- Home
- Entertainment
- పాపం అక్షయ్ కుమార్, అడ్డంగా బుక్కయ్యారు.. రెండుసార్లు కన్నప్ప చిత్రాన్ని రిజెక్ట్ చేసి, ఇలా చీటింగ్ చేస్తూ..
పాపం అక్షయ్ కుమార్, అడ్డంగా బుక్కయ్యారు.. రెండుసార్లు కన్నప్ప చిత్రాన్ని రిజెక్ట్ చేసి, ఇలా చీటింగ్ చేస్తూ..
కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన మహా శివుడి పాత్రను పోషించారు. పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అప్పుడప్పుడు దక్షిణాది చిత్రాల్లో కనిపిస్తున్నారు. శంకర్ 2 0 చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ కీలకమైన మహా శివుడి పాత్రను పోషించారు. పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది.
అయితే అక్షయ్ కుమార్ ముందుగా కన్నప్ప చిత్రంలో నటించడానికి అంగీకరించలేదు. రెండుసార్లు మంచు విష్ణు రిక్వెస్ట్ ని అక్షయ్ కుమార్ రిజెక్ట్ చేశారట. కానీ మంచు విష్ణు వదిలిపెట్టలేదు. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నించి అక్షయ్ కుమార్ ని కన్నప్ప చిత్రానికి ఒప్పించారు.
ఇటీవల థియేటర్లలో విడుదలైన కన్నప్ప చిత్రం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. క్లైమాక్స్ లో మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అంతా ప్రశంసించారు. ప్రభాస్ పాత్ర వల్లే కన్నప్ప చిత్రం నిలబడింది అని ఆడియన్స్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.
అయితే కన్నప్ప చిత్రం కోసం బలవంతంగా అంగీకరించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. కన్నప్ప మూవీ లో అక్షయ్ కుమార్ డైలాగులు చెబుతున్న విధానం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అక్షయ్ కుమార్ ఎంతో అను అనుభవం ఉన్న స్టార్ హీరో. ఎలాంటి డైలాగులైనా చెప్పడం అక్షయ్ కుమార్ కి అంత కష్టం కాకపోవచ్చు.
కానీ అక్షయ్ కుమార్ కన్నప్ప చిత్రంలో డైలాగులు సొంతంగా నేర్చుకుని చెబుతున్నట్లు లేదు. టెలీప్రాంప్టర్ ను చూస్తూ డైలాగులు చదువుతున్నట్లు ఉంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అక్షయ్ కుమార్ తన కళ్ళు తిప్పుతున్న విధానం చూస్తే ఆయన టెలీప్రాంప్టర్ ను చూసే డైలాగులు చెబుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.
దీంతో నెటిజన్లు అక్షయ్ కుమార్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత పెద్ద స్టార్ హీరోకి కనీసం డైలాగులు నేర్చుకొని చెప్పడం చేతకాదా ? ఇంత అనుభవం ఉన్న హీరో ఇలా చీటింగ్ చేయడం ఏంటి? అంటూ నెటిజన్లు అక్షయ్ కుమార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా అక్షయ్ కుమార్ ఇలా వద్దనుకున్న చిత్రంలో నటించి అడ్డంగా బుక్కయ్యారు.