'పుష్ప2': ఓటిటి రైట్స్ లోనూ రికార్డే, ఎంతకు నెట్ ప్లిక్స్ కొందంటే!
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' జనవరి 30 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ఓటీటీ హక్కుల అమ్మకంలో రికార్డ్ బ్రేక్ చేసింది, దాదాపు రూ.275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్ కంటే 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో రీలోడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

Allu Arjun, Pushpa 2, OTT
అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పుష్ప2: ది రూల్' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్‌ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది.
జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే అన్ని విషయాల్లోనూ రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం ఓటిటి రైట్స్ అమ్మకం విషయంలోనూ రికార్డ్ బ్రేక్ చేసిందని వినపడుతోంది. ఈ నేపధ్యంలో నెట్ ప్లిక్స్ ఎంతకు ఈ చిత్రం రైట్స్ కొనుక్కుందనే వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Allu Arjun, Pushpa 2, OTT release date
పుష్ప 2: ది రూల్ చిత్రం రేపు (జనవరి 30) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఆ అర్ధరాత్రే అందుబాటులోకి వస్తుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేయవచ్చు. రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు నెట్‍ఫ్లిక్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప 2 ఇప్పుడు స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీ వెర్షన్ ఆలస్యం కానుంది. స్ట్రీమింగ్ అనౌన్స్‌మెంట్‍లోనూ హిందీని నెట్‍ఫ్లిక్స్ పేర్కొనలేదు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం సుమారు రూ.275 కోట్లకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. రిలీజ్ కాకముందే ఈ స్థాయి భారీ రేటుతో రైట్స్ తీసుకుంది. ఓటీటీ హక్కుల ద్వారా అత్యధిక ధర దక్కించుకున్న ఇండియన్ మూవీగా పుష్ప 2 రికార్డు కూడా క్రియేట్ చేసింది.
3.20 గంటల నిడివితో విడుదలైన 'పుష్ప2' చిత్రానికి అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3.40 గంటలు అయింది. ఇక ఓటీటీ వెర్షన్‌ను కూడా ఇదే నిడివితో రానుంది.