- Home
- Entertainment
- 3000 కోట్లు ఆస్తికి ఏకైక వారసుడు, రామ్ చరణ్, ప్రభాస్ కాదు, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?
3000 కోట్లు ఆస్తికి ఏకైక వారసుడు, రామ్ చరణ్, ప్రభాస్ కాదు, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?
3100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఏకైక హీరో. స్టార్ వారసుడైనా స్వయంకృషితో ఎదిగిన హీరో. రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు, ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న ఆ హీరో ఎవరో తెలుసా?

ఎన్నో ఏళ్లుగా సినిమా రంగాన్ని వారసులు ఏలుతున్నారు. భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజం కామన్ అయిపోయింది. అయితే ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోతే వారసులుగా ఎంట్రీ ఇచ్చినా ఉపయోగం లేదు. వారసులుగా వచ్చి ఎదగలేకపోయినవారు ఎంతో మంది ఉన్నారు.
చాలా మంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వారి టాలెంట్ ను నిరూపించుకుని. వారికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక టాలెంట్ లేక, తమను తాము నిరూపించుకోలేక రెండు మూడు సినిమాలకే బయటకు వెళ్ళిపోయినవారు కూడా ఉన్నారు.
ఇక ఈ వారసత్వం విషయంలో సౌత్ కంటే హిందీలోనే నెపోటిజం చాలా ఎక్కువగానే ఉంది. సౌత్ లో చూసుకుంటే తెలుగు, తమిళ చిత్రసీమలో వారసత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. తమిళ సినిమాలో కూడా వారసులకు కొదవలేదు. ఎంతో మంది నెపోకిడ్స్ తమిళ రంగంలో పాతుకుపోయారు. తెలుగులో కూడా ఇదే పరిస్థితి. ఇక ఈక్రమంలో ఇండియాన ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నెపో హీరో ఒకరు సొంత టాలెంట్ తో ఎదిగి వేలకోట్లు సంపాదించాడు. . దాదాపు 3000 వేల కోట్లకు అధిపతిగా నిలిచారు. ఆ హీరో ఎవరో కాదు హృతిక్ రోషన్.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వారస్వంగా ఇండస్ట్రీకి వచ్చారు. ఆయన తండ్రి రాకేష్ రోషన్ బాలీవుడ్‌లో దర్శకుడు, నిర్మాత , నటుడు. తండ్రి సహకారంతో సినిమాల్లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోషన్.. పలు విజయాలు, అపజయాలు చవిచూసి.. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు హృతిక్. ఇక హృతి క్ రోషన్ ఆస్తుల విలువ 3100 కోట్లు. హృతిక్.. దేశంలోని ఇతర సినిమా స్టార్ వారసుల కంటే ఎక్కువ సంపాదించడానికి ప్రధాన కారణం అతని వ్యాపారం. అతను హెచ్‌ఆర్‌ఎక్స్ అనే స్పోర్ట్స్‌వేర్ కంపెనీని నడుపుతున్నాడు. సినిమాల ద్వారా సంపాధించిన డబ్బును ఆయన వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతున్నారు.
300 కోట్ల విలువైన ఆ సంస్థ ద్వారా హృతిక్ రోషన్ కోట్లాది ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో వార్ 2 ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్డీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.