మంచు లక్ష్మి పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు, అర్హ అలా అనేసిందేంటి?
టాలీవుడ్ నటి, మంచు లక్ష్మిని షాకింగ్ క్వశ్చన్ అడిగి అందరిని ఆశ్చర్యపరిచింది, అల్లు అర్జున్ గారాల కూతురు అర్హ. ఇంతకీ ఆమె ఏం అడిగింది.?

స్టార్ కిడ్ అల్లు అర్హ
స్టార్ కిడ్ అల్లు అర్హ తన చలాకితనంతో మళ్లీ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హా, గతంలోనూ అనేక క్యూట్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. తాజాగా ఆమె సరదా సంభాషణ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో అర్హా, సినీ నటిని టీవీ ప్రెజెంటర్ అయిన మంచు లక్ష్మి యాక్సెంట్‌పై చురకలేసినట్లు ప్రశ్నించడం హైలైట్ అయింది.
KNOW
మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్
ఈ వీడియోలో మంచు లక్ష్మి అర్హాతో మాట్లాడుతూ, "నువ్వు నన్ను ఏదో అడగాలి అన్నావు కదా.. అది ఏంటి?" అని అడిగింది. దీనికి వెంటనే స్పందించిన అర్హ, "మీకు తెలుగు రాదా?" అని ప్రశ్నించింది. దాంతో ఆశ్చర్యపోయిన మంచు లక్ష్మి, "నేను తెలుగు అమ్మాయినే పాప, నీకు అంత అనుమానం ఎలా వచ్చింది? నీతో తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా" అని సమాధానమిచ్చింది.
Mee accent ala undi 😍😂
CUTE 🫶❤️ #Arha#AlluArjunpic.twitter.com/u20uB6DFSJ— Movies4u Official (@Movies4u_Officl) August 7, 2025
వీడియో తీసిన అల్లు అర్జున్
ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నాడు. స్వయంగా వీడియో తీస్తూ.. ఆయన కూడా షాక్ అయ్యారు. పెద్దగా నవ్వుతూ "ఏంటి అర్హ, ఎందుకు అలా అడిగావు?" అని అన్నాడు బన్నీ. దీనికి అర్హా సమాధానంగా "మీ ఆక్సెంట్ అలా ఉంది" అని చెప్పడంతో అక్కడి వారంతా పెద్దగా నవ్వుతూ అర్హా మాటలకు మురిసిపోయారు. అప్పుడు మంచు లక్ష్మి కూడా "నీ యాక్సెంట్ కూడా అలాగే ఉంది కదా!" అని సరదాగా సమాధానం ఇచ్చింది. ఈ చిన్న చాట్ క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నెటిజన్లు ఏమంటున్నారంటే
ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ "మేము అడగాలనుకున్న ప్రశ్నని చిన్నారి అర్హ అడిగేసింది", "థాంక్యూ అర్హ పాప" అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న పాప అయినప్పటికీ.. ఆమె ప్రశ్న విధానం, స్వభావం నెటిజన్లకు బాగా నచ్చింది. ఇక మంచు లక్ష్మి రీసెంట్ గా హైదరాబాద్ వచ్చింది. ఆమె ప్రస్తుతం ముంబయ్ లో ఉంటుంది. బాలీవుడ్ లో టాక్ షో చేస్తుంది. అక్కడే సినిమా ప్రయత్నాలు చేస్తూ..ముంబయ్ లో సెటిల్ అయ్యింది లక్ష్మి. అడపాదడపా ఏదైనా పని ఉంటేనే హైదరాబాద్ వస్తోంది.
అల్లు అర్జున్ భారీ స్కెచ్
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప 2 తో బాక్సాఫీస్ పై హవా చూపించాడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అంతన్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డ్ లు కూడా బ్రేక్ చేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు అట్లీతో కలిసి ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు. 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈమూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు సరిపడే విధంగా ఈసినిమా రాబోతోంది. పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ ఈ మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఇది విజయవంతమైతే, అల్లు అర్జున్ "పాన్ వరల్డ్ స్టార్"గా స్థిరపడే అవకాశముంది.