MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?

వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్.. స్టైలిష్ మెయింటెనెస్ లో ఏమాత్రం తగ్గడం లేదు. ఐకాన్ స్టార్ ఒంటిమీద కోట్లు విలువ చేసే వస్తువులు కనిపిస్తుంటాయి. తాజాగా అల్లుఅర్జున్ చేతి వాచీ వైరల్ అవుతోంది. దాని రేటు ఎంతో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 26 2026, 07:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు అర్జున్ కాస్ట్లీ లైఫ్ స్టైల్..
Image Credit : facebook.com/AlluArjun

అల్లు అర్జున్ కాస్ట్లీ లైఫ్ స్టైల్..

ఐకాన్ స్టార్ Allu Arjun స్టైల్, లైఫ్‌స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా తన స్టైల్, మెయింటేనెస్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు బన్నీ. ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితం అయిన అల్లు అర్జున్ క్రేజ్.. ప్రస్తుతం పాన్ఇండియాకు పాకింది.. అట్లీతో చేస్తోన్న రాకా సినిమాతో దాన్ని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లాలని ఐకాన్ స్టార్ ప్రయత్నిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అల్లు అర్జున్ చేతికి కాస్ట్లీ వాచ్..
Image Credit : Allu arjun

అల్లు అర్జున్ చేతికి కాస్ట్లీ వాచ్..

ఒక్క సినిమాకు వందల కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అల్లు అర్జున్... ఆరేంజ్ లోనే మెయింటేన్ చేస్తున్నారు. కాస్ట్లీ లైఫ్ స్టైల్ విషయంలో తగ్గేది లేదన్న అల్లు అర్జున్.. మరోసారి తన లగ్జరీ స్టైల్ తో వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది అల్లు అర్జున్ చేతికి కనిపించిన ఖరీదైన లగ్జరీ వాచ్.

35
18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో చేసిన వాచ్..
Image Credit : Asianet News

18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో చేసిన వాచ్..

అల్లు అర్జున్ ధరించిన ఈ వాచ్ వరల్డ్ ఫేమస్ లగ్జరీ వాచ్ బ్రాండ్ Patek Philippe కు చెందిన ‘నాటిలస్’ మోడల్‌ అని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఇది 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో రూపొందించిన 5712/1R-001 మోడల్ అని సమాచారం. అత్యంత ప్రీమియం ఫినిషింగ్‌తో రూపొందిన ఈ వాచ్‌లో సన్‌బర్స్ట్ బ్రౌన్ డయల్, మూన్ ఫేజ్ డిస్‌ప్లే, పవర్ రిజర్వ్ ఇండికేటర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

45
కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
Image Credit : facebook.com/AlluArjun

కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..

ఈ వాచ్ అందం మాత్రమే కాకుండా దాని ధర కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లగ్జరీ వాచ్ అధికారిక రిటైల్ ధర 2.75 కోట్లకు పైగా పలుకుతున్నట్లు సమాచారం. అయితే మార్కెట్‌లో దీనికి ఉన్న భారీ డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఈ మోడల్ ధర భారీగా పెరిగినట్టు సమాచారం.

55
అల్లు అర్జున్ రెమ్యునరేషన్?
Image Credit : Asianet News

అల్లు అర్జున్ రెమ్యునరేషన్?

ఒక్కో సినిమాకు రూ.200 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్, తన రాయల్ లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగానే ఈ అల్ట్రా లగ్జరీ వాచ్‌ను పెట్టుకున్నందకు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వాచ్ ధరకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ తన మకాంను ముంబయ్ కి మార్చారు. రాకా షూటింగ్ అంతా ముంబయ్ లోనే జరుగుతుండటంతో.. అల్లు అర్జున్, అట్లీ అక్కడే ఉంటున్నారు. ఈసినిమా తరువాత ఆయన లోకేష్ కనకరాజ్ తో మరో మూవీని చేయబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Singer: ఓజీ ఫైర్‌ స్ట్రోమ్‌ సింగర్‌ కొత్త పాట చూశారా?.. ఊపేస్తున్న `ఓఎంజీ` సాంగ్‌
Recommended image2
Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ
Recommended image3
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Related Stories
Recommended image1
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?
Recommended image2
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved