- Home
- Entertainment
- Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
Anasuya Husband: అర్థరాత్రి తాగి భర్త ముందే ఏడ్చేసిన అనసూయ..మూడు సినిమాల్లో ఇలా, ఇంత దారుణమా
అనసూయ ఓ సంఘటన వాళ్ళ అర్థరాత్రి తన భర్తని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసిందట. తాగి మరీ ఏడ్చానని అనసూయ పేర్కొంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

Anasuya Bharadwaj
యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ నటిగా ఎదిగింది. యాంకర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత నటిగా అవకాశాలు వచ్చాయి. కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో అవకాశం రావడంతో ఒక్కసారిగా అనసూయకి నటిగా డిమాండ్ పెరిగింది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి హిట్ చిత్రాల్లో అనసూయకి అవకాశాలు వచ్చాయి.

నటిగా సూపర్ క్రేజ్
రంగస్థలం చిత్రం అనసూయ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ మూవీలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకు ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా రీ సౌండింగ్ బ్లాక్ బస్టర్ అయింది. తక్కువ సమయంలోనే అనసూయ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అయితే అనసూయ తరచుగా వివాదాలు, ట్రోలింగ్ తో వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం.
వరుసగా వివాదాలు
అనసూయ కూడా ట్రోలర్స్ కి బోల్డ్ గా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన సంఘటనని అనసూయ రివీల్ చేసింది. ఆ సంఘటన వల్ల అర్థరాత్రి వెక్కి వెక్కి ఏడ్చినట్లు అనసూయ పేర్కొంది. ఆ రోజు రాత్రి 2 గంటలకు డ్రింక్ చేసి తన భర్తని పట్టుకుని ఏడ్చేసినట్లు అనసూయ తెలిపింది. నేను తాగడాన్ని కూడా వివాదం చేశారు. కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అని అనసూయ తెలిపింది.
తాగుతాను నిజమే
నేను తాగుతాను.. కానీ లిమిటెడ్ గా తీసుకుంటాను అని పేర్కొంది. అసలు ఏడవడానికి కారణాలు ఏంటి అని అడుగగా.. మూడు క్రేజీ సినిమాల్లో ముందుగా నన్ను అనుకున్నారు. కానీ కారణం చెప్పకుండా తొలగించారు. అమ్మాయిని కాబట్టి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. ఎందుకు తీసేశారో కూడా తెలియదు అని అనసూయ తెలిపింది.
అందుకే ఏడ్చేశా
అది జీర్ణించుకోలేక అర్థరాత్రి ఏడ్చేసినట్లు అనసూయ పేర్కొంది. దీనితో నేను తాగుతాని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేశారు. ఎవరెంత ట్రోల్ చేసినా నాకు ఏమీ కాలేదు కదా అని అనసూయ పేర్కొంది.

