- Home
- Entertainment
- Karthika Deepam: జ్వాలానే సౌర్య అంటూ నిజం చెప్పేసిన హిమ.. సంతోషంలో సౌందర్య, ఆనందరావు!
Karthika Deepam: జ్వాలానే సౌర్య అంటూ నిజం చెప్పేసిన హిమ.. సంతోషంలో సౌందర్య, ఆనందరావు!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 21 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ (Hima) సౌర్య ను కలుద్దామని ఆటో స్టాండ్ దగ్గరకు రమ్మంటుంది. ఇక అక్కడికి వచ్చిన సౌర్య (Sourya) నువ్వు ఇలా వచ్చేస్తే హాస్పిటల్ లో పేషెంట్స్ ని ఎవరు చూసుకుంటారు అని అంటుంది. దాంతో హిమ అక్కడ మీ డాక్టర్ సాబ్ ఉంటాడులే అని అంటుంది. ఆ మాటకు సౌర్య ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంద
మరోవైపు నిరూపమ్ (Nirupam) అసలు మమ్మీ కి మీకు గొడవ ఎక్కడ వచ్చింది అని అడుగుతాడు. ఇక సందర్భం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని సత్యం అంటాడు. ఒకవైపు సప్న ప్రేమ్ (Prem), నిరూపమ్ లు ఇద్దరు రోజు రోజుకి మీ అల్లుడు దగ్గర అయిపోతున్నారు. అంతేకాకుండా మీ ఆవిడ నా ఇద్దరి కొడుకుల మనసును మార్చేస్తుంది అని సౌందర్య ను అంటుంది.
ఇక ఆవిడ అన్న మాటలకి, ఆవిడ చేసిన పనికి నా కూతురు ఇంకా అమెరికాలో చిత్రవధ అనుభవిస్తుంది అని తన తల్లి పై మరింత కోపం వ్యక్తం చేస్తుంది. మరోవైపు మోనిత (Monitha) ఇంట్లో ఉండే ముసలి ఆవిడను ఎవరో రోడ్డు మీద ఢీకొని వెళ్ళిపోతారు. దాంతో వెంటనే సౌర్య (Sourya) నీళ్ల బాటిల్ తీసుకుని వస్తుండగా కంగారులో అటుగా వస్తున్న సౌందర్య కు తగులుతుంది.
ఇక సౌర్య వాళ్ల నానమ్మ ను గుర్తు పడుతుంది. సౌందర్య (Soundarya) మాత్రం చూసుకోవాలి కదా వేస్ట్ ఫెలో అని విరుచుకు పడుతుంది. ఇక సౌర్య మనసులో బాధపడుతూ మా నానమ్మ ఇక్కడే ఉంటే.. నా శత్రువు కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్లు అనుకుంటుంది. ఆ క్రమంలో సౌర్య (Sourya) కు ఆ కారును ఫాలో అవ్వాలో లేక ఆ ముసలావిడ ను కాపాడాలో అర్థం కాదు.
ఇక వెంటనే సౌర్య ఆ ముసలావిడ ను నిరూపమ్ (Nirupam) వాళ్ళ హాస్పిటల్ కు తీసుకొని వచ్చి సేవ్ చేస్తుంది. ఇక తరువాయి భాగం లో హిమ, జ్వాల లు ఒకచోట కూర్చొని ఉండగా అక్కడకు ఆనందరావు సౌందర్య (Soundarya) లు వస్తారు. ఇక సౌందర్య జ్వాల గురించి అడగగా జ్వాలే మన సౌర్య నానమ్మ అని చెబుతుంది.
దాంతో సౌందర్య (Soundarya) ఎమోషనల్ అవుతూ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావే అని అడగగా వెంటనే సౌర్య కోపంతో రగిలిపోతుంది. ఇదివరకే హిమకు సౌర్యనే జ్వాల అని తెలియడంతో.. తన నాన్నమ్మకు అసలు నిజం చెప్పటంతో హిమ పై సౌర్య (Sourya) ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఈసారైనా సౌందర్య సౌర్యను ఎలా కాపాడుకుంటుందో చూడాలి