MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..

గత కొద్ది కాలంగా జరుగుతున్న అనసూయ వివాదం కీలక మలుపు తీసుకుంది. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ 42 మందిపై స్టార్ నటి కేసులు పెట్టింది. పరువునష్టం, లైంగిక వేధింపులతో పాటు క్రిమినల్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 16 2026, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అనసూయ పరువునష్టం కేసు
Image Credit : youtube/@iDreamCelebrities

అనసూయ పరువునష్టం కేసు

ప్రముఖ సినీ, టీవీ నటి అనసూయ భరద్వాజ్ తనపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై పోలీసులను ఆశ్రయించింది. పరువునష్టం, లైంగిక వేధింపులతో పాటు క్రిమినల్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారని,  మార్ఫింగ్ చేసిన  ఫోటోలు, వీడియోలను కావాలనే సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె పిర్యాదుపై వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలువురు వ్యక్తులు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను నిందితులుగా చేర్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గౌరవప్రదంగా స్పందించాను తప్పా..
Image Credit : youtube/@iDreamCelebrities

గౌరవప్రదంగా స్పందించాను తప్పా..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అనసూయ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో జనవరి 12, 2026న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.  అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఏం జరిగిందంటే..? డిసెంబర్ 22, 2025న ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న ఒక తెలుగు నటుడు( శివాజీ) మహిళల దుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని .. ఆ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయని పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు, డిసెంబర్ 23న, ఒక మాల్ ఓపెనింగ్ కు వెళ్లిన సమయంలో మీడియా ప్రతినిధులు ఈ వివాదంపై తన అభిప్రాయం అడిగారని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సపోర్ట్ గా  తాను గౌరవప్రదంగా స్పందించానని, అనసూయ అన్నారు.

Related Articles

Related image1
ప్రభాస్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూశారా? 7 స్టార్స్ ను గుర్తుపట్టడం కష్టమే.?
Related image2
150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
35
అన్ని రకాలుగా పరువుతీస్తున్నారు..
Image Credit : Instagram/@itsme_anasuya

అన్ని రకాలుగా పరువుతీస్తున్నారు..

అయితే, డిసెంబర్ 24న ఆ నటుడు ప్రెస్ మీట్ నిర్వహించి తన పేరు ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలపై మాట్లాడారని అనసూయ ఆరోపించారు. ఆ తర్వాత కొన్ని టీవీ ఛానెళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు, ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్లు ఈ అంశాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసారం చేసి, తనను లక్ష్యంగా చేసుకుని వివాదాన్ని మరింత పెంచారని ఆమె పేర్కొన్నారు. 

అప్పటి నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సైట్స్ లో  తనపై పెద్ద ఎత్తున దాడి మొదలైందని అనసూయ ఫిర్యాదులో తెలిపారు. టీవీ చర్చలు, యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, లైవ్ స్ట్రీమ్స్ ..కామెంట్ సెక్షన్లలో అసభ్య పదజాలంతో తనను దూషించారని పేర్కొన్నారు.

45
తీవ్ర మానసిక ఒత్తిడి, భయానికి గురయ్యాము
Image Credit : youtube/@iDreamCelebrities

తీవ్ర మానసిక ఒత్తిడి, భయానికి గురయ్యాము

లైంగికంగా కించపరిచే వ్యాఖ్యలు, పరువు నష్టం కలిగించే పోస్టులు తన గౌరవానికి, వృత్తికి, పబ్లిక్ ఇమేజ్‌కు భంగం కలిగించాయని వివరించారు. అంతే కాదు మాటలతో మాత్రమే కాకుండా.. ఏఐ తో ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేసి.. తనను కించపరిచేలా.. ఆన్ లైన్ లో వైరల్ చేస్తున్నారని. యూట్యూబ్ ఛానెళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని లైంగికంగా కించపరుస్తూ క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డారని..ఈ చర్యల వల్ల తాను, తన కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి, భయానికి గురయ్యామని కంప్లైంట్ లో ఆమె పేర్కొన్నారు. .

55
42 మంది సెలబ్రిటీలపై అనసూయ కేసు..
Image Credit : instagram/anasuya bharadwaj

42 మంది సెలబ్రిటీలపై అనసూయ కేసు..

ఈ కేసులో మొత్తం 42 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో నటి కరాటే కల్యాణి, టీవీ యాంకర్ రోహిత్, న్యూస్ నెట్‌వర్క్ యాంకర్ మనోజ్, మరోక యాంకర్ బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియా చౌదరి గొగినేని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పావని, ఆర్టిస్ట్ శేఖర్ బాషా , అడ్వకేట్ రజని, తదితరులు ఉన్నారు. పలువురు గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు దశలో ఉందని అధికారులు వెల్లడించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనసూయ భరద్వాజ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Recommended image2
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ
Recommended image3
Irumudi Collections: రవితేజ ఇప్పట్లో తగ్గేట్టు లేడుగా.. 18 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
ప్రభాస్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూశారా? 7 స్టార్స్ ను గుర్తుపట్టడం కష్టమే.?
Recommended image2
150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved