MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • చెప్పు తెగుద్ది.. అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్‌, ఫైర్ అయిన స్టార్ యాంకర్, కారణం ఇదే?

చెప్పు తెగుద్ది.. అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్‌, ఫైర్ అయిన స్టార్ యాంకర్, కారణం ఇదే?

స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతీ సారి సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసే అనసూయ, ఈసారి డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 02 2025, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Instagram/ Anasuya Bharadwaj

అనసూయ స్టార్ డమ్

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆతరువాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇటు యాంకర్ గా బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించి, అటు నటిగా కూడా అద్భుతమైన పాత్రలు చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతుంది. జబర్థస్త్ ద్వారా ఫేమస్ అయిన అనసూయ, వెండితెరపై రంగస్థలం, పుష్ప లాంటి పెద్ద సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసింది. ఇక అనసూయ లీడ్ క్యారెక్టర్ చేస్తూ చాలా సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. ఇటు నటిగా కంటీన్యూ అవుతూనే అటు సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా అనసూయ కొనసాగుతున్నారు. అంతే కాదు యాడ్స్ ద్వారా బ్రాండ్ ఓపెనింగ్స్ తో ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడిపేస్తోంది అనసూయ.  చేతి నిండా సంపాదిస్తోంది కూడా. 

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kasam Fashions (@kasamfashions)

DID YOU
KNOW
?
అనసూయ ఇన్ స్టా ఫాలోవర్స్
స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఇన్ స్టా గ్రామ్ లోనే అనసూయను 16 లక్షలకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Instagram/Anasuya Bharadwaj

అనసూయ వివాదాలు

అనసూయ తన కెరీర్ లో చాలా వివాదాలు ఫేస్ చేశారు. కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటుల కామెంట్ల కు కూడా ఆమె కౌంటర్ ఇచ్చి హైలెట్ అయ్యారు. విజయ్ దేవరకొండ తో సోషల్ మీడియా వివాదం గురించి అందరికి తెలిసిందే. ఇక అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై, యాంకరింగ్ స్టైల్ పై ఎన్నో విమర్శలు ఫేస్ చేస్తూ వచ్చింది. అంతే కాదు తన భర్త, పిల్లల విషయంలో కూడా ఈ స్టార్ యాంకర్ ట్రోల్స్ ఎదుర్కోక తప్పలేదు. అయితే ప్రతీ దానికి ఆమె ఘాటుగా రిప్లే ఇస్తూ వస్తోంది. ఏ విషయంలోను తగ్గకుండా ఫైర్ బ్రాండ్ అన్న పేరు తెచ్చుకుంది అనసూయ.

35
Image Credit : instagram / Anasuya

అనసూయ ఫైర్

తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు అనసూయ. ఓ ఈవెంట్ లో ఆమెపై కొందరు యువకులు అసభ్య వ్యాఖ్యలు చేయడంతో, వారి ప్రవర్తనపై ఆమె ఘాటుగా స్పందించింది. ఇది ఎంత వరకూ కరెక్ట్ అంటూ వారిని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యూత్ ఆడియన్స్ హాజరయ్యారు. ఇక వారిని ఉద్దేశించి అనసూయ మాట్లాడుతుండగా, కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకర కామెంట్లు చేశారు.

45
Image Credit : Instagram / Anasuya

చెప్పు తెగుద్ది అంటూ ఆగ్రహం

ఈ పరిస్థితిని గమనించిన అనసూయ తీవ్రంగా స్పందించింది. "చెప్పు తెగుద్ది" అంటూ వారిని హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ, "మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య లేదా మీ కాబోయే భార్యపై ఇలా కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలానే మిమ్మల్ని మీరే ఓపికతో చూస్తారా? పెద్దవారిని గౌరవించాలన్న సంస్కారం మీ ఇంట్లో నేర్పించలేదా?" అంటూ యువకుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ.

55
Image Credit : i nstagram / Anasuya

అనసూయకు సోషల్ మీడియా నుంచి సపోర్ట్

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి భారీగా షేర్ అవుతున్నాయి. అనసూయ మాటల్లో కనిపించిన ఆవేశం, బాధ అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ కు కూడా కోపం తెప్పిస్తున్నాయి. దాంతో జనాలు కూడా ఆలోచనలో పడ్డారు. అనసూయ నటిగా మాత్రమే కాకుండా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గానూ గుర్తింపు పొందారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.ఇక అనసూయపై జరిగిన ఈ ఘటన విషయంలో ఆమె చేసిన కామెంట్స్ కు సోషల్ మీడియాలో మద్దతు పెరిగింది.

ఒకపక్క టీవీ యాంకర్‌గా, మరోపక్క సినీ నటి‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్‌ పై ఇలా బహిరంగంగా అగౌరవపర్చుతూ కామెంట్లు చేయడం. అసభ్యంగా ప్రవర్తించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో పాల్గొన్న యువకులపై స్థానికంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అనసూయ స్పందించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలా ప్రతి మహిళ ధైర్యంగా ఎదిరిస్తేనే మార్పు వస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Recommended image2
Salman Khan: రియాలిటీ షోలో షర్ట్ విప్పి ఫిజిక్‌ చూపిస్తూ ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన సల్మాన్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌
Recommended image3
Tamannaah Aadhaar Photo: ఆధార్ కార్డులో ఇంత క్యూట్‌గానా? తమన్నా ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్
Related Stories
Recommended image1
చిరంజీవి,నాగార్జున క్రష్ గా రష్మిక మందన్న, శ్రీవల్లిపై స్టార్ హీరోల బోల్డ్ కామెంట్స్
Recommended image2
మురళీ మోహన్ కాలర్ పట్టుకున్న మోహన్ బాబు, గెట్ అవుట్ అంటూ వెళ్లగొట్టిన స్టార్ నటుడు, కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved