- Home
- Entertainment
- Bigg Boss 10: నరేష్ కి పెళ్లి సంబంధాలు, రివీల్ చేసిన అతడి సోదరుడు.. భార్య, కూతురితో టెంపర్ వంశీ ఫుల్ ఖుషి
Bigg Boss 10: నరేష్ కి పెళ్లి సంబంధాలు, రివీల్ చేసిన అతడి సోదరుడు.. భార్య, కూతురితో టెంపర్ వంశీ ఫుల్ ఖుషి
బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కుటుంబ సభ్యుల సందడి మొదలైంది. 65వ రోజు హౌస్ లో నరేష్, స్వేత, టెంపర్ వంశీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. వంశీ తన కుమార్తెని చూడగానే భావోద్వేగానికి గురయ్యాడు.

Bigg Boss Telugu 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భాగంగా ఫ్యామిలీ వీక్ లో కుటుంబాల సందడి మొదలైంది. హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రారంభించారు. హౌస్ లో నరేష్ ప్రిన్సిపాల్ గా, ఇతర సభ్యులు స్టూడెంట్స్ గా చేసిన డ్రామాగా బాగా ఎంటర్టైనింగ్ గా సాగింది.
నరేష్ కి పెళ్లి సంబంధాలు
ఆ తర్వాత నరేష్ సోదరుడు సురేష్ హౌస్ లో సర్ప్రైజింగ్ ఎంట్రీ ఇచ్చాడు. దీనితో నరేష్ చాలా సంతోషించాడు. తన బ్రదర్ తో సరదాగా కాసేపు గడిపాడు. నరేష్ ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడు. ఏదైనా సమస్య వస్తే ఒక్కడే ఎలా సాల్వ్ చేస్తాడు అనే విషయాలని సురేష్ ఇంటి సభ్యులకు వివరించారు. ఎంత కష్టం వచ్చినా నేను చూసుకుంటా అనే భరోసా ఇస్తాడని సురేష్ పేర్కొన్నాడు. నరేష్ కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయా అని ఇంటి సభ్యులు అడగగా.. వస్తున్నాయి అంటూ బదులిచ్చాడు.
భార్య, కూతురితో టెంపర్ వంశీ
ఆ తర్వాత హౌస్ లోకి స్వేత సోదరి, తండ్రి వచ్చారు. దీనితో స్వేత సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తండ్రిని చూసి తీవ్ర భవోద్వేగానికి గురైంది. వాళ్ళు కూడా ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడారు. స్వేత తండ్రి రింగ్ విసిరి హౌస్ మేట్స్ కి మటన్ ని లగ్జరీ బడ్జెట్ ద్వారా సాధించి పెట్టారు. ఆ తర్వాత టెంపర్ వంశీ కూతరు, భార్య ఎంట్రీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన వంశీ భావోద్వేగానికి గురయ్యాడు. భార్య, కూతురితో వంశీ సరదాగా గడిపాడు. తన భర్త గురించి వంశీ భార్య ఇంటిసభ్యులకు ఆసక్తికర విషయాలు చెప్పింది. ఆయన షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న సరే.. నేను ఒక్క మెసేజ్ పెడితే నాకు కావలసింది వెంటనే ఏర్పాటు చేస్తారు అని చెప్పుకొచ్చింది. గేమ్ బాగా ఆడమని భర్తకు చెప్పి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది.













