- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: పరంధామయ్యను దారుణంగా అవమానించిన అనసూయ.. అనసూయకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తులసి?
Intinti Gruhalakshmi: పరంధామయ్యను దారుణంగా అవమానించిన అనసూయ.. అనసూయకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్లో అనసూయ పరందామయ్యని నిందిస్తూ నన్ను నోరు మూసుకొని ఇంటికి వెళ్ళమంటారా అని అనగా వెంటనే పరందామయ్య నువ్వు చేసిన దానికి నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను తెలుసా నా మౌనం అని అంటాడు. నీ నాలుక మీద ఒక విషపురుగు ఉంటుంది అది ఎప్పుడు సఖ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడేలా చేస్తుంది అని అంటాడు పరంధామయ్య. ఎన్ని చేసిన ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా నిశ్శబ్దంగా భరించాను. ఎంతోమంది నన్ను నోరులేని మొగుడు అంటూ ఎగతాళి చేసేవారు అని బాధపడతాడు పరంధామయ్య. ఆ జనానికి నువ్వు చేసే మంచి పనులు తెలియక నన్ను వెటకారంగా మాట్లాడించాడు అని అంటాడు పరంధామయ్య. ఇప్పటివరకు నువ్వు ఏం చేసినా భరించాను.
ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అనసూయ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని అనగా వెంటనే అనసూయ నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అనడంతో వెంటనే పరంధామయ్య వెళ్లాల్సిందే అని జీవితం మీ వల్ల నాశనమైంది అనడంతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు ఎవరు నీ జీవితాన్ని నాశనం చేయలేదు అని అంటాడు పరంధామయ్య. ఇప్పుడు అనసూయ తులసి గురించి తప్పుగా మాట్లాడడంతో ఇంకొక్కసారి నా కూతురు పేరు ఎత్తావంటే మర్యాదగా ఉండదు అనటంతో ఒక్కసారి కాదు 100 సార్లు 1000 సార్లు దీని పేరు ఎత్తుతాను అని రెచ్చిపోయి మాట్లాడుతుంది అనసూయ.
ఇప్పుడు అనసూయ ఈ ముసలోళ్ళు భలే స్టామినా ఉంది గంట నుంచి పోరాడుతున్నారు. నాకు భలే కుటుంబం దొరికింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పరంధామయ్య నేతలు జోడించి అడుగుతాను వెళ్ళిపో అనగా వెంటనే అనసూయ నా కాళ్లు పట్టుకున్న ఇక్కడి నుంచి నేను వెళ్లి పోను అని అంటుంది. ఇప్పుడు తులసి మాట అనే ముందు కోపంలో ఆలోచించి అనండి అని అంటుంది. అప్పుడు తులసీని దూరంగా నెట్టివేస్తుంది అనసూయ. అప్పుడు అనసూయ పెళ్లి రోజులను గుర్తు చేసుకుంటూ పరంధామయ్యని ఘోరంగా అవమానిస్తుంది. అప్పుడు అనసూయ అటువంటి అప్పుడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండాల్సింది అంటూ పరంధామయ్యను మరింత బాధ పెడుతుంది.
అప్పుడు నందు గురించి గొప్పగా చెబుతూ పరంధామయ్యను దారుణంగా అవమానిస్తుంది. తులసి పరంధామయ్యకు సపోర్ట్ చేస్తూ మీరు మాత్రమే కాదు అత్తయ్య మామయ్య గారు కూడా కష్టపడ్డారు కానీ ఆయనకు తెలియదు ఇప్పట్లో డబ్బుకు తప్ప ప్రేమకు విలువ ఉండదని అంటూ ఎమోషనల్ గా పరంధామయ్య గురించి గొప్పగా మాట్లాడుతుంది తులసి. ఏ తండ్రి అయిన తన పిల్లల కోసం ఒకే విధంగా తాపత్రయపడతాడు అత్తయ్య అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది తులసి. అప్పుడు అనసూయ భర్తగా తండ్రిగా అప్పుడు మీరు చేతకాని వారే ఇప్పుడు కూడా మీరు చేతకాని వారే అని అంటుంది.
అప్పుడు సామ్రాట్ మాట్లాడడంతో సామ్రాట్ ని కూడా అవమానిస్తుంది అనసూయ. అప్పుడు మాధవిని కూడా దారుణంగా అవమానించడంతో వెంటనే నానమ్మ పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు అనడంతో ప్రేమ్ చెంప చెల్లుమనిపిస్తుంది అనసూయ. ఎవరు మాట్లాడొద్దు మీరందరూ కలిసి నాశనం చేశారు అంటూ అక్కడున్న వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటుంది అనసూయ. ఇప్పుడు అనసూయ ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇప్పటినుంచి మన ఇంట్లో మీరు నోరు మూసుకొని ఒక మూలన పడి ఉండాల్సిందే అని అంటుంది. నేను తండ్రిని కాదు మంచి మొగుణ్ణి కాదు అన్నప్పుడు నాకు ఆ ఇంట్లో స్థానం లేదు నేను ఒంటరిగా మిగిలిపోయాను అనసూయ అంటూ ఎమోషనల్ అవుతాడు.
ఇప్పుడు నేను వెళ్ళను అంటూ పరంధామయ్య కింద పడిపోతాడు. అప్పుడు అనసూయ మీ నాటకాలు చాలు అనటంతో తులసి గుడ్లు ఎర్ర చేసి చాలు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు మామయ్య మీద ఒట్టేసి చెబుతున్నాను మీకు మాత్రమే కోపము కాదు నాకు కూడా కోపం ఉంది. నాకు పిచ్చెక్కితే ఎలా ఉంటుందో మీరు ఒక్క మాట మాట్లాడి చూడండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది తులసి. అప్పుడు అనసూయ మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు ఆ ఇంటికి నేను అస్సలు పంపండి మామయ్య మీరు ఇక్కడే జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది తులసి. ఇది మన ఇల్లు మీరిక్కడే ఉండండి. ఈరోజు నుంచి నాకు మీ తాతయ్యకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది.