- Home
- Entertainment
- ఆర్యన్ రాజేష్ నుంచి అల్లు శిరీష్ వరకు, స్టార్ వారసులుగా వచ్చి ఫ్లాప్ అయిన హీరోలు ?
ఆర్యన్ రాజేష్ నుంచి అల్లు శిరీష్ వరకు, స్టార్ వారసులుగా వచ్చి ఫ్లాప్ అయిన హీరోలు ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు కోట శ్రీనివాసరావు. ఆ ఆవగింజంత అదృష్టం లేక చాలా మంది స్టార్ వారసులు ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫెయిలైన స్టార్ వారసులు ఎవరు.
- FB
- TW
- Linkdin
Follow Us

స్టార్ వారసులగా ఇండస్ట్రీలోకి వచ్చి ఫెయిల్ అయినవారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఒకరు. బన్నీ సక్సెస్ అయిన తరువాత నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013 లో గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శిరీష్ 2024 వరకూ 8 సినిమాలు చేశారు. శిరీష్ నుంచి వచ్చిన చివరి సినిమా బడ్డీ ఈ సినిమా తరువాత మూవీస్ మానేశాడు అల్లు హీరో. తాను చేసిన ఈ 8 సినిమాల్లో ఏ సినిమా కూడా సాలిడ్ సక్సెస్ సాధించలేదు.
ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అయితే విజయ్ స్టార్ అయిన తరువాత తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా పరిచయం చేశాడు. 2019 లో దొరసాని సినిమాతో హీరోగా మారిన ఆనంద్.. 2024 వరకూ 6 సినిమాలు చేశాడు. అందులో మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబి సినిమాలు మంచి రెస్పాన్స్ ను సాధించాయి. బేబి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాని ఆనంద్ కెరీర్ ఏమాత్రం పరుగులు పెట్టలేదు. ఆనంద్ దేవరకొండ చివరిగా గం గం గణేష సినిమాలో నటించారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసులుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , బెల్లంకొండ సాయి గణేష్. ముందుగా 2014 అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్. స్టార డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లతో భారీ బడ్జెట్ తో సినిమాలు ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికీ కొన్ని మోస్తర్ హిట్లు తప్పించి బెల్లంకొండ శ్రీనివాస్ కు సాలిడ్ హిట్ లేదు. ఇక కొన్నాళ్ల క్రితం ఈ హీరో తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్వాతిముత్యం సినిమాతో హీరోగా మారిన గణేష్.. ఆతరువాత అసలు ఇండస్ట్రీలో కనిపించలేదు.
ఇక దివంగత స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యానారాయణ వారసులుగా ఇద్దరు కొడుకులు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ వీవీ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ హాయ్ సినిమాతో హీరోగా మారాడు. నాలుగైదు హిట్ సినిమాలు కూడా చేశాడు రాజేష్.
ఆతరువాత అడపాదడపా లీలామహల్ సెంటర్ లాంటి సినిమాలు చేస్తూ వచ్చిన రాజేష్.. కొంత కాలానికి సినిమాల నుంచి కనుమరుగై పోయాడు. కొన్నాళ్ళు నిర్మాతగా ఉన్న ఆయన.. ప్రస్తుతం ప్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆర్యన్ రాజేష్ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లరి నరేష్ మాత్రం కామెడీ హీరోగా టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేశాడు.
నిర్మాత దగ్గుబాటి రామానయుడు వారసులుగా సురేష్ బాబు నిర్మాతగా సెటిల్ అయ్యారు, వెంకటేష్ స్టార్ హీరో అయ్యాడు. వారి వారసులుగా రానా దగ్గబాటి పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక వీరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి. అభిరామ్ హీరోగా తేజ డైరెక్షన్ లో అహింస సినిమా 2023 లో రిలీజ్ అయ్యి, డిజాస్టర్ అయ్యింది. ఇక అప్పటి నుంచి అభిరామ్ సినిమాలు చేయలేదు.
ఇక నిర్మాత, దర్శకుడు ఎమ్ ఎస్ రాజు తనయుడు సుమత్ అశ్విన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2012 లో హీగా వచ్చిన సుమంత్ 2022 వరకూ హీరోగా కొనసాగారు. 10 ఏళ్లలో 12 సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో కొన్ని హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవికి 20 కిపైగా హిట్ సినిమాలు అందించిన స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి. ఆయన తనయుడు వైభవ్ కూడా హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాని చేసిన సినిమాలేవి హిట్ అవ్వలేదు. దాంతో తమిళంవైపు అడుగులు వేశాడు వైభవ్. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్నాడు.
దివంగత టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ తనయుడు విక్రమ్ కూడా హీరోగా ప్రయత్నాలు చేశాడు. విక్రమ్ ను హీరోగా ఎమ్మెస్ నారాయణ డైరెక్షన్ లో సినమా చేశారు. కాని ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. అప్పటి నుంచి విక్రమ్ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు ఆతరువాత ఆ అవకాశాలు కూడా రాకపోవడంతో టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యాడు విక్రమ్.
మరోవైపు విజయ నిర్మల వారసుడిగా నరేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు.. అలాగే నరేష్ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఊరంతా అనుకుంటున్నారు. నందిని నర్సింగ్ హోమ్ లాంటి రెండు మూడు సినిమాలు చేశారు నవీన్. కాని సక్సెస్ రాకపోవడంతో సినిమాలు మానేసి ఎడిటర్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
వీళ్లే కాదు వారసులుగా వచ్చిన మరికొంత మంది హీరోలు సక్సెస్ అవ్వలేకపోయారు. మోహన్ బాబు సినిమా వారసత్వం తీసుకున్న మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా స్టార్ హీరోలు అవ్వలేకపోయారు. మంచు విష్ణు టైర్ 2 హీరోగా లాక్కురాగలిగాడు కాని.. మంచు మనోజ్ మాత్రం కెరీర్ లో సక్సెస్ సాధించలేకపోయాడు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాలు సక్సెస్ ఫుల్ గా చేసినా.. హీరోగా మాత్రం గుర్తింపు సాధించలేకపోయాడు.