MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: అభికి 'సపోర్ట్'గా అనసూయ.. తులసిని చూసి కుళ్ళకుంటున్న నందు, లాస్య!

Intinti Gruhalakshmi: అభికి 'సపోర్ట్'గా అనసూయ.. తులసిని చూసి కుళ్ళకుంటున్న నందు, లాస్య!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

5 Min read
Author : Navya G
Published : Sep 29 2022, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..అభి,తులసి దగ్గరికి వెళ్లి, అమ్మ నాకు నీ మీద కోపం లేదమ్మా కానీ నువ్వు అందరి ముందు తప్పు అవ్వకూడదు అని నేను ముందు జాగ్రత్త పడుతున్నానమ్మా. నువ్వంటే నాకు ప్రాణం అంతేకానీ నీకు ద్రోహం చేయాలి అని ఉద్దేశం ఏమీ లేదు నువ్వు అందరి ముందు నవ్వులపాలు కాకూడదు అని నేను అలా అన్నాను కానీ ఎవరో ఏదో చెప్పారు అని నేను అలా చేయనమ్మ నాకు నువ్వంటే ఇష్టము అని తులసి కాళ్ళ మీద పడి వెళ్లి హద్దుకుంటాడు. అప్పుడు తులసి ఏడుస్తూ, నాకు తెలుసు నాన్న.నేను ప్రతిరోజు కంగారు పడుతూనే ఉంటాను మన కుటుంబానికి నష్టం చేసే పని నేను ఎప్పుడూ చేయను. ఒకవేళ నేను పొరపాటున తప్పు చేసిన సరే దానిని నిలదీసే హక్కు, ఇంటి వాళ్లకు ఉన్నది నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అంతకు వెయ్యిరట్లు ఎక్కువ నేను నిన్ను తిరిగి ప్రేమిస్తాను అభి. ఏ రోజైతే నేను ఇంటికి నష్టం కలిగించే పని చేస్తాను ఆ రోజే నా జీవితంలో ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో సామ్రాట్, వాళ్ళ బాబాయ్ తో, కేవలం మ్యూజిక్స్ స్కూల్ గురించి మీటింగ్ అని చెప్తే ఇక్కడ చాలా రచ్చ జరిగింది బాబాయ్. 

27

అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇదే విషయం వాళ్ళ తులసి గారి ఇంట్లో ఈరోజు ఏమై ఉంటుందో. అందరూ తులసి గారిని నిందిస్తూ ఉంటారు కదా అని అనగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్, తులసి ముందే చెప్పింది కదా ఎవరు ఏమన్నా తను వ్యాపార భాగస్వామ్యం మానుకోదు అని అనగా, చెప్పడం వేరు సంఘటన వచ్చినప్పుడు ఎదురుకోవడం వేరు బాబాయ్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో అని అనుకుంటాడు సామ్రాట్. ఆ తర్వాత సీన్లో అభి బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అంకిత భోజనం తెస్తుంది.సారీ అభి నిన్ను నేను అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు భోజనం చేయవా అని అనగా,ఇంత జరిగిన తర్వాత నువ్వు కేవలం క్షమాపణకు చెప్పినంత మాత్రాన బాధపోదు అని అంటాడు అభి.దానికి అంకిత, నా బుజ్జి కదా, నా కన్న కదా సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని వెళ్లి భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత సీన్లో అనసూయ వీధిలో కూరగాయలు కొంటున్నప్పుడు పక్కనున్న అమ్మలక్క లు అందరూ, అయినా అనసూయ నీ కోడలికి అంతా వయసు వచ్చింది కదా! ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా సామ్రాట్ వెనక  పడడం ఏంటి?.
 

37

 అయినా మీ మాజీ కోడలికి నువ్వైనా చెప్పాలి కదా అదుపులో ఉంచాలని అలా గాలికి వదిలేసారా. అయినా సామ్రాట్ బానే సంపాదిస్తాడు కదా దానికోసం ఇంత చేసిన తప్పులేదులెండి. మీ వల్ల మనకు కాలనీకి పరువు పోతుంది మీ ఇంటి పరువు ఎప్పుడో పోయింది అని అంటారు. దానికి అనసూయ కోపంతో మీరేం మాట్లాడుతున్నారు నా కోడలు చాలా మంచిది దాన్ని అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని అనగా, మేము మాత్రమే అనట్లేదు న్యూస్ చూసిన ప్రతి ఒక్కరూ అదే అంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అనేదే హాట్ టాపిక్ గా మారింది. నువ్వు వెళ్లి మీ కోడలికి బుద్ధి చెప్పుకో అని తిడతారు. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తాడు. తులసి గారు అంతా బానే ఉన్నదా నిన్న అలా జరిగింది కదా ఇంట్లో ఏమైనా అయిందా అని అనగా, ఏమైనా నేను ఏం తప్పు చేయలేదు సామ్రాట్ గారు. మా ఇంటిలో నాకు విలువ ఉన్నాది. నేను తప్పు చేయలేదు అని నమ్మకం ఉన్నాది నేను ఆఫీస్ కి వస్తున్నాను అని అంటుంది. అప్పుడు సామ్రాట్ హమ్మయ్య ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. 

47

నేను మీకు ఫోన్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. రేపు హనీ పుట్టినరోజు కనుక తనకి కావాల్సినవన్నీ మీరే చేయాలి అని తను కోరుతుంది. దయచేసి నాకు ఈ ఒక సహాయం చేయండి. అలాగే రేపు కుటుంబంతో సహా మా ఇంటికి రండి అని అంటాడు. సరే తప్పకుండా అని అంటుంది తులసి. ఆ తర్వాత సీన్లో అనసూయ కోపంగా ఇంటికి వచ్చి అందరూ నన్నే అంటున్నారు అసలు వాళ్ళకి బుద్ధుందా అని కోపంతో అంటుంది. అప్పుడు పరంధామయ్య ఏమైంది అని అడగగా, జరిగిన విషయం అంతా చెప్పి,ఇంక తులసిని బయటికి పంపించొద్దు ఇంట్లోనే ఉంచేద్దాము.తను ఆఫీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంత వయసు వచ్చింది కదా ఇంక ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉండకుండా దానికి ఎందుకు ఈ పనులు అని అంటుంది. అప్పుడు అభి, నేను అదే అంటున్నాను నానమ్మ ఇప్పుడే మీకు నా బాధ అర్థం అవుతుంది. ఇంట్లో సంపాదించడానికి ముగ్గురం ఉన్నాము నేను, అంకిత, ప్రేమ్.ఇప్పుడు సంపాదనకి ఏమి అవసరం అమ్మకి అని అంటాడు. అప్పుడు ప్రేమ్, ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం కానీ ఒక సమయంలో అమ్మ సంపాదన లేకపోతే ఇల్లు గడిచేదే కాదు అలాంటి అమ్మని ఇప్పుడు బందీగా ఉంచుదాం అనుకుంటున్నారా అని అంటాడు.

57

అప్పుడు పదందామయ్య అప్పట్లో నీ మనసు ఇలాగే ఉండేది మళ్లీ మంచి దారీ లో పడ్డావు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చేస్తున్నావు ఎందుకని అనసూయ తో అంటాడు. నేను నా మనసు మార్చుకున్నాను అండి నేను మన కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తున్నాను తులసిని ఆ జాబ్ మానేయమని మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా? అని అంటుంది. అప్పుడు అంకిత వాళ్ళు, ఆంటీ ప్రెస్ మీట్ లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పారు కదా అని అనగా నాకు దానికన్నా కుటుంబ పరువే ముఖ్యం అని అనసూయ అంటుంది.అప్పుడు అంకిత, అభి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు అంటే మీరు మొదలుపెట్టారు ఏంటి అమ్మమ్మ అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అనసూయని తిడతారు.ఇంతలో తులసి అక్కడికి వస్తుంది.అప్పుడు పరంధామయ్య తులసి రావడం చూసి తులసి ఇక్కడికి వస్తుంది ఎవరు దీని గురించి ఇప్పుడు వద్దు అని అంటాడు. అప్పుడు తులసి అక్కడికి వచ్చి, ఎందుకు అందరూ ఇక్కడ ఉన్నారు అని అనగా అంకిత, అమ్మమ్మకి మోకాలు నొప్పి అని అంటుంది. దానికి అనసూయ నొప్పులు నాకు కాదు మీ తాతయ్యకి అని అనగా ఎందుకు అత్తయ్య గారు కోపంగా ఉన్నట్టున్నారు అని తులసి అంటుంది. 
 

67

ఏమీ లేదు అని అంటారు మిగిలిన వాళ్ళు. అప్పుడు తులసి, రేపు మన హనీ పుట్టినరోజు అంట సామ్రాట్ గారు అక్కడికి రమ్మన్నారు అని అనగా అనసూయ, మన హనీ ఏంటి ఏదో నువ్వు తొమ్మిది నెలలు కానీ మోసినట్టు. అయినా చీమ చీటికుమన్నా వాళ్లు మనల్ని పిలవడం ఎందుకు అని అనసూయ కోపంతో అంటుంది. మీరు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు అత్తయ్య గారు అని తులసి అనగా, నాకు కోపం వస్తే ఎంత? రాకపోతే ఎంత?ఎవరికి అవసరం అని అంటుంది అనసూయ. అప్పుడు పరంధామయ్య, నీ కీళ్ల నొప్పుల చిరాకు తులసి మీద చూపించొద్దు అని అనసూయతో  చెప్తాడు.అలాగే తులసితో, మేము వస్తున్నాము అని వెళ్లి సామ్రాట్ గారికి చెప్పమ్మా అని అంటాడు. అప్పుడు తులసి, సరే మావయ్య నేను వెళ్తున్నాను అలాగే దివ్య, అత్తయ్య కాళ్ళకి ఆయింట్మెంట్ రాయి అని చెప్పి వెళ్ళిపోతుంది తులసి. అప్పుడు అనసూయ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది,

77

అనసూయ వెనకాతల అభి కూడా వెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో ఆఫీసులో తులసి తన సీట్లో కూర్చుని ఫైల్స్ చూసుకుంటూ ఉంటుంది. దాన్ని చూసిన లాస్య కోపంతో రగిలిపోతుంది.అప్పుడు తులసి ఝాన్సీ ఒకసారి లోపలికి రా అని అంటుంది.ఇంట్లో ఎవరు పిలిచినా పరుగెత్తుకొని వెళ్లే తులసికి ఇప్పుడు ఇంత వైభోగం వచ్చింది అని అనుకుంటుంది. ఇంతలో నందు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ లాస్య అని అనగా, ఏడుపు పోవడానికి మందులు వెతుక్కుంటూ ఉన్నాను. నా గురించి ఆలోచించడం కాదు అక్కడ నీ మాజీ భార్యకు వచ్చిన వైభోగం చూడు అని అంటుంది లాస్య. అప్పుడు నందు తులసివైపు చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ఆ డిజాస్టర్ సినిమా వదులుకుని కెరీర్‌ కాపాడుకున్నాడు.. ఎన్టీఆర్ అడ్డంగా దొరికిపోయాడు
Recommended image2
Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?
Recommended image3
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved