MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నేను కూడా కేసు పెడతా, మహిళల పరువు పోయింది.. సమంత ఐటెం సాంగ్ పై మాధవీలత షాకింగ్ కామెంట్స్

నేను కూడా కేసు పెడతా, మహిళల పరువు పోయింది.. సమంత ఐటెం సాంగ్ పై మాధవీలత షాకింగ్ కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన Pushpa చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం ఇది. పైగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది. దీనితో పుష్ప రిలీజ్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 16 2021, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన Pushpa చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో భారీ చిత్రం ఇది. పైగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ అవుతోంది. దీనితో పుష్ప రిలీజ్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తోంది. పుష్ప చిత్రంలో ప్రధానంగా ప్రేక్షకులని కొన్ని అంశాలు ఆకర్షిస్తున్నాయి. అల్లు అర్జున్ గెటప్, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు సమంత తొలి సారి చేసిన ఐటెం సాంగ్.. ఇలా అనేక అంశాలు పుష్ప చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ముఖ్యంగా యువత, Samantha అభిమానులు 'ఊ అంటావా ఊ ఊ అంటావా' అనే స్పెషల్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీ అందించిన బీట్, ప్రముఖ సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతి మత్తెక్కించేలా అందించిన గాత్రం ఈ సాంగ్ ని సూపర్ హిట్ చేశాయి. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతోంది. 

36

చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. అయితే ఈ పాటలో మగవారి గురించి తప్పుగా రాసిన లిరిక్స్ పై పెద్ద  వివాదమే సాగుతోంది. ఆడవారి నుంచి మగవారు కోరుకునేది శృగారం మాత్రమే అని అర్థం వచ్చేలా ఈ పాట సాగుతుంది. మగవారి బుద్ది వంకర బుద్ది అనే లిరిక్స్ కూడా ఈ పాటలో ఉన్నాయి. దీనితో ఇప్పటికే ఈ సాంగ్ పై పురుషుల సంఘం కేసు కూడా నమోదు చేసింది. 

46

ఈ పాటని బ్యాన్ చేయాలని పురుషుల సంఘం డిమాండ్ చేస్తోంది. దీనిపై నటి మాధవి లత సెటైరికల్ గా స్పందించింది. సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. 'వాయమ్మో పుష్ప ఐటెం సాంగ్ మీద కేసు అంటగా.. ఇండస్ట్రీలో 98 శాతం పాటలు ఇలాగే ఉంటాయి. ప్రతి సాంగ్ పై కేసు పెట్టుకుంటూ పోతే ఇక పాటలు లేని సినిమాలు చేసుకోవాల్సిందే. 

56

నేను కూడా అమ్మాయిలపై రాసే సాంగ్స్ మీద కేసులు పెడతా అని కామెంట్స్ చేసింది. పుష్ప చిత్రంలోనే ఉన్న 'సామి సామి' సాంగ్ పై తాను కేసు పెడతా అంటూ మాధవి లతా సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఏంటి.. ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతడు పిలిస్తే అంత చులకనగా వెళ్ళిపోతుందా... అబ్బాయి నడచి వెళ్లిన చోట భూమికి మొక్కుతుందా.. మహిళల పరువు పోయింది. 

66

నేను కూడా సామీ సామి సాంగ్ పై కేసు పెడతా.. తగ్గేదే లే అంటూ మాధవి లతా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మాధవీలత కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధవి లతా తరచుగా సోషల్ మీడియాలో సినీ రాజకీయాలపై స్పందిస్తూ ఉంటుంది. Also Read: Pushpa: బాయ్ కాట్ పుష్ప అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. తగ్గేదే లే అంటున్న బన్నీ ఫ్యాన్స్, వివాదం ఏంటంటే

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved