MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్,రజినీకాంత్ కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రభాస్,రజినీకాంత్ కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ వల్ల సినిమాల బడ్జెట్ భారీగా పెరిగింది. అంతే కాదు స్టార్ హీరోలు రెమ్యునరేషన కూడా భారీగా పెంచారు. మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాను శాసిస్తున్న హీరోలలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 06 2025, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image Credit : Asianet News

దక్షిణాది సినీ పరిశ్రమలో నేడు హీరోలకు లభిస్తున్న పారితోషికం, వారి ఆస్తుల విలువ బాలీవుడ్ స్థాయిలోనే ఉంది. ఒక్క సినిమాకే వందల కోట్లను పారితోషికంగా పొందుతున్న సూపర్ స్టార్లు ప్రస్తుతం తమ ఆస్తుల విలువలో ముందంజలో ఉన్నారు. ఆ కోవలోనే, 2025 నాటికి దక్షిణాదిలో అత్యధిక ఆస్తులున్న నటులు ఎవరెవరో టాప్ 5 జాబితాను ఇప్పుడే చూద్దాం.

27
Image Credit : Asianet News

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో మొదటి స్థానం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే దక్కింది. ఈమధ్య కాలంలో అత్యధిక పారితోషికం తీసుకునే సౌత్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఎదిగారు. 

పుష్ప: ది రైజ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఈ హీరో పుష్ప 2: ది రూల్ మూవీతో బాహుబలి రికార్డ్ ను కూడా కొల్లగొట్టాడు. ఈ మెగా విజయం తర్వాత అల్లు అర్జున్ 300 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా బన్నీకి భారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

పుష్ప2 సినిమా కు సౌత్ కంటే బాలీవుడ్ నుంచే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు.

Related Articles

Related image1
40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, బ్యాచిలర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరు?
Related image2
రామ్ చరణ్ నుంచి రజినీకాంత్ వరకూ ప్రైవేట్ జెట్ లను కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
37
Image Credit : X

నాలుగు దశాబ్దాలకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. మొదటి నుంచి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో రజినీకాంత్ ముందు వరుసలో ఉన్నారు. కానీ ఆతరువాత ఆ ప్లేస్ ను ప్రభాస్, బన్నీలాంటి స్టార్స్ ఆక్రమించారు. సౌత్ లో మొదటి 100 కోట్ల హీరో రజినీకాంత్. ఇక ప్రస్తుతం కూలీ సినిమా కోసం 250 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జైలర్ సినిమా తరువాత ఆయన మార్కెట్ విలువ అమాంతం పెరిగింది.

47
Image Credit : our own

సౌత్ స్టార్ హీరోలలో విజయ్ దళపతి ఒకరు. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన విజయ్ చివరిగా చేస్తున్న సినిమా జన నాయకన్‌. ఈసినిమాకు ఆయన 250 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు చెబుతున్నారు. మాస్టర్, బీస్ట్, లియో, వంటి వరుస విజయాల తర్వాత, విజయ్ మంచి ఫామ్ లో ఉండగానే సినిమాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు నుంచి అన్ని స్థానాల్లో విజయ్ పోటీచేయబోతున్నాడు.

57
Image Credit : Social Media

బాహుబలి సినిమాతో మొదటి పాన్ ఇండియా హీరోగా చరిత్ర సృష్టించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈసినిమా నుంచి ఆయన అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. వరుసగా ప్రభాస్ సినిమాలు ప్లాప్ అయినా ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రెమ్యునరేషన్ విషయంలో తగ్గడంలేదు ప్రభాస్. ప్రస్తుతం వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ సినిమాకు 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

67
Image Credit : our own

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోలు గా వెలుగు వెలుగుతున్నారు రామ్ చరణ్ , ఎన్టీఆర్. ఈ ఇద్దరు స్టార్లు కూడా భారీగా పారితోషికం పెంచేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇద్దరు పాన్ఇండియా హీరోలుగా మారిపోయారు.ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు సినిమాకు 130 కోట్లకుపైగా పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

77
Image Credit : Social Media

అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో అజిత్ కుమార్ కూడాఉన్నాడు. రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్టార్ హీరో ఈసినిమాకు 160 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ప్రభాస్
రామ్ చరణ్ కొణిదెల

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Related Stories
Recommended image1
40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా, బ్యాచిలర్ గా మిగిలిపోయిన హీరోయిన్లు ఎవరు?
Recommended image2
రామ్ చరణ్ నుంచి రజినీకాంత్ వరకూ ప్రైవేట్ జెట్ లను కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved