- Home
- Entertainment
- 150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
150 కోట్ల ఇల్లు, 7 కోట్ల కారు, రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి ఎంత? రెమ్యునరేషన్ వివరాలు?
సౌత్ సూపర్ స్టార్ ధనుష్ మరోసారి తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. మీడియా కథనాల ప్రకారం, ఆయన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధనుష్ ఆస్తులు, ఆదాయం, వ్యాపారాలు, రెమ్యునరేషన్ వివరాలు తెలుసా?

ధనుష్ రెండో పెళ్లిపై చర్చ..
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురిని ప్రేమించి పెళ్లాడి, 18 ఏళ్ల తరువాత విడాకులు తీసుకున్న సూపర్ స్టార్ ధనుష్.. మళ్లీ ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. ఆయనకు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో ఎఫైర్ ఉందని, ఇద్దరూ ఫిబ్రవరి 2026లో పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.
ధనుష్ ఆస్తుల విలువ ఎంత?
రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆయన హాలీవుడ్, బాలీవుడ్, సౌత్‌లో 50కి పైగా సినిమాల్లో నటించారు. నివేదికల ప్రకారం, ఆయన దాదాపు 230 కోట్ల ఆస్తికి యజమాని. ఇంకా ఎక్కువే ఉండొచ్చని సమాచారం.
ధనుష్ వార్షిక ఆదాయం ఎంత?
ధనుష్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం 35 నుంచి 45 కోట్ల మధ్య ఉంటుంది. ఆయన నెలసరి ఆదాయం దాదాపు 3 కోట్లు. ప్రతి సినిమాకు 20 నుంచి 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట స్టార్ హీరో.
ధనుష్ ఆస్తులు-బంగ్లా
2023 నుంచి ధనుష్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఒక అందమైన విల్లాలో ఉంటున్నారు. దీని విలువ సుమారు 150 కోట్లు అని చెబుతారు. ఇది ఆయన మాజీ మామ రజనీకాంత్ ఇంటికి దగ్గరలోనే ఉంది. చెన్నైలోని అల్వార్‌పేట్‌లో కూడా ఆయనకు ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో టెర్రస్ గార్డెన్, మాడ్యులర్ కిచెన్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
ధనుష్ కార్ కలెక్షన్
ధనుష్ వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటిలో 7 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, 34 లక్షల బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, 45 లక్షల ప్రీమియం కారు జాగ్వార్ ఎక్స్‌ఈ, 75 లక్షల అమెరికన్ కారు ఫోర్డ్ మస్టాంగ్ జీటీ ఉన్నాయి. గతంలో ఆయన వద్ద ఆడి ఎ8 (1.6 కోట్లు), రేంజ్ రోవర్ స్పోర్ట్ హెచ్‌ఎస్‌ఈ కూడా ఉండేవి.
ధనుష్ వ్యాపారాలు
ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ సహ-వ్యవస్థాపకుడు. దీని కింద కాకా ముట్టై, విసారణై లాంటి ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఆయన నటుడిగానే కాక దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత కూడా. వీటి ద్వారా కూడా ఆయన భారీగా సంపాదిస్తున్నారు. ధనుష్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.

