MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR: tv9 పై రాజమౌళి అదిరిపోయే పంచ్, అంతటా వైరల్

RRR: tv9 పై రాజమౌళి అదిరిపోయే పంచ్, అంతటా వైరల్

బెంగళూరు: శుక్రవారం ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌తో బెంగళూరులో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. రామ్‌చరణ్‌, తారక్‌, అలియాభట్‌తో పాటు నిర్మాత డీవీవీ దానయ్య సైతం ఈ సమావేశంలో పాల్గొని మీడియావారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ ప్రశ్నలు అడుగుతున్న సమయంలో టీవి 9 వారు అడిగిన ఓ ప్రశ్నకు రాజమౌళి ఇచ్చిన సమాధానం  వైరల్ అయ్యింది. ఇంతకీ టీవి 9 విలేఖరి ఏమి అడిగారు...వైరల్ అవ్వాల్సినంత మ్యాటర్ ఏముందో చూద్దాం. 

4 Min read
Author : Surya Prakash | Asianet News
Published : Dec 11 2021, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
118


 “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఈ రోజు చిత్ర యూనిట్ బెంగుళూర్ వెళ్ళింది. ముంబై ఈవెంట్ కు మిస్ అయిన రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా, మీడియా వేసిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ బదులిచ్చింది. ఈ క్రమంలోనే టీవీ9కు దిమ్మతిరిగే సమాధానంతో పంచ్ ఇచ్చారు  రాజమౌళి. 

218
RRR Movie

RRR Movie


‘నెక్స్ట్ కన్నడ హీరోతో మూవీ చేస్తారా?’ అని టీవీ9 కన్నడ మీడియా ఛానల్ రాజమౌళిని ప్రశ్నించగా, మీరు ఏ ఛానల్ నుండి అని అడిగారు. ‘టీవీ9 కన్నడ’ అని విలేఖరి బదులివ్వగా, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలను, కానీ ఇప్పుడు చెప్పను అని చెప్పారు జక్కన్న.  అయితే అందుకు కారణం కూడా వివరించారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

318
RRR Movie

RRR Movie


రాజమౌళి మాట్లాడుతూ....మీరు అడిగిన ఆ ప్రశ్నకు జవాబిస్తే… మీరు ‘ఆర్ఆర్ఆర్’ని పక్కన పెట్టి, అది హెడ్ లైన్స్ లో రాస్తారని, అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ పక్కకి వెళ్ళిపోతుందని, ఈ సినిమా రిలీజ్ అయ్యి అంతా ముగిసిన తర్వాత మళ్ళీ చిట్ చాట్ చేసినపుడు ఖచ్చితంగా చెప్తాను, ఇప్పుడైతే కాదని రాజమౌళి ఇచ్చిన సమాధానానికి ఆడిటోరియం ఫిదా అయ్యింది. టీవీ9పై పడ్డ ఈ పంచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

418
RRR Movie

RRR Movie

  మీ విజయ రహస్యం ఏమిటి?

రాజమౌళి: నేనెప్పుడూ సక్సెస్‌ సాధించానని భావించను. ప్రతి సినిమానీ నా మొదటి ప్రాజెక్ట్‌లానే అనుకుంటాను. నేను ఏదైతే కథ అనుకుంటానో దానికి సరిపడా నటీనటులను ఎంచుకోవడమే నా బలం అని భావిస్తుంటాను. ఈ సినిమా విషయానికొస్తే కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల కోసం సరైన నటులను ఎంచుకోవటం చాలా ముఖ్యం. తారక్‌, చరణ్‌ల రూపంలో నాకు మంచి నటులు దొరికారు.

518
RRR Trailer

RRR Trailer

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రియల్‌ కథా? లేదా ఫిక్షనా?

రాజమౌళి: అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లలో ఉన్న ఎనలేని స్ఫూర్తిని ప్రేరణగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఒక్క సీన్‌కీ హిస్టరీతో సంబంధం ఉండదు. అంతా ఫిక్షనల్‌ మాత్రమే. బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధైర్యంతో వాళ్లిద్దరూ పోరాటం చేశారు. ఆ ధైర్యాన్నే మేము ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చూపించాం.

618


రాజమౌళి చిత్రంలో నటించడం ఎలా ఉంది?

అలియా భట్‌: ఆయన సినిమాలో నటించడం వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. సినిమాపై ఆయనకి ఎంతో విజ్ఞానం ఉంది. బ్రేక్‌ సమయంలోనూ ఆయన నాకు ఎన్నో కథలు చెప్పేవారు.

718


సినిమాలో తారక్‌-పులి ఫైట్‌ ఉంది కదా. దాన్ని చూస్తుంటే లాజిక్‌గా అనిపిస్తోందా?

చరణ్‌: లాజిక్‌ పూర్తైనప్పుడే డ్రామా ప్రారంభమవుతుంది అని నేను భావిస్తుంటాను. రాజమౌళి గురించి నాకు బాగా తెలుసు. ఆయన ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు. కాబట్టి ఆయన తెరకెక్కించిన సినిమాలు చూసేటప్పుడు నేను లాజిక్ గురించి ఆలోచించను.

818

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని కన్నడలో డబ్బింగ్‌ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

రాజమౌళి: ‘బాహుబలి’ని కేవలం తెలుగు, తమిళంలోనే చిత్రీకరించాను. హిందీ, మలయాళంలో డబ్‌ చేశాను. ఆ సినిమా ట్రైలర్‌ విడుదలైన సమయంలో కన్నడలో ‘బాహుబలి’ డబ్‌ చేయలేదని చాలామంది నన్ను తిట్టారు. సోషల్‌మీడియాలో నెగెటివ్‌ కామెంట్లు పెట్టారు. ‘అన్ని భాషలకు ప్రాముఖ్యత ఇచ్చారు. కన్నడ వాళ్లని చులకనగా చూస్తున్నారా?’ అని అన్నారు. కానీ, ఆ సమయంలో కన్నడలో ఉన్న రూల్స్‌ ప్రకారమే మేము ‘బాహుబలి’ని డబ్‌ చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని కన్నడలో డబ్‌ చేసిన సమయంలో భాష పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.
 

 

918


కన్నడ హీరోలతో మీరు సినిమా ఎప్పుడు చేస్తారు?

రాజమౌళి: అది నేను ఇప్పుడు చెప్పను. ఎందుకంటే.. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెబితే అందరూ దాని గురించే మాట్లాడతారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పక్కకు వెళ్లిపోతుంది. కాబట్టి, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలయ్యాక తప్పకుండా ఓసారి అందరితో చిట్‌చాట్‌ నిర్వహిస్తాను. అప్పుడు చెబుతాను.

1018

ఎన్టీఆర్‌.. మీకన్నా చరణ్‌ చిన్నవాడు కదా. సినిమాలో ఆయన్ని అన్న అని పిలవడం ఎలా ఉంది?

తారక్‌: చరణ్‌ని అన్నయ్య అని పిలవడం నాకు బాగుంది. మా ఇద్దరి మధ్య కేవలం ఒక ఏడాది మాత్రమే గ్యాప్‌ (నవ్వులు)

1118

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందా?

దానయ్య: తప్పకుండా సినిమా కలెక్షన్స్‌పై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. సినిమా టికెట్ ధరల విషయంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఎక్కువ షోలు ప్రదర్శించే విధంగా మాట్లాడుతున్నాం.

1218

షూటింగ్‌ సమయంలో రాజమౌళి చెప్పినట్లు ఏదైనా సీన్‌ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది?

తారక్‌: సెట్‌లో ఆయన కూల్‌గా ఉండడు. మమ్మల్ని ఫుల్‌ టార్చర్‌ చేశాడు (నవ్వులు). (మధ్యలో అలియా మైక్‌ తీసుకుని నాకు మాత్రం సరదాగా సాగింది) అని చెప్పడంతో.. ఆమెకు షూటింగ్‌ సరదాగా ఉండి ఉండొచ్చు కానీ నేను, చరణ్‌ టార్చర్‌ చూశాం.

1318


చరణ్‌: కొవిడ్‌ నిబంధనలు, కొన్ని లొకేషన్స్‌లో నిబంధనలు ఉన్న కారణంగా రాజమౌళి మమ్మల్ని యూరప్‌ తీసుకువెళ్లారు. ఉక్రెయిన్‌లో 12 రోజులు ఉన్నాం. అందులో 10 రోజులు.. రోజూ సుమారు 7 గంటలపాటు రిహార్సల్స్‌ మాత్రమే చేశాం. మా ప్రాక్టీస్‌లు ఆయనకు నచ్చడంతో 11వ రోజు షూట్‌ ప్రారంభించాడు. కేవలం రిహార్సల్స్‌ కోసమే వేరే దేశానికి తీసుకెళ్లిన దర్శకుడు ఈయనే అయ్యుంటాడు. 

1418

తారక్‌: సాధారణంగా కూడా రాజమౌళి ఇలానే ఉంటారు. ఆయనకు ఏదైనా కావాలంటే అది పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకూ ఇలాగే చేస్తారు. కావాలంటే రమా గారిని అడగండి. (నవ్వులు)

రాజమౌళి: నేను ఎప్పుడైనా మీపై అరిచానా?

చరణ్‌: లేదు

రాజమౌళి: నేను ఎప్పుడైనా నా చిరాకుని మీ పై చూపించానా?

తారక్‌: ఎస్‌ (నవ్వులు)

రాజమౌళి: ఎప్పుడు?

తారక్‌: ఎప్పుడూ.. ప్రతిసారీ మీరు మరో టేక్‌ అంటుంటారు. కాబట్టి మీరు ఫ్రస్టేటెడ్‌ డైరెక్టర్‌

చరణ్‌: ఆయన కోపం, చిరాకుని పైకి చూపించరు ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటారు. (మధ్యలో తారక్‌ అందుకుని సరదాగా నో అనడంతో అందరూ నవ్వులు పూయించారు) 

1518

రాజమౌళి: నాటు నాటు సాంగ్‌కి వచ్చిన సక్సెస్‌ చూసి మీరు ఆనందిస్తున్నారా?

తారక్‌, చరణ్‌: ఎస్.. (మధ్యలో రాజమౌళి అందుకొని అలాంటప్పుడు మీరు నాపై ఫిర్యాదు చేయకూడదు)

తారక్‌: ఆమె అడిగిందని చెప్పాను సర్‌. కంప్లెయింట్‌ చేయడం లేదు (నవ్వులు

1618


ఈ సినిమాకి వెన్నెముక మీ ఫాదర్‌ విజయేంద్రప్రసాద్‌ రాసిన కథేనా?

రాజమౌళి: నా మునుపటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి సైతం మా నాన్న విజయేంద్రప్రసాద్‌ కథ రాశారు. ఆయనే ఈ చిత్రానికి వెన్నెముక. ఈ సినిమా కథ విషయంలో నాన్నని బాగా టార్చర్‌ చేశాను. నేను ఏవిధంగా టార్చర్‌ చేశాననేది చరణ్‌-తారక్‌ని కాదు మా నాన్నని అడగండి.

1718

మీ సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకుల్లో ఎంతో ప్రభావం చూపిస్తాయి. అజయ్‌ దేవ్‌గణ్‌ పాత్ర ఎలా ఉంటుంది?

రాజమౌళి: అజయ్‌ దేవ్‌గణ్‌ పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన పాత్ర ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపేలా ఉంటుంది. ఈ సినిమా ఆయన నుంచే ప్రారంభమవుతుంది.

1818

యాక్షన్, ఎమోషన్స్ మేళవింపుగా ప్రేక్షకులను ఇద్దరు వీరుల పోరాటంతో పాటు ప్రయాణం చేయించింది.  ప్రధాన పాత్రలైన కొమురం భీం.. అల్లూరి మధ్య సంఘర్షణతో పాటు కథ ఏమిటో రాజమౌళి చెప్పేశారు. ట్రైలర్ లోనే కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళి(Rajamouli) స్టైల్. ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే ముందే వాళ్ళ మైండ్ లో సినిమా పట్ల ఒక అవగాహన కలిగేలా చేస్తాడు. ఆ అంచనాలు అందుకొని విజయం సాధిస్తాడు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Recommended image2
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved