15 000 కోట్ల ఆస్తిని సైఫ్ అలీ ఖాన్ వదులుకోబోతున్నాడా..? పటౌడీ ప్యాలెస్ కూడా వారి సొంతం కాబోతోందా..?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తొంది. సైఫ్ కు సబంధించిన 15000 కోట్ల ఆస్తిని స్వధీనం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత..?

సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ లో నటుడు సైఫ్ అలీఖాన్ పటౌడి, భోపాల్ రాజ కుటుంబాల వారసుడు అని చాలా మందికి తెలియదు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్, నటి శర్మిల ఠాగూర్ ల కుమారుడు సైఫ్ అలీఖాన్. పటౌడి రాజ కుటుంబానికి భోపాల్ లో ప్యాలెస్ తో సహా ₹15,000 కోట్ల ఆస్తి ఉంది.
Also Read: రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమా టైటిల్ ఫిక్స్.. ? బాలేదంటున్న మెగా ఫ్యాన్స్.. ఇంతకీ ఎంటా టైటిల్..?

పటౌడి ప్యాలెస్
భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కి ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు అబిదా, భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో పాకిస్తాన్ లో స్థిరపడ్డారు. రెండవ కూతురు సజిదా సుల్తాన్, భారత క్రికెటర్ ఇఫ్తికార్ అలీ ని వివాహం చేసుకున్నారు. వీరి మనవడే సైఫ్ అలీఖాన్.
Also Read: అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్..?
సైఫ్ అలీఖాన్ ఆస్తులు
విభజన సమయంలో పాకిస్తాన్ కి వెళ్లిన వారి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ప్రకారం అబిదా ఆస్తులను 2014 లో స్వాధీనం చేసుకుని, సజిదా ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది.
Also Read: విరాట్ కోహ్లీ మరదలు.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ అని మీకు తెలుసా..?
సైఫ్ అలీఖాన్ రాజ కుటుంబం
దీనిపై సైఫ్ అలీఖాన్ 2015 లో కోర్టులో కేసు వేశారు. స్వాధీనంపై స్టే ఇచ్చిన కోర్టు, 2022 డిసెంబర్ లో ఆ పిటిషన్ ని కొట్టివేసింది. 2016 లో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం భోపాల్ రాజ కుటుంబ ఆస్తులపై వారసులకు హక్కు లేదు.
Also Read: అమితాబ్ బచ్చన్..కుటుంబంలో విబేధాలు..? అందుకే ఆ లగ్జరీ ఇల్లు అమ్మేశారా..?
సైఫ్ అలీఖాన్ పటౌడి ప్యాలెస్
ప్రభుత్వానికి ఇచ్చిన స్టే ని తొలగించడంతో భోపాల్ రాజ కుటుంబ ఆస్తులకు మళ్ళీ సమస్య వచ్చింది. అయితే ఈ విషయమై 30 రోజుల్లో ట్రిబ్యునల్ లో అప్పీల్ చేసుకోవచ్చు అని సూచించారు. కానీ సైఫ్ అప్పీల్ చేసుకోలేదు.
పటౌడి ప్యాలెస్ ని కోల్పోయే ప్రమాదం
దీంతో సైఫ్ అలీఖాన్ ₹15,000 కోట్ల సొత్తును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇటీవల దాడిలో గాయపడిన సైఫ్ కోలుకుంటుండగా ఈ వార్త ఆయనకు మరో షాక్ ఇచ్చి ఉంటుంది.