- Home
- Entertainment
- సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్? త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్? త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
అల్లు అర్జున్ `పుష్ప 2` సినిమాతో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్నుంచి నెక్ట్స్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ బన్నీ నిర్ణయం షాకిస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2` సక్సెస్‌ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1900కోట్లు వసూలు చేసినా దాన్ని సంతోషించే పరిస్థితి, ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకునే పరిస్థితి లేదు.
`పుష్ప 2` రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ చనిపోవడం, వాళ్ల అబ్బాయి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడటమే కారణమని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇది కేసు అయి పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే కాదు, జైల్లో కూడా గడిపేలా చేసింది.
పాన్ ఇండియా స్థాయిలో అంతటి పెద్ద సక్సెస్ వచ్చిన ఒక స్టార్ట్ హీరోకి ఇలాంటి పరిస్థితి నిజంగా బాధాకరం. ఇది బన్నీ ఫ్యామిలీని, ఆయన్ని బాగా కుంగదీసింది. మానసికంగా బాగా ఇబ్బంది పెట్టింది. మొన్నటి వరకు అదే బాధలో ఉన్నారు బన్నీ. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నారు. రిలాక్స్ అవుతున్నారు. దీంతో ఇక నెక్ట్స్ సినిమాపై అప్ డేట్ వస్తుందనే ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యే వార్త ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్ ఇప్పుడు వెంటనే సినిమా చేయడం లేదట. ఆయన కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారట. మొన్నటి వరకు కేసు, కోర్టులు, పోలీస్ స్టేషన్ వివాదాలే నడిచిన నేపథ్యంలో ఫ్యామిలీతో కొంత కాలం ఏకాంతంగా గడపాలనుకుంటున్నారట. వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ టైమ్ పూర్తిగా ఫ్యామిలీకి, తాను రిలాక్స్ అవ్వడానికి, తాను మళ్లీ రెట్టింపు ఎనర్జీని పొందడానికే అని సమాచారం.
ఈ లెక్కన బన్నీ ఓ ఐదారు నెలలు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట. ఆ తర్వాతనే త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాపై ఫోకస్ పెడతాడని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేసినా బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే ఒప్పుకుంటున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. సోషియా మైథలాజికల్ ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది.
అయితే స్క్రిప్ట్ లో బన్నీ కొన్ని మార్పులు చెప్పాడట. దానిపై మాటల మాంత్రికుడు వర్క్ చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో తాను రిలాక్స్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అనంతరం ఈ ఏడాది ద్వితీయార్థంలోగానీ, లేదంటే చివర్లో గానీ ఈ మూవీని ప్రారంభించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మించనుంది.
read more: 'పుష్ప2': ఓటిటి రైట్స్ లోనూ రికార్డే, ఎంతకు నెట్ ప్లిక్స్ కొందంటే!
also read: `ఆర్‌సీ16`టీమ్‌కి రామ్ చరణ్ కండీషన్.. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?