- Home
- Entertainment
- 1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
2025లో చాలా మంది హీరోయిన్లు వెండితెరపై సందడి చేశారు. అభిమానుల మనసు దోచుకున్నారు. కానీ, ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎవరి సినిమాలు ఎక్కువ వసూళ్లు సాధించాయో తెలుసా? టాప్ 5 లో ముందున్న స్టార్ ఎవరు?

1. రష్మిక మందన్న
2025లో పాన్ ఇండియా స్థాయిలో బిజీయెస్ట్ హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన్న. ఈ ఏడాది హిందీలో ఆమె నటించిన ఛావా, సికందర్, తమ్మ, తమిళంలో కుబేర, తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ సహా మొత్తం 5 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఛావా, సికందర్, తమ్మ, కుబేర చిత్రాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఈ ఐదు చిత్రాల మొత్తం బాక్సాఫీస్ వసూళ్లు 1347.71 కోట్లు. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్‌గా రష్మిక అగ్రస్థానంలో నిలిచింది.
2. రుక్మిణి వసంత్
రష్మిక తర్వాత అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ రుక్మిణి వసంత్. ఈ ఏడాది ఆమె నటించిన కాంతార చాప్టర్ 1, ఏస్, మదరాసి అనే మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదలయ్యాయి. వీటిలో కాంతార ఛాప్టర్ 1, మదరాసి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. మదరాసిలో శివకార్తికేయన్‌కు, ఏస్‌లో విజయ్ సేతుపతికి జోడీగా నటించింది. ఈ ఏడాది రుక్మిణి నటించిన చిత్రాల మొత్తం వసూళ్లు 962.33 కోట్లు.
3. సారా అర్జున్
ఈ జాబితాలో ఆశ్చర్యపరిచే పేరు సారా అర్జున్. ఈమె మరెవరో కాదు, 'నాన్న' చిత్రంలో విక్రమ్ కూతురిగా నటించిన నటి. ప్రస్తుతం హిందీలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్' తో నటించి, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తొలి చిత్రమే బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే 836.75 కోట్లు వసూలు చేయడంతో, సారా ఈ జాబితాలో 3వ స్థానం సంపాదించింది.
4. అనీత్ పడ్డా
2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ల జాబితాలో అనీత్ పడ్డా 4వ స్థానంలో ఉంది. ఆమె తన తొలి చిత్రంతోనే 570.33 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది హిందీలో విడుదలై విజయం సాధించిన 'సైయారా' చిత్రంలో అనీత్ పడ్డా హీరోయిన్ గా నటించింది.
5. కియారా అద్వానీ
2025కి అన్‌లక్కీ హీరోయిన్ ఎవరంటే కియారా అద్వానీ నే. ఈ ఏడాది ఆమె నటించిన 'గేమ్ ఛేంజర్', 'వార్ 2' అనే రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు ఘోర పరాజయం పొందాయి. ఈ రెండు చిత్రాల మొత్తం వసూళ్లు 550.63 కోట్లు. దీంతో కియారా అద్వానీ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.

