Pushpa Movie Review: 'పుష్ప' ప్రీమియర్ షో టాక్.. ఫారెస్ట్ లో అల్లు అర్జున్ చెడుగుడు
ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో Pushpaపై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి.
ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో Pushpaపై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ గెటప్, యాటిట్యూడ్ ఈ చిత్రంలో విభిన్నంగా ఉంది. బన్నీ తొలిసారి రస్టిక్ లుక్ లో కనిపిస్తుండడంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది . ఇప్పటికే యూఎస్ లాంటి ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షోలకి ప్రేక్షుకుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం.
జపాన్ లాంటి దేశాల్లో ఎర్రచందనంకి ఎంతటి డిమాండ్ ఉందో తెలియజేసే సన్నివేశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. అల్లు అర్జున్ ఎంట్రీ మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా డైలాగులు చెప్పాడు. ఈ సినిమాలో బన్నీ పూర్తిగా చిత్తూరు లోకల్ బాయ్ లాగా మారిపోయాడు. సుకుమార్ బన్నీ క్యారెక్టర్ ని అలా మలిచారు.
ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతున్నట్లు ప్రీమియర్ షోలలో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ సినిమా బ్యాక్ డ్రాప్, బన్నీ నటన ప్రేక్షుకులని డీవియేట్ కాకుండా చేస్తాయి. దర్శకుడు సుకుమార్ కథలో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ ఇలా ఒక్కో పాత్రని రివీల్ చేసే విధానం బావుంటుంది.
అక్కడక్కడా కొన్ని సాగదీసిన సన్నివేశాలు ఉన్నప్పటికీ పుష్ప చిత్రం ఎంజాయ్ చేసే విధంగా ఉందని అంటున్నారు. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. అయితే సుకుమార్ దర్శకుడిగా ఈ చిత్రంలో తన పూర్తి సత్తా చూపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం లాగ్ కి గురైన కొన్ని సన్నివేశాలు. ఫస్ట్ హాఫ్ తొలి 20 నిమిషాలు మినహా డీసెంట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అదిరిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏయ్ బిడ్డా సాంగ్ వరకు ఫారెస్ట్ లో జరిగే సీన్స్ కేకపెట్టించే విధంగా ఉన్నాయట.అలాగే బన్నీ, ఫహద్ మధ్య సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. అల్లు అర్జున్ ఎర్రచందనం కూలి స్థాయి నుంచి స్మగ్లింగ్ లో కీలక వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ కథలో కీలకంగా ఉంటుంది. తన దారికి అడ్డు వచ్చిన వారిని ఎలా అంతమొందించాడు అనేది కథలో చూపించారు.
ప్రీమియర్ షోలలో కొందరు ప్రేక్షకులు మాత్రం ఫారెస్ట్ సన్నివేశాలు మినహా మిగిలినవి వర్కౌట్ కాలేదని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ సంగీతం ఆకట్టుకోలేదు. కీలక సన్నివేశాల్లో దేవిశ్రీ తన బిజియంతో సపోర్ట్ ఇవ్వడంలో విఫలం అయినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ నటన, టెక్నీషియన్స్ వర్క్, కథ, సమంత స్పెషల్ సాంగ్ ఈ చిత్రంలో హైలైట్స్ గా ప్రేక్షకులు చెబుతున్నారు. క్లైమాక్స్ సీన్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తంగా పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ తో సుకుమార్ సెకండ్ పార్ట్ కి మంచి స్టేజ్ సెట్ చేసారు అని అంటున్నారు. Also Read: Pushpa Sukumar: కెమెరామెన్‌తో పెద్ద గొడవ.. నేనెవరో తెలుసా అంటూ సుకుమార్ ఫైర్.. అసలేమైందంటే?
Also Read: నేను కూడా కేసు పెడతా, మహిళల పరువు పోయింది.. సమంత ఐటెం సాంగ్ పై మాధవీలత షాకింగ్ కామెంట్స్