- Home
- Entertainment
- చిరంజీవి,నాగార్జున క్రష్ గా రష్మిక మందన్న, శ్రీవల్లిపై స్టార్ హీరోల బోల్డ్ కామెంట్స్
చిరంజీవి,నాగార్జున క్రష్ గా రష్మిక మందన్న, శ్రీవల్లిపై స్టార్ హీరోల బోల్డ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నేషనల్ క్రష్ మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునకు కూడా క్రష్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ ఇద్దరు హీరోలు ఓ ఈవెంట్ లో వెల్లడించడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది

ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేరా’ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదలై ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో థ్రిల్లర్ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసి విజయోత్సవాన్ని జరుపుకుంది. ఆమధ్యన జరిగిన సక్సెస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రష్మిక మందన్న పై చిరంజీవి - నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
KNOW
రష్మికపై నాగార్జున కామెంట్స్
ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ, "తెరపై రష్మికను చూస్తుంటే శ్రీదేవి గారు 'క్షణక్షణం'లో ఎలా కనిపించారో అదే గుర్తొస్తోంది. నిజంగా చాలా ఫ్రేముల్లో అద్భుతంగా కనిపించింది రష్మిక. అందుకే పుష్ప తర్వాత అందరూ ఆమెను నేషనల్ క్రష్ అంటున్నారు. ఇక ఈ సినిమా వల్ల ఆమె నా క్రష్ కూడా అయింది. నువ్వు ఈ సినిమాలో చాలా అందంగా కనిపించావు. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం,” అని చెప్పి నాగార్జున షాక్ ఇచ్చారు. ఈ కామెంట్స్ తో అందరు ఆశ్చర్యపోయారు. ఇక రష్మిక అయితే సంతోషంలో తేలిపోయింది.
"Watching #Rashmika on screen reminded me of Sridevi Garu from Kshana Kshanam."
— #Nagarjuna | #Kuberaapic.twitter.com/Q6ro3XHGo8— Movies4u Official (@Movies4u_Officl) June 22, 2025
సౌందర్య గుర్తుకువస్తుందన్న చిరంజీవి
ఇక నాగార్జున తరువాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ మాట్లాడుతూ “నువ్వు నా డైలాగ్ చెప్పావు నాగ్. రష్మిక నీ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్‌కి కూడా నేనే గెస్ట్‌గా వచ్చాను. అప్పటి నుంచి నీ అభినయాన్ని గమనిస్తున్నా . సినిమా సినిమాకి నీ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. కుబేరా సినిమాలో రష్మిక మొదట్లో మోసపోయే సీన్ చూస్తే నాకు సౌందర్య గుర్తుకు తెచ్చింది. క్లైమాక్స్ ముందు చిన్న పిల్లాడిని చేతిలో పట్టుకున్నప్పుడు నీ యాక్టింగ్ అసాధారణంగా ఉంది. స్క్రీన్ మీద నువ్వు కనిపిస్తే నీ కళ్లకే పడిపోతాం. నువ్వు కళ్లతోనే నటించగలవు. నువ్వు నేషనల్ క్రష్ కాదు… ఇంటర్నేషనల్ క్రష్’’ అంటూ చిరంజీవి రష్మికపై ప్రశంసలు కురిపించారు.ఈ మాటలు విన్న రష్మిక పొంగిపోయింది.
#RashmikaMandanna is my Crush also - #Chiranjeevi#Nagarjuna#Kuberaa#TeluguFilmNagarhttps://t.co/0RF4lXngsrpic.twitter.com/CmiIQleqdX
— Telugu FilmNagar (@telugufilmnagar) June 22, 2025
పవర్‌హౌస్ ఆఫ్ టాలెంట్ అన్న నాగార్జున
ఇది మొదటిసారి కాదు. నాగార్జున గతంలో కూడా రష్మికను ప్రశంసించారు. ‘కుబేరా’ మూడో పాట ‘పిప్పి పిప్పిడుమ్ డుమ్ డుమ్’ ఆడియో లాంచ్ సందర్భంగా ఆమెను "పవర్‌హౌస్ ఆఫ్ టాలెంట్"గా అభివర్ణించారు. గత మూడేళ్లలో ఆమె సినిమా ప్రస్థానం ఎంతో ప్రబలంగా ఉందని, ఇతర నటులెవరూ 2000–3000 కోట్ల విలువైన ప్రాజెక్టులలో లేరని ఆయన అన్నారు.
కుబేరా సినిమా వివరాలు
‘కుబేరా’ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా, తెలుగు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈసినిమా కన్నడ, మలయాళంలో డబ్బింగ్ అయ్యి విడుదలైంది. ఈ సినిమాలో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో కనిపిస్తే, నాగార్జున ఓ తెలివైన సీబీఐ ఆఫీసర్‌గా కనిపిస్తారు. వీరిద్దరూ కలసి ఓ శక్తివంతమైన బిజినెస్ టైకూన్‌తో సంబంధం ఉన్న భారీ స్కాం వెనుక ఉన్న నిజాలను ఎలా వెలికితీశారు అనేది కథ. జిమ్ సార్భ్, దలీప్ తాహిల్, సయాజీ షిండే వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
కుబేరా కలెక్షన్లు
కుబేర సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో 104 కోట్లు వసూలు చేసింది, ఇందులో ఇండియా నుంచి 78 కోట్లుమిగిలిన 26 కోట్లు ఓవర్ సిస్ మార్కెట్ల నుండి వచ్చాయి. ఓవర్ ఆల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 132 కోట్లు రాబట్టింది, బ్రేక్-ఈవెన్ సాధించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.