- Home
- Entertainment
- ఆ రోజు మా పిల్లల్ని కూడా దూరంగా ఉంచుతాం.. నా భర్తతో ఫిజికల్ గా, ఎమోషనల్ గా దగ్గరగా ఉంటా
ఆ రోజు మా పిల్లల్ని కూడా దూరంగా ఉంచుతాం.. నా భర్తతో ఫిజికల్ గా, ఎమోషనల్ గా దగ్గరగా ఉంటా
టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా తన అభిప్రాయాల్ని అనసూయ ధైర్యంగా చెబుతూ ఉంటుంది. కొన్నిసార్లు బోల్డ్ గా కూడా మాట్లాడుతుంది.

Anasuya Bharadwaj
టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా తన అభిప్రాయాల్ని అనసూయ ధైర్యంగా చెబుతూ ఉంటుంది. కొన్నిసార్లు బోల్డ్ గా కూడా మాట్లాడుతుంది. హలో బోల్డ్ గా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో అనసూయ ట్రోలింగ్ కు గురవుతోంది.
Anasuya Bharadwaj
అనసూయ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. భార్య భర్తల రిలేషన్ గురించి అనసూయ బోల్డ్ గా కొన్ని కామెంట్స్ చేసింది. ఈ షో కి అనసూయ తన భర్త సుశాంత్ భరద్వాజ్ తో కలిసి హాజరైంది. అనసూయ మాట్లాడుతూ ఇప్పటికీ తాను తన భర్త గొడవ పడుతుంటామని అనసూయ పేర్కొంది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య సహజంగా గొడవలు ఉంటాయి. గొడవలు లేకపోతే అది అసలు రిలేషనే కాదు అని పేర్కొంది.
Anasuya Bharadwaj
ఇప్పటికీ నేను మా ఆయనతో గొడవపడి అప్పుడప్పుడు మా పుట్టింటికి వెళ్ళిపోతుంటాను. అది నాకు ఒక సరదా. మా ఆయన ఎప్పుడు గొడవ పడినప్పుడు మాత్రమే కాదు సంతోషంగా ఉన్నప్పుడు కూడా మీ పుట్టింటికి వెళ్ళు అని చెబుతుంటారు. ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేస్తే మా ఆయనతో గొడవ పడినట్లు మీరు అర్థం చేసుకోవచ్చు.
Anasuya Bharadwaj
అదే సమయంలో మా ఇద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి. ఇద్దరం కలిసి డేట్ కి వెళతాం. పెళ్లిరోజు వచ్చిందంటే మా పిల్లల్ని కూడా దూరంగా ఉంచుతా. వాళ్లని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తా. పెళ్లిరోజు అనేది నాకు నా భర్తకు మాత్రమే సంబంధించినది. ఆరోజు మేమిద్దరం ఇంటిమసీ గా ఉండడం చాలా అవసరం. ఆరోజు నేను నా భర్త ఫిజికల్ గా, ఎమోషనల్ గా దగ్గరగా ఉంటాం అని అనసూయ పేర్కొంది.
Anasuya Bharadwaj
అనసూయ ఇలా బోల్డ్ గా తన అభిప్రాయాలు చెప్పడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అనసూయ కామెంట్స్ ని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ఎవరి పర్సనల్ లైఫ్ విషయాల్ని వాళ్లే గోప్యంగా ఉంచుకోవాలి అని చెబుతున్నారు.