయం అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తుంది ఏంజెల్. నువ్వు కదలడానికి వీల్లేదు మీ నాన్నగారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు.
నిన్ను బాగా చూసుకుంటున్నాను థాంక్స్ చెప్పారు. అక్కడ పనులు పూర్తయ్యేదాకా రావడం కుదరదు అన్నారు. నేను, రిషి పర్మిషన్ ఇచ్చేదాకా నువ్వు ఇంట్లోంచి కదలటానికి వీల్లేదు అని వసుతో చెప్పి ఏమంటావ్ రిషి అని రిషి ని అడుగుతాడు. నేను కూడా అదే చెప్తున్నాను సార్ అంటాడు రిషి. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా లగేజ్ సర్దకు అని వసు దగ్గర బ్యాగ్ తీసుకొని ఆమెని లోపలికి తీసుకు వెళ్తుంది ఏంజెల్.
మరోవైపు గెస్ట్ హౌస్ లో మిషన్ ఎడ్యుకేషన్ కోసం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మహేంద్ర దంపతులు, ఫణీంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన శైలేంద్ర ఏంటి డాడీ వాళ్ళని తీసుకువస్తానని నువ్వు ఇక్కడే ఉండి పోయావు మమ్మీ మీ అందరి కోసం కంగారుపడుతుంది మీ అందరిని తీసుకురమ్మని నన్ను పంపించింది అంటాడు. నిజమే మహేంద్ర దేవయాని ఒక మాట అంటుంది కానీ మనం ఎవరిమీ లేకపోతే తను ఉండలేదు ఇక్కడికి వచ్చినా వచ్చేస్తుంది.
మనమే అక్కడికి వెళ్లి పోదాము అక్కడే వర్క్ చేసుకుందాము అంటాడు ఫణీంద్ర. వెళ్లిపోదాం రిషి లేదంటే శైలేంద్ర కి అనుమానం వస్తుంది అని భర్తకి మెసేజ్ పెడుతుంది జగతి. మెసేజ్ చూసిన మహేంద్ర సరే అన్నయ్య నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను అని ఫణీంద్ర తో పాటు బయలుదేరుతారు మహేంద్ర దంపతులు. మరోవైపు టేబుల్ మీద ఉన్న టాబ్లెట్ బాక్స్ చూసి ఇదేంటి ఇక్కడ ఉంది..
వసుధార వేసుకుందో లేదో అని ఏంజెల్ ని పిలుస్తాడు రిషి. కిచెన్లో ఉన్న ఏంజెల్ రిషి దగ్గరికి వస్తుంది అప్పుడే వసుధార కూడా అక్కడికి వస్తుంది. ఎందుకు పిలిచావు అని ఏంజెల్ అడిగితే టాబ్లెట్ బాక్స్ ఇక్కడ ఎందుకు ఉంది తన రూమ్ లో కదా ఉండాలి టాబ్లెట్స్ వేసుకోవటం లేదా అని అడుగుతాడు రిషి. అదంతా నిజమే కానీ ఈ విషయం చెప్పడానికి నన్ను పిలవాలా.. నీ పక్కనే ఉంది కదా వసుధర తనని అడగొచ్చు కదా అంటుంది ఏంజెల్.
మీరిద్దరిని అప్పటినుంచి గమనిస్తున్నాను వసుధార ఎక్కడికి వచ్చిన దగ్గరనుంచి అసలు మీరిద్దరూ మాట్లాడుకోలేదు మీ ఇద్దరికీ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అడుగుతుంది ఏంజెల్. అలాంటిదేమీ లేదు అంటాడు రిషి. తను ఎలాగూ చెప్పడు నువ్వైనా చెప్పు అని వసుని అడుగుతుంది ఏంజెల్. తను కూడా మాట్లాడకపోవడంతో నేను ఇంట్రో వర్డ్స్ ని చూసాను కానీ మరీ ఇంత ఇంట్రో వర్డ్స్ ని చూడలేదు అంటుంది ఏంజెల్.
అలాంటిదేమీ లేదు కానీ తనని టాబ్లెట్స్ వేసుకోమని చెప్పు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఈ మనుషులు నాకు ఎప్పటికీ అర్థం కారు అనుకుంటూ ఏంజెల్ కూడా కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. నామీద కోప్పడితోనే నా మీద శ్రద్ధ తీసుకుంటున్నారు పైకి మాత్రం ప్రేమ లేదు అంటున్నారు నిజంగా మీరు జెంటిల్మెన్ సార్ అని మనసులోనే ఆనందపడుతుంది వసుధార. మరోవైపు శైలేంద్ర వాళ్ళు ఇంకా రాకపోవడంతో దేవయాని కంగారుపడుతూ ఉంటుంది.
మహేంద్ర కి నిజం తెలిసిపోయింది ఏమో అనుకుంటుంది. ఇంతలోనే శైలేంద్ర వాళ్ళు ఇంటికి రావడంతో కంగారుగా బయటకు వస్తుంది. మీరు వెళ్లిన దగ్గర్నుంచి నాకు నిద్ర పట్టలేదు అయినా లంకంత కొంపలో మేం మాత్రమే ఎలా ఉండగలం అంటూ తెగ నటించేస్తూ ఉంటుంది. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.