MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Roja Selvamani : రోజా లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏఏ కార్లు, ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Roja Selvamani : రోజా లగ్జరీ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏఏ కార్లు, ఎన్ని ఉన్నాయో తెలుసా..?

Roja Selvamani : మాజీ మంత్రి, సినీనటి రోజా వద్ద లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఆమె వద్ద ఏఏ మోడల్ కార్లు ఉన్నాయి… కేవలం వీటి విలువే ఎంతుంటుంది..? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 21 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోజా వద్ద లగ్జరీ కార్ కలెక్షన్..
Image Credit : facebook.com/rojaselvamanirk

రోజా వద్ద లగ్జరీ కార్ కలెక్షన్..

Roja Selvamani : సినీ నటిగా కెరీర్ ప్రారంభించి టాప్ హీరోయిన్ గా ఎదిగారు ఆర్కె రోజా. రాజకీయంగా కూడా ఆమె అత్యున్నత స్థానంలో ఉన్నారు.. ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు. ఇలా సుదీర్ఘకాలంగా సినీ, రాజకీయ జీవితంలో ఉన్న ఆమె భారీగానే ఆస్తులు సంపాదించారు... మంత్రిగా పనిచేసిన ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ, తమిళనాడులో కూడా ఆస్తులున్నాయి.

అయితే రోజా మంత్రిగా ఉండగా కొడుకు కృష్ణ కౌశిక్ కు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డి (Mercedes-Benz GLS 400d) ను కొడుకు కోసం కొనుగోలు చేశారు రోజా... దీని విలువ దాదాపు రూ.1.50 కోట్లు ఉంటుంది. మంత్రిపదవి రాగానే రోజా ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే మంత్రి అయ్యేకంటే ముందే తనవద్ద చాలా కార్లు ఉన్నాయి... ఇవన్నీ తాను హీరోయిన్ గా, టివి ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చిన డబ్బులతో కొనుగోలు చేశానని రోజా చెప్పారు. మంత్రిగా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని... ఆ అవసరం తనకు లేదని వివరణ ఇచ్చారు.

ఇలా రోజా తనవద్ద చాలా కార్లు ఉన్నాయని చెప్పారు... మరి ఆమెవద్ద ఎన్ని కార్లు ఉన్నాయి...? ఏఏ మోడల్స్ ఉన్నాయి..? వాటి మొత్తం విలువ ఎంత..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోజా వద్ద ఉన్న కార్లు ఇవే...
Image Credit : Instagram/Roja Selvamani

రోజా వద్ద ఉన్న కార్లు ఇవే...

1. మహింద్రా XUV500 (Mahindra XUV500 - 2013 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

2. ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavor) - 2007 మోడల్ - తమిళనాడు రిజిస్ట్రేషన్

3. చెవర్లే క్రూజ్ (Chevrolet Cruize) - 2010 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

4. ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) - 2017 మోడల్ - తెలంగాణ రిజిస్ట్రేషన్

5. మహింద్రా స్కార్పియో (Mahindra Scorpio) - 2015 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

6. ఫార్చ్యూనర్ కారు (Fortuner Car) - 2018 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

7. ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavor) - 2020 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

8. బెంజ్ కార్ - సికెడి ఎక్స్167 (Benz Car-CKD X167) - 2022 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

9. ఇసుజు డి-మ్యాక్స్ క్రూ (Isuzu D-Max Crew) - 2019 మోడల్ - ఏపీ రిజిస్ట్రేషన్

రోజా భర్త సెల్వమణి పేరిట టయోటా ఇన్నోవా కారు ఉంది. ఇది 2012 మోడల్... తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉంది. ఇక రోజా కొడుకు వద్ద కూడా ఖరీదైన కారు ఉంది. ఇలా రోజా ఫ్యామిలీ వద్ద 10 కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి... వీటి విలువ రెండు కోట్లకు పైనే ఉంటుంది.

34
 రోజా వద్ద ఎంత బంగారం ఉంది..?
Image Credit : INSTAGRAM/Roja Selvamani

రోజా వద్ద ఎంత బంగారం ఉంది..?

రోజా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం... ఆమె ఫ్యామిలీ వద్ద కిలోన్నరకు పైగా బంగారం ఉంది. రోజా వద్దే ఏకంగా 986 గ్రాములు అంటే కిలో బంగారం ఉంది.. ఇక ఆమె భర్త సెల్వమణి వద్ద 485 గ్రాముల బంగారం ఉంది. పిల్లల వద్ద మరో 190 గ్రాములు ఉంది. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రోజా ఫ్యామిలీవద్ద ఉన్న బంగారం విలువ కోటిన్నర రూపాయలకు పైనే ఉంటుంది.

44
రోజా మొత్తం ఆస్తులెన్ని..?
Image Credit : Instagram/Roja Selvamani

రోజా మొత్తం ఆస్తులెన్ని..?

రోజా సినిమాలు, టీవి షోలు, రాజకీయాల ద్వారా బాగానే సంపాదించారు. ఆమె 2019 అఫిడవిట్ ప్రకారం పది కోట్ల వరకు ఆస్తులున్నాయి. అయితే గత ఎన్నికల నాటికి ఈ ఆస్తులు మరింత పెరిగాయి. అయితే ఆస్తులే కాదు అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు రోజా ప్రకటించారు.. కోటి రూపాయలకు పైనే అప్పులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Recommended image2
Ramayana Movie: ముల్లోకాలకు అధిపతి రావణుడు.. రామాయణ నుంచి యశ్ పోస్టర్ వైరల్
Recommended image3
Thriller Movies: ఒళ్లు గగుర్పొడిచే 5 థ్రిల్లర్ సినిమాలు.. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ గ్యారెంటీ, ఎక్కడ చూడాలంటే?
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
Roja Selvamani : రోజాను హీరోయిన్ ని చేసింది చంద్రబాబు క్లోజ్ ఫ్రెండే.. రాజకీయ గురువూ ఆయనే.. ఎవరో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved