- Home
- Entertainment
- `పుష్ప` ఫ్లాప్, సుకుమార్‌కి ముందే చెప్పిన అల్లు అర్జున్, ఇంతటి సంచలనం వెనుక ఏం జరిగిందంటే?
`పుష్ప` ఫ్లాప్, సుకుమార్‌కి ముందే చెప్పిన అల్లు అర్జున్, ఇంతటి సంచలనం వెనుక ఏం జరిగిందంటే?
`పుష్ప` సినిమా ఆడదు అని అల్లు అర్జున్ ముందే ఫిక్స్ అయ్యాడా? దర్శకుడు సుకుమార్‌ని కూడా ప్రిపేర్ చేశాడా? మరి ఇంతటి మ్యాజిక్ కి కారణమేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సినిమా సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1900కోట్లు వసూలు చేసినట్టు టీమ్ తెలిపింది. అయితే ఇటీవల ఐటీ శాఖకి సమర్పించిన లెక్కల్లో 1300కోట్లే చూపించడం ఆశ్చర్య పరిచింది.
కానీ సినిమా నిజంగానే బాగానే వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు స్టేట్స్ లో నిరాశ పరిచినా, నార్త్ ఇండియాలో మాత్రం దుమ్ములేపింది. అన్ని రికార్డులు బ్రేక్ చేసింది.
`పుష్ప 2` సినిమా నార్త్ ఆడియెన్స్ కోసమే తీసినట్టుగా ఉంటుంది. కథగానీ, అందులోని సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్లు నార్త్ ఇండియా ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇంతటి సక్సెస్ కి కూడా కారణం అదే అని చెప్పొచ్చు.
అయితే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేసిందే అని టాక్. `పుష్ప` సినిమా సౌత్‌లో ఆడలేదు. కానీ నార్త్ లో పెద్ద హిట్. దీన్ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప 2`ని నార్త్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు సుకుమార్, బన్నీ.
అయితే ఇదంతా జరగడానికి మరో కారణం ఉంది. ఇంత మ్యాజిక్ వెనక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అల్లు అర్జున్ `పుష్ప` సినిమాని చూసి ఏమనుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. `పుష్ప` సినిమాని ఒక్క పార్ట్ గానే చేయాలనుకున్నారు.
కానీ తీసే కొద్ది కంటెంట్ ఎక్కువగా ఉండటంతో రెండు పార్ట్ లుగా ప్రకటించారు. కానీ అసలు విషయం ఏంటంటే `పుష్ప` కంటెంట్‌ని చూసిన బన్నీ ఈ మూవీ ఆడదు అని నిర్ణయించుకున్నారట. దీంతో మళ్లీ రీషూట్ కూడా చేశారట. దాదాపు 70-80శాతం రీ షూట్ చేయాల్సి వచ్చిందట.
అప్పటికీ బన్నీకి నమ్మకం లేదు. కాన బడ్జెట్ పెరిగిపోయింది. ఔట్‌పుట్ చూసుకుని, సినిమా ఆడదు అని నిర్ణయించుకున్నాడట. ఇదే విషయాన్ని దర్శకుడు సుకుమార్‌కి చెప్పాడు. తీసిన సినిమాని మొదటి పార్ట్ అని చెప్పి ముందు విడుదల చేయాలని చెప్పాడట.
ఆ కంటెంట్‌కే సుకుమార్ చివరి వరకు బెటర్మెంట్ చేస్తూ వచ్చాడు. తన బెస్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అల్లు అర్జున్‌కి ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. నార్త్ లో అసలు ప్రమోషనే చేయలేదు. ఏదో హడావుడిగా విడుదల చేశారు.
మొదటి రోజు అనుకున్న రిజల్టే వచ్చింది. ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు కూడా కొంత నెగటివ్‌గానే వచ్చాయి. అల్లు అర్జున్ అయితే ఆశలు వదులుకున్నాడు. కానీ నెమ్మదిగా పికప్ అయ్యింది. తెలుగులో యావరేజ్‌గానే ఆడుతుంది.
సౌత్‌లోనూ అంత ఆదరణ కనిపించడం లేదు. కానీ నార్త్ బెల్ట్ లో మాత్రం కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇది టీమ్‌కి పెద్ద సర్ప్రైజింగ్‌గా మారింది. నార్త్ ఆడియెన్స్ విపరీతంగా చూస్తున్నారు. అక్కడ పావలాకు కొంటే రెండు రూపాయలు వచ్చిన పరిస్థితి. దీంతో పెట్టిన బడ్జెట్ వచ్చేసింది.
Allu Arjun, #Pushpa2, Sukumar
అదే సమయంలో నార్త్ ఆడియెన్స్ ఆదరణ చూసి నమ్మకం పెరిగింది. అందరికీ ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే `పుష్ప 2`ని పూర్తిగా నార్త్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలానే డిజైన్ చేశారు. వారిని టార్గెట్ చేశారు. కొట్టారు. ఇప్పుడు కూడా ఈ రేంజ్ ఆదరణ ఊహించలేదు. ఇది బన్నీకి, సుకుమార్‌తోపాటు అందరికి సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.
read more: `సైరా` కాదు, `కల్కి 2898ఏడీ` కాదు.. అమితాబ్ బచ్చన్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?
also read: `వార్ 2`లో మహేష్ బాబు, రణ్‌బీర్ కపూర్.. ఎన్టీఆర్, హృతిక్ కోసం ఏం చేస్తున్నారో తెలుసా?