- Home
- Entertainment
- `వార్ 2`లో మహేష్ బాబు, రణ్‌బీర్ కపూర్.. ఎన్టీఆర్, హృతిక్ కోసం ఏం చేస్తున్నారో తెలుసా?
`వార్ 2`లో మహేష్ బాబు, రణ్‌బీర్ కపూర్.. ఎన్టీఆర్, హృతిక్ కోసం ఏం చేస్తున్నారో తెలుసా?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా `వార్ 2` సినిమా రూపొందుతుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఇప్పుడు మరో ఇద్దరు సూపర్ స్టార్స్ భాగం కాబోతున్నారట.

మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. త్వరలో ఆయన ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్నారు. మరోవైపు రణ్ బీర్ కపూర్ బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు. `యానిమల్`తో ఆయన రేంజ్ అమాంతరం పెరిగిపోయింది. `రామాయణ్`తో ఆయన ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు `వార్ 2`లో పార్ట్ కాబోతున్నారు. మరి అదేలా అనేది చూస్తే..
War 2
బాలీవుడ్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ `వార్ 2`. గతంలో వచ్చిన `వార్` సినిమాకిది సీక్వెల్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్, జాన్ అబ్రహాం నెగటివ్ రోల్ చేస్తున్నారు. అయితే హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తారని, జూ ఎన్టీఆర్‌ని నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర అని అంటున్నారు. కానీ ఇద్దరు హీరోలే అని తెలుస్తుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ముంబయిలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ సినిమాని భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు అయాన్ ముఖర్జీ. దీంతో హీరోల కాల్షీట్లు ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకే బల్క్ గా ఈ మూవీకి ఎన్టీఆర్ తన కాల్షీట్లు ఇచ్చినట్టు సమాచారం. `వార్ 2` షూటింగ్ పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.
War 2
ఇదిలా ఉంటే `వార్ 2`లో ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ ఉండబోతుందట. ఇప్పటికే `వార్ 2` బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా నిలిచింది. దీనికి మరో ఇద్దరు సూపర్ స్టార్స్ కలవబోతున్నారు. సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్లు భాగం కాబోతున్నారు. మరి వాళ్లు ఎవరు? ఇందులో భాగం కావడమేంటి? అనేది చూస్తే.
`వార్ 2`లో మహేష్ బాబు, రణ్ బీర్ కపూర్ కూడా పార్ట్ అవుతున్నారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాని, అభిమానులను షేక్ చేస్తున్న వార్త. మరి ఈ ఇద్దరు గెస్ట్ రోల్స్ చేస్తారా? ఏం చేయబోతున్నారనేది చూస్తే, ఈ ఇద్దరు వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారట. మహేష్ బాబు తెలుగు వెర్షన్‌కి, రణ్‌బీర్ కపూర్ హిందీ వెర్షన్‌కి వాయిస్ ఓవర్ ఇస్తారట.
సినిమాలో మెయిన్ హీరోలను పరిచయం అవడానికి ముందే వాయిస్ ఓవర్ ఉంటుందని, వీరి వాయిస్ ఓవర్ తోనే హీరోలు పరిచయం అవుతారని తెలుస్తుంది. చాలా పవర్ ఫుల్‌గా ఉండే ఈ వాయిస్ ఓవర్స్ ని ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ తో చేయిస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ వార్త మహేష్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, అటు రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.
also read: అనిల్ రావిపూడికి విజయ్ షాక్, `భగవంత్ కేసరి` రీమేక్ వెనుక జరిగింది ఇదేనా?