MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • D56 Movie: తొలిసారి కలిసిన ధనుష్, వడివేలు.. 'లబ్బర్ పందు' డైరెక్టర్‌తో కొత్త సినిమా షురూ!

D56 Movie: తొలిసారి కలిసిన ధనుష్, వడివేలు.. 'లబ్బర్ పందు' డైరెక్టర్‌తో కొత్త సినిమా షురూ!

D56 Movie Pooja: 'లబ్బర్ పందు' డైరెక్టర్ తో ధనుష్ కొత్త సినిమా మొదలైంది. ఇందులో తొలిసారిగా ధనుష్, వడివేలు కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 25 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
D56 Movie Pooja
Image Credit : X

D56 Movie Pooja

కోలీవుడ్‌లో హీరోగానే కాకుండా డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్‌గా ధనుష్ తన టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో ధనుష్ నటించిన 'ఓం' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులో మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే, ధనుష్ తన నెక్స్ట్ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టాడు. సూపర్ హిట్ 'లబ్బర్ పందు' మూవీ డైరెక్టర్ తమిళరసన్ పచ్చముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పూజా కార్యక్రమాలతో మొదలైన D56
Image Credit : X

పూజా కార్యక్రమాలతో మొదలైన D56

వర్కింగ్ టైటిల్ D56తో ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 25న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శివగంగ ప్రాంతంలోని మారనాడు కరుప్పసామి గుడిలో ఈ మూవీకి పూజ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళరసన్ పచ్చముత్తు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కనిపించనుంది. అలాగే వడివేలు, ఎస్.జె.సూర్య లాంటి స్టార్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

34
సినిమా టైటిల్ ఏంటి?
Image Credit : X

సినిమా టైటిల్ ఏంటి?

ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నాడు. 'లబ్బర్ పందు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమిళరసన్ పచ్చముత్తు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

D56 మూవీని టాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోందని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాకు 'పడైయల్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, టైటిల్‌పై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

44
మధురై బ్యాక్‌డ్రాప్ స్టోరీ
Image Credit : X

మధురై బ్యాక్‌డ్రాప్ స్టోరీ

మధురై బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా విలేజ్ వాతావరణంలో సాగే భారీ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ఇప్పటివరకు ధనుష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, ఒక కొత్త విలేజ్ క్యారెక్టర్‌లో ఆయన కనిపించనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలైన నేపథ్యంలో, త్వరలోనే సినిమా అఫీషియల్ టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ వివరాలు వరుసగా బయటకు రానున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌
Recommended image2
Nani: ప్యారడైజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాని ఎమోషనల్ పోస్ట్
Recommended image3
ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు
Related Stories
Recommended image1
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Recommended image2
ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved