- Home
- Entertainment
- Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
బతుకు జట్కాబండి ప్రోగ్రాం పై రోజా సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ ప్రోగ్రాం రియాలా ఫేకా అనే విషయాలని రోజా బయట పెట్టారు. దీని గురించి రోజా చెప్పిన ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Paramjyothi
నటి, రాజకీయ నేత రోజా సెల్వమణి ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. పాలిటిక్స్ లో బిజీ అయ్యాక రోజా సినిమాలు బాగా తగ్గించారు. కానీ బుల్లితెరకి జబర్దస్త్, బతుకు జట్కా బండి లాంటి షోలు చేశారు. ఇప్పుడు అవి కూడా చేయడం లేదు. అయితే రోజా బతుకు జట్కా బండి ప్రోగ్రాం రోజా చేస్తున్నప్పుడు బాగా వైరల్ అయ్యేది.
పరంజ్యోతి ఎపిసోడ్
ముఖ్యంగా పరంజ్యోతి అనే ఎపిసోడ్ సంచలనం సృష్టించింది. పెళ్ళైన ఓ మహిళ పరంజ్యోతి అనే తన ప్రియుడు గురించి చెప్పిన విషయాలు ఆడియన్స్ ని విపరీతంగా నవ్వించాయి. ఆమె చెప్పిన విషయాలు ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఆమెని రోజా గుర్తు చేసుకుని నవ్వేశారు. అతడిని ఎందుకు ప్రేమించావు అని అడిగితే.. అతడి కళ్ళల్లో చక్రాలు చూసి ప్రేమించా అని చెప్పింది.
బతుకు జట్కా బండి ఫేకా ?
చాలా మంది ఆ ఎపిసోడ్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకుని అప్పుడప్పుడూ చూస్తూ ఉంటారు. అందరికీ తెగ నచ్చేసింది ఆ ఎపిసోడ్. దానిని చూసి చాలా మంది బతుకు జట్కాబండి ప్రోగ్రాం రియాలా లేక ఫేకా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ప్రోగ్రాం 100 శాతం రియల్. ఎలాంటి స్క్రిప్ట్ లేదు అని రోజా క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రోగ్రాం కెరీర్ పరంగా ఉపయోగపడింది. అలాగే మానసిక సంతృప్తిని ఇచ్చింది అని రోజా తెలిపారు. ఆ ప్రోగ్రాం కి వచ్చిన జంటలని కలిపేందుకు నేను ఎక్స్ట్రా టైం కూడా కుర్చునేదానిని. ఒక్కో రోజు 6 గంటలు గడిచిపోయేవి.
ఆ బాధ్యత నేను తీసుకున్నా
అలా మాక్సిమం జంటలని ఒక్కటి చేయగలిగాను. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ఇగోల వల్ల విడిపోయడానికి సిద్ధం అయ్యారు. సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ బాధ్యతను బతుకు జట్కా బండి ద్వారా నేను తీసుకున్నా అని రోజా తెలిపారు.
చిన్న ఇగోల వల్ల గొడవలు
గతంలో భార్య భర్తల మధ్య గొడవలు వస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల ఎవరో ఒకరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళు కలుస్తామన్నా చెడగొట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. అందరూ చిన్న ఇగోల వల్లే గొడవలు పెద్దవి చేసుకున్నారు అని రోజా తెలిపారు.

