సంధ్య థియేటర్ లో సంచలన రికార్డ్ కొట్టిన పుష్ప2, అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి..?
అల్లుఅర్జున్ కు చేదు అనుభవంగా మారిన సంథ్య థియేటర్ లోనే.. అల్లు అర్జున్ పుష్ప2 మరో సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ లో సరికొత్త రికార్డ్ ను నెలకొలిపింది. పుష్ప. ఇంతకీ విషయంఏంటంటే..?

Allu Arjun, #Pushpa2, sukumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించి పుష్ప2 ఎంత సంచలనంగా మారింతో అందరికి తెలిసిందే. కలెక్షన్ల విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిన ఈసినిమా వివాదాల విషయంలో కూడా పాపులర్ అయ్యింది. తాజాగా మరోసారి సంచలనంగా మారింది పుష్ప2.
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, రష్మిక జంటగా .. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వచ్చింది పుష్ప2 ద రూల్. ఈమూవీ అనుకున్నదానికంటే ఎక్కువ రెట్లు రెస్పాన్నస్ సాధించింది. అంతే కాదు అనూహ్యంగా బాహుబలి రికార్డ్స్ ను కూడా క్రాస్ చేసి సంచలనంగా మారింది.
Also Read: రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ? బాలేదంటున్న మెగా ఫ్యాన్స్.. ఇంతకీ ఎంటా టైటిల్..?
Allu Arjun, #Pushpa2Reloaded, Pushpa2, sukumar
దేశ వ్యాప్తంగా మరీముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప2 గట్టిగా ఎక్కేసింది. రిలీజ్ అయ్యి 40 రోజులు పైనే అవుతున్నా.. ఇప్పటికీ నార్త్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు పుష్పకు. అంతే కాదు పుష్ప 2కు మరో 20 నిమిషాల సీన్ ఆడ్ చేసి.. పుష్ప2 రీ లోడెడ్ పేరుతో మరోసారి రిలీజ్ చేశారు మేకర్స్ . చిత్రం ఏంటంటే.. దీనికి కూడా భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అయితే ఎంత సాధించినా.. పుష్ప2 సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అల్లు అర్జున్.
Also Read: 15 000 కోట్ల ఆస్తిని సైఫ్ అలీ ఖాన్ వదులుకోబోతున్నాడా..?
Allu Arjun, #Pushpa2, sukumar
దానికి కారణం అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ ప్రాణం పోవడం.. అల్లు అర్జున్ అరెస్ట్. ఆరతువాత జరిగిన పరిణామాలు అన్నీ అందరికి తెలిసినవే.
దేశమంతా పుష్ప2 దున్నేస్తున్నా.. అల్లు అర్జున్ మాత్రం కామ్ గా ఇంట్లోనే ఉండిపోవల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం తొక్కిసలాట జరిగిన సంధ్య థియేటర్ లో పుష్ప2 అరుధైన రికార్డ్ ను సొంతం చేసుకోబోతోంది అని సమాచారం.
Also Read: అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?
సంధ్య థియేటర్ ఘటన తరువాత.. ఈథియేటర్ భవిష్యత్తుపై కూడా రకరకాల మాటలు వినిపించాయి. అసలు ఈథియేటర్ ను ఉంచుతారా..?లేక కంజెస్టెడ్ గా ఉందని తీసేస్తారా..? అని అనుమానాలు కూడా వచ్చాయి. అవన్నీ పటాపంచలు చేస్తూ.. ఇదే థియేటర్ లో పుష్ప2 రికార్డ్ స్థాయి కలెక్షన్లు చూసింది.
సంధ్య థియేటర్ లో ఇప్పటి వరకూ పుష్ప2 దాదాపు 2 కోట్ల కు పైగా గ్రాస్ ను వసూలు చేసిందట. ఈ రికార్డ్ ఏ హీరోకు లేదని అంటున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా మాత్రమే సంధ్య థియేటర్ లో 1 కోటి 58 లక్షల గ్రాస్ ను సాధించిందట.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?
Allu Arjun, #Pushpa2, sukumar
ఆ రికార్డ్ ను క్రాస్ చేసిన పుష్ప2 .. సంధ్య థియేటర్ లో 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ రికార్డ్ ను బ్రేక్ చేసే సరికి బన్నీ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ థియేటర్ లోనే ఇబ్బందులు పడ్డ అల్లుఅర్జున్ కు .. ఈసంధ్య థియేటర్ ప్రత్యేకంగా రికార్డ్ ను కట్టబెట్టింది. సాధారణ పరిస్థితి ఉండి ఉంటే.. అక్కడికి వెళ్ళ సెలబ్రేట్చేసుకునేవారు. కాని బన్నీ ఈ సక్సెస్ ను సెలబ్రేట్చ ేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.