- Home
- Entertainment
- అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు
అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు, ఎమోషనల్ గా ఏడ్చేసిన స్టార్ యాంకర్లు
జబర్థస్త్ యాంకర్స్ అనసూయ, రష్మీ మధ్య గొడవలు ఉన్నాయా? వాటిని తాజాగా ఈ ఇద్దరు స్టార్లు ప్యాచప్ చేసుకున్నారా? జబర్ధస్త్ స్టేజ్ పై ఇద్దరు యాకర్లు ఎందుకు ఏడ్చారు? కారణం ఏంటి?

టాలీవుడ్ కు కమెడియన్లను అందించిన జబర్ధస్త్
తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనంగా నిలిచింది జబర్ధస్త్ కామెడీ షో. మారుమూల దాగిఉన్న టాలెంట్ ను బయటకు తీసుకువచ్చిన కామెడీ షో జబర్దస్త్. ఊళ్లో సరదాగా పంచ్ లు వేసేవారిని కూడా తెరపై కమెడియన్స్ గా జీవితం ఇచ్చింది జబర్థస్త్. పుష్కరానికి పైగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న జబర్ధస్త్ వల్ల వదలమంది ఆర్టిస్ట్ లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. . 2013లో ప్రారంభమైన ఈషో వల్ల ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రెటీలుగా మారారు. అంతే కాదు టాలీవుడ్ కు స్టార్ యాంకర్లను కూడా ఇచ్చింది జబర్ధస్త్.జబర్ధస్త్ కు చాలామంది యాంకర్లు పనిచేశారు. కాని మొదటి నుంచి అనసూయ, రష్మీ మాత్రమే ఎక్కువ కాలం ఈషోను హోస్ట్ చేసిన రికార్డ్ ఉంది. అంతే కాదు ఈ షో చేస్తూనే ఈ ఇద్దరు చాలా సినిమాల్లో నటించారు. అనసూయ అయితే వెండితెరపై ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు కూడా చేశారు. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఈ ఇద్దరికి జబర్థస్త్ రష్మీ. జబర్థస్త్ అనసూయ అనే పేరు మాత్రమే ఇండస్ట్రీలో అందరికి గుర్తుండిపోయింది. అంతలా జబర్థస్త్ వీరి జీవితంలో భాగం అయ్యింది.
KNOW
జబర్థస్త్ 12 ఏళ్ల ఉత్సవాలు
తెలుగు టెలివిజన్ లో సంచలన కామెడీ షో జబర్దస్త్ తన 12 ఏళ్ల సెలబ్రేషన్స్ ను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ ఈవెంట్ కు సబంధించిన స్పెషల్ ప్రోమోను కూడా టీమ్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జబర్థస్త్ లో ప్రస్తుతం ఉన్న కమెడియన్లు, పాత కమెడియన్లతో పాటు జబర్ధస్త్ పాత యాంకర్ అయిన అనసూయ, మాజీ జడ్జ్ నాగబాబు కూడా ఈ షోలో సందడి చేశారు. ఈసందర్భంగా అందరు తమ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అందులో హ్యాపీ మూమెంట్స్ తో పాటు బాధపడ్డ సంఘటనలు కూడా ఉండటంతో.. ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఈ ప్రోమోలో కనిపించాయి. ఈక్రమంలోనే యాంకర్లు అనసూయ, రష్మీ ఎమోషనల్ అయ్యారు. గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుని స్టేజ్ మీదనే ఏడ్చారు. అయితే వీరిమధ్య గతంలో ఏదో జరిగినట్టు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. వారి కామెంట్లు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అసలు వీరి మధ్య ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా మారింది.
అనసూయ వ్యాఖ్యలు వైరల్
ప్రోమోలో స్టేజీకి రావడంతోనే ఎమోషనల్ గా కనిపించింది రష్మీ, ఒక సందర్భంలో ఏడవడం మొదలు పెట్టింది. అదే సమయంలో అనసూయ భావోద్వేగంతో వెళ్లి రష్మీని హత్తుకుంది. కాసేపు అంతా నిశబ్ధంగా మారింది. ఈక్రమంలో అనసూయ మాట్లాడుతూప.. "జీవితం బోల్డ్ అనేక అవకాశాలు ఇవ్వదు అంటారు కానీ తప్పకుండా ఇస్తుంది. నేను కొంతమందితో ప్యాచప్ చేసుకోవాలి" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఆమె రష్మీ దగ్గరకు వెళ్లి హత్తుకున్నారు. దాంతో అందరికి అర్ధం అయ్యింది. వీరిమధ్య ఏదో జరిగిందని. అనసూయ మాట్లాడుతూ.. "ఎవరికీ తెలియనివి ఇప్పుడు తెలిసిపోయేలా ఉన్నాయి అని డైలాగ్ వేసింది.
రష్మీ మాట్లాడుతూ..
అనసూయ కామెంట్స్ కు రష్మీ కూడా స్పందించింది. "అదేం వాట్సాప్‌లో గాని ఫోన్ చేసి గాని మాట్లాడి ఉంటే అయిపోయేది కదా", ఇలా ఎందుకు అని సీక్రేట్ ను దాచే ప్రయత్నం చేసింది. అప్పుడు అనసూయ కల్పించుకుంటూ.. "అలా అయితే చాలా ఇగోలు అడ్డు వస్తాయి కదా '' అని అన్నారు. దాంతో ఈమొత్తం సీన్ లో వీరిద్దరిమధ్య గతంలో ఏవో జరిగాయి. దాంతో ఇద్దరు దూరం అయ్యారు. ఈ షోద్వారా మళ్లీ ప్యాచప్ చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
జబర్ధస్త్ 12 ఏళ్ల ఉత్సవాలకు సబంధించిన ఫుల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రోమో చూసి ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఆగస్టు 8,9 తేదీల్లో ఈ జబర్థస్త్ స్పెషల్ ఎపిసోడ్ ఈటీవీ ద్వారా ప్రసారం కాబోతోంది. ఇక ఈ ప్రోమో ద్వారా చాలామంది ఎమోషనల్ కామెంట్స్ ను పూర్తిగా చూడాల్సి ఉంది. చంద్రతో పాటు, ఆది, రచ్చ రవి, రాకెట్ రాఘవలాంటి వారు ఈ షోలో తమ గతాన్ని పంచుకున్నారు. పంచ్ లు వేస్తూ నవ్వుకున్నారు. ఈ షో ద్వారా నాగబాబు కూడా చాలా కాలం తరువాత నవ్వులతో సందడి చేశారు.