- Home
- Entertainment
- 300 కోట్ల ఇల్లు, 3 కోట్ల కారు, భర్తకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరు?
300 కోట్ల ఇల్లు, 3 కోట్ల కారు, భర్తకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్.. కోట్ల ఆస్తికి వారసురాలు.. స్టార్ హీరోకు భార్య. భర్తకంటే కూడా ఎక్కువగా సంపాదిస్తున్న ఆ హీరోయిన్ ఎవరు..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆమె స్టార్ హీరోయిన్.. స్టార్ డైరెక్టర్ కు వారసురాలు, స్టార్ హీరోకు భార్య. టాలీవుడ్ లో వెయ్యి కోట్ల హీరోయిన్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తన భర్త అంత పెద్ద స్టార్ హీరో అయినా.. తనకంటే కూడా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న తార. ఒక బిడ్డకు తల్లి అయినా... అందంలె ఏమాత్రం వన్నెతగ్గని హీరోయిన్ ఎవరు..?
Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
ఆమె మరెవరో కాదు ఆలియా భట్. అవును పైన మనం చెప్పుకున్న విధంగా ఆమె స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కు వారసురాలు, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కు భార్య. దాదాపు 5 ఏళ్లు ప్రేమించుకుని సహజీవనం చేసిన తరువాత వీరు పెళ్ళి చేసుకున్నారు. ఇక వీరిక రహా అనే కూతురు కూడా ఉంది. అయినా సరే ఆలియా భట్ అందం విషయంలో కొత్తగా వస్తున్న హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. హీరోయిన్ గా మాత్రమే కాదు మోడల్ గా కూడా రాణిస్తోంది.
Also Read:ఈ సూపర్ హిట్ సాంగ్ లో నటించిన నలుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా? హీరో హీరోయిన్ తో సహా
Alia Bhatt Ranbir Kapoor
తన భర్త రణ్ బీర్ కపూర్ కంటే కూడా ఎక్కుగా సంపాదిస్తోంది, భర్త కంటే ఆస్తిలో కూడా ఎక్కువే కలిగి ఉంది ఆలియా భట్. ఇంతకీ ఆమె ఆస్తి విలువ ఎంతో తెలుసా.. కొన్ని సర్వేల ప్రకారం అందాజుగా ఆలియా ఆస్తి 600 కోట్లకుపైగా ఉంటుందట. అంతే కాదు 300 కోట్ల విలువ చేసే బంగ్లాతో పాటు.. 3 కోట్లు విలువ చేసే కారు కూడా ఆమె సొంతం.
రణ్ బీర్ కపూర్ మొత్తం ఆస్తుల విలువ రూ. 345 కోట్లు కాగా, అలియా భట్ ఆస్తుల విలువ రూ. 550 కోట్లు. కార్లంటే ఆమెకు పిచ్చి. అందకే ఆలియాభట్ కలెక్షన్ లో మరికొన్ని లగ్జరీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాతు ఆలియా భట్ సోంతంగా బిజినెస్ కూడా నడుపుతోంది.
Also Read:72 కోట్ల ఆస్తిని స్టార్ హీరోకి రాసిచ్చి చనిపోయిన మహిళా అభిమాని, ఎవరా హీరో, అంత పిచ్చి ప్రేమ ఎందుకు?
ఆల్ లైన్ బొటిక్ బ్రాండ్ కూడా ఆలియాకు ఉంది. ఇలా రకరకాల మార్గాల ద్వారా ఆలియా భట్ సంపాదిస్తోంది. ఇక హీరోయిన్ గా ఆమె ప్రతిభ, నటన ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. గంగూబాయ్ లాంటిసినిమాలు ఆమెలో నటినిక అందరికి తెలిసేలా చేసింది. అంతే కాదు ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది బ్యూటీ. ఈసినిమాతో ఆస్కార్ రేంజ్ కు వెళ్ళింది. ఇక ఆతరువాత తెలుగులో ఏ సినిమా చేయలేదు ఆలియా భట్.
పెళ్ళి తరువాత తన భర్తతో బ్రహ్మస్త్రలో నటించి మెప్పించింది బ్యూటీ. అలియా భట్ బ్రహ్మాస్త్ర 1, శివ, గంగూభాయ్ కతివాడి, గల్లీ భాయ్స్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అంతే కాదు ఆమె నటించిన 20 సినిమాలలో 100 కోట్లు దాటిన సినిమాలు 7 ఉన్నాయి. హాలీవుడ్ సిరీస్ హార్ట్ ఆఫ్ స్టోన్ లో అలియా నటించింది.సినీరంగంలో నటిగా ఎలా సక్సెస్ అయ్యిందో, వ్యాపారంలోనూ జెండా ఎగురవేస్తోంది అలియా భట్.
Alia Bhatt Ranbir kapoor
ఎడ్-ఎ-మమ్మా అనే పిల్లల స్పోర్ట్స్ వేర్ కంపెనీని నడిపిస్తోంది ఆలియా భట్. దీని ద్వారా ఆమె వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించింది. సృజనాత్మకతతో బట్టలు తయారు చేస్తూ.. బ్రాండ్ నేమ్ సంపాదించుకోవడంతో పాటు .. బిజినెస్ ను అంచలంచలుగా పెంచుకుంటోంది . అద్భుతమైన డిజైన్లు.. క్వాలిటీ వర్క్ తో అందిస్తూ.. వ్యాపారాన్ని పెంచుకుంటూపోతోంది. ఈ బ్రాండ్ స్టార్ట్ చేసిన ఏడాదిలోనే దాదాపు 150 కోట్ల విలువైన కంపెనీగా అవతరించింది. వీటితో పాటు అలియా భట్ IIT కాన్పూర్ యొక్క D2C వెల్నెస్ స్టార్టప్ ఫూల్.కోలో కూడా పెట్టుబడి పెట్టింది.