MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Alia Bhatt: మోస్ట్ గ్లామర్‌ లుక్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ.. లవ్‌ అండ్ వార్‌ నుంచి అలియాభట్‌ లుక్‌

Alia Bhatt: మోస్ట్ గ్లామర్‌ లుక్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ.. లవ్‌ అండ్ వార్‌ నుంచి అలియాభట్‌ లుక్‌

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, విక్కీ కౌశల్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `లవ్ అండ్‌ వార్‌`. దీన్నుంచి అలియా భట్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది టీమ్‌. ఇందులో అలియా గ్లామర్‌తో ఆకర్షిస్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 25 2026, 07:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
లవ్‌ అండ్‌ వార్‌ మూవీతో రాబోతున్న రణ్‌బీర్‌, అలియాభట్‌
Image Credit : Instagram: vickykaushal09

లవ్‌ అండ్‌ వార్‌ మూవీతో రాబోతున్న రణ్‌బీర్‌, అలియాభట్‌

అలియాభట్‌ తెలుగు ఆడియెన్స్ కి `ఆర్ఆర్‌ఆర్‌`తో పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇందులో సీతగా మెరిసింది. తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇప్పుడు ఆమె హిందీలో `లవ్‌ అండ్‌ వార్‌` చిత్రంలో నటిస్తోంది. పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది. దీనికి సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించడం విశేషం. ఆయన ఇండియన్‌ మూవీస్‌లోనే అత్యంత గ్రాండియర్‌ మూవీస్‌కి కేరాఫ్. ఆయన సినిమా ఒక విజువల్‌ ట్రీట్‌గా ఉంటుంది. ప్రతి ఫ్రేము కనువిందు చేస్తుంది. ఇప్పుడు ఆయన మరో కనువిందుని ఇచ్చేందుకు వస్తున్నారు. రణ్‌ బీర్‌ కపూర్‌, అలియాభట్‌, విక్కీ కౌశల్‌ కాంబినేషన్‌లో లవ్‌ అండ్‌ వార్‌ మూవీని రూపొందిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
లవ్‌ అండ్‌ వార్‌ నుంచి అలియాభట్‌ ఫస్ట్ లుక్‌
Image Credit : Asianet News

లవ్‌ అండ్‌ వార్‌ నుంచి అలియాభట్‌ ఫస్ట్ లుక్‌

ఈ సినిమా నుంచి ఇప్పటికే రణ్‌ బీర్‌ కపూర్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. రక్తం మరకలతో బ్లూ కారులో ప్రయాణిస్తున్నట్టుగా స్టయిలీష్‌ లుక్‌లో రణ్‌ బీర్ ఫస్ట్ లుక్‌ అదిరిపోయింది. ప్రేమ కోసం యుద్ధం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పుడు అలియాభట్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు.

తెలుగులోనూ లవ్‌ అండ్‌ వార్‌

మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను తెప్పిస్తున్నాయి. ఈ పాత్రలో అలియా పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఆమె పాత్ర బలంగా ఉండబోతుందని, అదే సమయంలో గ్లామర్‌తో ట్రీట్‌ ఇవ్వబోతుందని తాజా లుక్‌ చూస్తుంటే అర్థమవుతుంది. దీంతో అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం 2027 జనవరి 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ దీన్ని విడుదల చేయబోతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
వినోదం
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth Odela: తేడా కొట్టిన 'ది ప్యారడైజ్', శ్రీకాంత్ ఓదెల వాట్ నెక్స్ట్ ? చిరంజీవితో మూవీ ఉంటుందా
Recommended image2
Motivational Song: ‘ఇంతే ఇంతింతే’.. ఇది పాట మాత్ర‌మే కాదు, జీవితాన్ని మార్చే ఆలోచన
Recommended image3
D56 Movie: తొలిసారి కలిసిన ధనుష్, వడివేలు.. 'లబ్బర్ పందు' డైరెక్టర్‌తో కొత్త సినిమా షురూ!
Related Stories
Recommended image1
Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌
Recommended image2
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved