MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర

Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత సినిమాకు కేరళలో 4Kలో రీ-రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది. ఇది కేరళలో బన్నీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 13 2026, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కేరళలో అల్లు అర్జున పాత సినిమా ప్రభంజనం..
Image Credit : PR Team

కేరళలో అల్లు అర్జున పాత సినిమా ప్రభంజనం..

తెలుగు సూపర్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆయన పాత సినిమా 'హ్యాపీ' రీ-రిలీజ్ ఇప్పుడు అక్కడ థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. దాదాపు 20 ఏళ్ల కిందటి సినిమాకు మలయాళీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వేరే ఏ ఇతర భాషా నటుడికీ దక్కని ఆదరణ బన్నీకి అక్కడ లభిస్తోంది. రీ-రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే థియేటర్లన్నీ పండగలా మారిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
150 రోజులు ఆడిన సినిమా..
Image Credit : sun nxt

150 రోజులు ఆడిన సినిమా..

ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో 'హ్యాపీ' సినిమా 2006లో మొదటిసారి రిలీజైంది. ఆ రోజుల్లోనే ఈ సినిమా కేరళలో ఏకంగా 150 రోజులకు పైగా ఆడి పెద్ద రికార్డు సృష్టించింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ 4K టెక్నాలజీతో బిగ్ స్క్రీన్‌పైకి వచ్చినప్పుడు కూడా, మొదటిసారి చూస్తున్నంత ఉత్సాహంతో మలయాళీ ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. తమ 'మల్లు అర్జున్‌'ను చూసేందుకు ఎగబడుతున్నారు.

Related Articles

Related image1
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Related image2
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
34
కేరళ థియేటర్లలో ఐకాన్ స్టార్ జాతర..
Image Credit : Asianet News

కేరళ థియేటర్లలో ఐకాన్ స్టార్ జాతర..

సినిమాలోని ఎవర్ గ్రీన్ పాటలు, అల్లు అర్జున్ స్టెప్పులు స్క్రీన్‌పై కనిపించగానే అభిమానులు కేకలు వేస్తూ, స్క్రీన్ ముందు డ్యాన్సులు చేస్తున్నారు. కొన్ని సీన్లు రీ క్రియేట్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. కేరళ థియేటర్లలో ఆ హడావిడికి సంబంధించిన ఈ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సినిమాలోని డైలాగులు కూడా ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచాయి.

44
మోహన్ లాల్ తరువాత అంత క్రేజ్..
Image Credit : Asianet News

మోహన్ లాల్ తరువాత అంత క్రేజ్..

గతంలో మలయాళంలో మోహన్‌లాల్ నటించిన 'ఛోటా ముంబై', 'దేవదూతన్' లాంటి సినిమాలు రీ-రిలీజ్ అయినప్పుడు ఎలాంటి సందడి కనిపించిందో, ఇప్పుడు 'హ్యాపీ'కి కూడా అదే స్థాయిలో స్పందన వస్తోంది. చాలా థియేటర్లలో సినిమా అయ్యాక ప్రేక్షకులు 'అల్లు అర్జున్‌కు జై', 'బన్నీకి జై' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒక పాత సినిమాకు ఇప్పటికీ ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అని సోషల్ మీడియాలో చాలామంది ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. 

ఖాదర్ హసన్ నేతృత్వంలోని రాధక్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని 4Kలో రీ-రిలీజ్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో రాకా సినిమా బిజీలో ఉన్నాడు. ఈసినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత మరో తమిళ దర్శకుడైన లోకేష్  కనగరాజ్ తో బన్నీ మూవీ చేయబోతున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Recommended image2
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Recommended image3
Aishwarya Rai: సల్మాన్‌తో బ్రేకప్‌పై ఐశ్వర్య షాకింగ్ కామెంట్స్, అప్పట్లో ఏమన్నదంటే?
Related Stories
Recommended image1
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved