MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాయ్ చెప్పడమే తప్పైందా? ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి వద్దని పారిపోయిన జంట కథ

హాయ్ చెప్పడమే తప్పైందా? ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి వద్దని పారిపోయిన జంట కథ

Hi Movie OTT: ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి ఇష్టం లేక ఓ కుర్రాడు ఇల్లు వదిలి వచ్చేస్తాడు. అదే సమయంలో మరో అమ్మాయి కూడా తనకు ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ఈ ఇద్దరి జీవితాల్లో ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు వీళ్ల కథ ఎలా మలుపు తిరిగింది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 25 2026, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు
Image Credit : Insatagram

ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు

యువ హీరో కవిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తొలిసారిగా కలిసి నటించిన సినిమా 'హాయ్'. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ రొమాంటిక్ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని 'హాయ్' చూసేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎందులో చూడొచ్చంటే?
Image Credit : Insatagram

ఎందులో చూడొచ్చంటే?

జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 25 నుంచి 'హాయ్' సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రావడం విశేషం. సౌత్ ఆడియన్స్ అందరూ తమ సొంత భాషల్లో ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు.

36
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..
Image Credit : Insatagram

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..

కవిన్, నయనతార తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోవడమే 'హాయ్' సినిమాకు ప్రధాన ఆకర్షణ. వేర్వేరు జనరేషన్లకు చెందిన ఈ ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తున్నారని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

46
సినిమా కథ ఏంటంటే?
Image Credit : Insatagram

సినిమా కథ ఏంటంటే?

విష్ణు ఎడవన్‌ ఈ సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేని ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో కవిన్ 'మయిల్' అనే యువకుడి పాత్ర పోషించాడు. పెళ్లి ఇష్టం లేక ఇల్లు వదిలి వచ్చిన మయిల్, అలాగే తనకు ఇష్టం లేని పెళ్లి నుంచి దూరంగా వెళ్లాలనుకునే నయనతార.. ఈ ఇద్దరి ప్రయాణం ఎలా కలిసింది అన్నదే ఈ సినిమా కథ.

56
ఎవరెవరు నటించారు?
Image Credit : Insatagram

ఎవరెవరు నటించారు?

కవిన్, నయనతారతో పాటు ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. రాధికా శరత్‌కుమార్, ప్రభు, దివంగత కే. భాగ్యరాజ్, వీటీవీ గణేష్, సత్యన్, అమృతా శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు ఆదిత్య కదిర్, ఖురేషీ, ఫెప్సీ విజయన్, కావియా అరివుమణి, రెంజీ పణిక్కర్, మిర్చి కెమి కూడా నటించారు.

66
సెప్టెంబర్ 25 నుంచి జీ5లో..
Image Credit : Insatagram

సెప్టెంబర్ 25 నుంచి జీ5లో..

'హాయ్' సినిమాతో విష్ణు ఎడవన్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. డైరెక్టర్ కాకముందు అతను తమిళంలో మంచి గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'మాస్టర్' సినిమాలోని 'పొలకట్టుమ్ పరా పరా', 'లియో'లోని 'బాడాస్' లాంటి సూపర్ హిట్ పాటలను అతనే రాశాడు.

జీ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్లపై విఘ్నేష్ శివన్, నయనతార, ఎస్.ఎస్. లలిత్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ క్రేజీ కాంబినేషన్ మూవీని చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: అతని పేరు చెప్పగానే భయంతో వణికిపోయిన రజినీకాంత్, చేతిలో సిగరెట్ పడేసి ఏం చేశాడంటే? తనికెళ్ల భరణి చెప్పిన సీక్రెట్..
Recommended image2
Richest Indian Actor: ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా? టాప్ 5 లిస్ట్ ఇదే
Recommended image3
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Related Stories
Recommended image1
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Recommended image2
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved