- Home
- Entertainment
- `పుష్ప 3` కాదు, సందీప్ వంగా కాదు.. అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఎవరితో తెలుసా? అస్సలు ఊహించలేరు
`పుష్ప 3` కాదు, సందీప్ వంగా కాదు.. అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఎవరితో తెలుసా? అస్సలు ఊహించలేరు
`పుష్ప 2` సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఆ హడావుడిలో ఉన్నారు. నెక్ట్స్ ఆయన సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అల్లు అర్జున్
`పుష్ప` సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్, డిసెంబర్ 5న విడుదలైన `పుష్ప 2`లో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న, విలన్‌గా ఫహద్ ఫాజిల్ నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది.
పుష్ప 2 ది రూల్
`పుష్ప 2` సినిమా హిట్ టాక్‌తోనే ప్రారంభమైంది. ఇప్పుడు భారీ విజయం దిశగా వెళ్తుంది. భారీ కలెక్షన్లని రాబడుతుంది. ఆరు రోజుల్లో ఈ మూవీ ఏకంగా వెయ్యి కోట్లు వసూలు చేసింది. `బాహుబలి 2` తర్వాత తక్కువ రోజుల్లోనే వెయ్యి కోట్లు క్లబ్‌లో చేరిన సినిమాగా `పుష్ప 2` నిలిచింది.
పుష్ప 3 ది రాంపేజ్
`పుష్ప 2` క్లైమాక్స్ లో `పుష్ప 3`కి లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. జగపతిబాబు పాత్రతో బన్నీ పోరాడబోతున్నారనే హింట్ ఇచ్చారు. కానీ పుష్ప 3 ఇప్పుడే రాదు. దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాతే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ లోపు ఇటు బన్నీ, అటు సుకుమార్ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే `పుష్ప 3`పైకి వెళ్తారు. అది కూడా చేస్తారా? లేదా అనేది కూడా డౌటే.
అల్లు అర్జున్, అట్లీ
`జవాన్` దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అట్లీ సల్మాన్ ఖాన్ సినిమా చేస్తున్నారు. బన్నీ-అట్లీ మూవీ క్యాన్సిల్ అయ్యింది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో సినిమా చేసే పనిలో ఉన్నారు. ఆ మూవీ తర్వాతనే బన్నీ సినిమా ఉంటుంది. అంటే దీనికి కూడా టైమ్ పడుతుంది.
విపిన్ దాస్ తో అల్లు అర్జున్
ఇదిలా ఇప్పుడు మరో కొత్త దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. మలయాళ దర్శకుడితో సినిమా చేయబోతున్నారట అల్లు అర్జున్. మలయాళంలో `జయ జయ హే` అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన విపిన్ దాస్‌తో బన్నీ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
అయితే బన్నీ ఇమ్మీడియట్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారట. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఈ మూవీ రూపొందనుంది. ఇప్పటి వరకు తెలుగులోనే ఇలాంటి జోనర్ సినిమా రాలేదని, త్రివిక్రమ్ ఓ కొత్త జోనర్‌తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారట.
స్క్రిప్ట్ వర్క్ లో త్రివిక్రమ్ ఉన్నారని, అది పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నారట. బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని తెలుస్తుంది. ఇదొక భారీ పాన్ ఇండియా మూవీ కాబోతుందని ఇటీవల నిర్మాత నాగవంశీ తెలిపిన విషయం తెలిసిందే.
read more: కీర్తిసురేష్ పెళ్లి సందడి షురూ, స్పెషాలిటీ ఏంటంటే? ఈ రహస్యానికి కారణమదేనా?
also read: బాలయ్య `అఖండ 2ః తాండవం` వచ్చేది అప్పుడే, వచ్చే ఏడాది ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్, షూటింగ్ అప్‌డేట్