- Home
- Entertainment
- 80 ఏళ్లు దాటినా తగ్గేదిలేదంటున్న అమితాబ్ బచ్చన్, ఎపిసోడ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?
80 ఏళ్లు దాటినా తగ్గేదిలేదంటున్న అమితాబ్ బచ్చన్, ఎపిసోడ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?
16 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ పతి ప్రోగ్రామ్ ను హోస్ట్ చేస్తున్నాడు అమితాబచ్చన్. 82 ఏళ్ల వయస్సులో కూడా మరో సీజన్ కు సిద్ధమవుతున్నాడు. అంతే కాదు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదిలేదంటున్నాడు బిగ్ బి. ఇంతకీ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?

82 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేది లేదంటున్న బిగ్ బి
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో, ఎనిమిది పదుల వయస్సులో కూడా తగ్గేదే లే అంటున్నాడు. సినిమాలు, రియాల్టీ షోలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. పనిలోనే తనకు సంతోషం ఉంది అంటున్నారు అమితాబ్. అంతే కాదు సినిమా చేసినా.. ఏదైనా షోను హోస్ట్ చేసినా సరే కోట్లలో రెమ్యునరేషన్ కూడా వసూలు చేస్తున్నాడు.
సాధారణంగా ఈ ఏజ్ లో హ్యాపీగా రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. కాని అమితాబ్ మాత్రం తను చేయగలిగినంత వరకూ నటిస్తూనే ఉంటానని అంటున్నారు. ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా బిజీ అయ్యారు బిగ్ బి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు.
అమితాబచ్చన్ రెమ్యునరేషన్ ?
అమితాబ్ బచ్చన్ రెమ్యునరేషన్ విషయంలో కూడా అందరికి షాక్ ఇస్తున్నారు. సినిమాలకు ఆయన తీసుకునే పారితోషికం క్యారెక్టర్ ను బట్టి తక్కువ లో తక్కువ 30 కోట్లకు పైనే ఉంది. ఇక సినిమాలు కాకుండా ఆయన కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి ప్రోగ్రామ్స్ నుకూడా హోస్ట్ చేస్తూ వస్తున్నారు.
ఈ షో అమితాబ్ వల్లే నడుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బిగ్ బీ వల్లే KBC కి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. అంతే కాదు ఈ ప్రోగ్రామ్ కోసం భారీగా రెమ్యునరేషన తీసుకుంటున్నారు అమితాబచ్చన్. ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్లు వసూలు చేస్తున్నాడట బాలీవుడ్ సీనియర్ హీరో.
గతంలో స్టార్ హీరోగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలారు అమితాబ్. కెరీర్ ను పరుగులు పెట్టించి, భారీగా రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారు. కానీ కొన్నేళ్ల క్రితం అమితాబ్ సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవ్వడం.. ఆయన అప్పుల్లో మునిగిపోయారన్న రూమర్స్ వినిపించాయి. అటువంటి సమయంలో అమితాబ్ ని మళ్ళీ నిలబెట్టింది కౌన్ బనేగా కరోడ్ పతి టీవీషోనే.
ఆగస్టు నుంచి కౌన్ బనేగా కరోడ్ పతి
కౌన్ బనేగా కరోడ్ పతి షోతో అమితాబ్ మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరవడమే కాక ఫైనాన్షియల్ గా కూడా సెటిల్ అయ్యాడు. దీంతో ఆ షోని ప్రతి సీజన్ అమితాబ్ హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 16 సీజన్లు పూర్తి చేసుకోగా త్వరలో 17వ సీజన్ రానుంది. హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి 17వ సీజన్ ఆగస్టు 11 నుంచి మొదలు కానుంది. ఈ మేరకు ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి అమితాబ్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చగా మారింది.
అమితాబ్ బచ్చన్ ఈసారి కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. వారానికి 5 ఎపిసోడ్స్ కాగా వారానికి 25 కోట్లు ఈ షో నుంచి అమితాబ్ సంపాదించనున్నారు. ఇక సౌత్ లో కల్కీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన బిగ్ బీ, అటు తమిళంలో కూడా రజినీకాంత్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ కంటే కూడా సౌత్ లోనే అది కూడా తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు అమితాబ్.