Bhanumathi : భానుమతి తో రొమాన్స్.. భయంతో వణికిపోయిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏన్టీఆర్,ఏఎన్నార్ తో పాటు భానుమతి కూడా పెద్ద దిక్కుగా ఉండేవారు. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆమెకు ఉండేది. ఆమెతో సినిమా అంటే అందికి భయం. ఇక భానుమతితో రొమాంటిక్ సాంగ్ చేయాలంటే.. అంతే సంగతులు.

ఇండస్ట్రీని వణికించిన భానుమతి..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి లాంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. కానీ టాలీవుడ్ ను వణికించిన భానుమతి గురించి చాలామందికి పూర్తిగా తెలియు. ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే కూడా పవర్ ఫుల్ రోల్ ను ప్లే చేశారు. హీరోయన్ గా , నిర్మాత, దర్శకురాలిగా, స్టూడియో అధినేతగా, గాయనిగా, ఇలా మల్టీ టాలెంట్ తో ఇండస్ట్రీలో దూసుకుపోయారు భానుమతి. ఆమె అంత టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టే.. చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవారు. ఎంత పెద్ద నటులు, దర్శకులు ఉన్నా.. చాలా హుందాగా.. స్ట్రిక్ట్ గా ఉండేవారు.
భానుమతితో అంత ఈజీ కాదు..
భానుమతి అంటే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు గౌరవం ఇచ్చేవారు. ఆమె సెట్ లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు. చివరకు ఇండస్ట్రీ అంతా గౌరవించే ఎన్టీఆర్ ఏఎన్నార్ లు కూడా భానుమతి దగ్గర కాస్త తగ్గి ఉండేవారు. ఆమె సినిమా అంటే అది పూర్తయ్యే వరకూ ఓ టాస్క్ లా ఉండేది. ఇక భానుమతి కాంబినేషన్ లో సాంగ్ కానీ, రొమాంటిక్ సీన్ కానీ.. లవ్ సీన్ కానీ ఉందంటే ఇక అంతే సంగతులు.. ఓ సారి ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది అలనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరావుకి.
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కూడా భయపడేవారు..
హీరోయిన్లతో ఏఎన్నాఆర్ చాలా సరదాగా ఉండేవారు. ఆటపట్టించేవారు, ఏడిపించేవారు, సొంతవారిలా చూసుకునేవారు. కాని ఒక భానుమతి విషయంలో మాత్రం కాస్త భయపడేవారు. అక్కినేని మాత్రమే కాదు ఎన్టీఆర్ కి కూడా ఆమె అంటే భయం ఉండేదట. ఇక భానుమతితో కలిసి నటించిన సమయంలో ఏఎన్నార్‌కు ఎదురైన ఓ చిన్న అనుభవాన్ని స్వయంగా ఆయనే జయప్రదతో చేసిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె భుజంమీద చేయి వేయాల్సి వచ్చినప్పుడు అక్కినేని పడిన ఇబ్బంది గురించి వివరించారు.
ఏఎన్నార్ చెప్పిన రహస్యం...
ఈక్రమంలోనే భానుమతితో జరిగిన ఓ సంఘటనను ఏఎన్నార్ స్వయంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ..'' ఓ సినిమా పాట షూటింగ్ జరుగుతుంది.. ఓ సాంగ్ షూట్ లో భానుమతి భుజంపై చేయివేయాల్సి ఉంది. ఆ సీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది...టెన్షన్ పడ్డాను.
అక్కినేనిని బెదిరించిన భానుమతి
అందులో భానుమతి వేసుకున్న చీర, బ్లౌజ్ పై మెరుపులు ఉన్నాయి. చేయి వేస్తే గుచ్చుకుంటుంది. అందులోనే ఆమె ఏమంటుందా అనే భయం కూడా ఉంది. ఆర్టిఫిషల్ గా చేస్తే బాగోదు.. ఫ్రీగా ఉందామంటే కుదరదు.. ఇక అలా ఇబ్బందిపడుతున్న టైమ్ లోనే, భానుమతి"సరిగ్గా చేయివేయండి" అని అరిచింది. దాంతో భయపడి ఏదోలా ఆ సీన్ కంప్లీట్ చేశాము'' అని ఏఎన్నార్ అన్నారు.
బామ్మ పాత్ర చేసినా కూడా తగ్గేదే లే..
హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భానుమతి తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. బామ్మ పాత్రల్లో కూడా భానుమతి పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ను మాత్రం వదులుకోలేదు. మంగమ్మగారి మనవడు లాంటి సినిమాల్లో ఆమె ఆత్మవిశ్వాసం వేరుగా కనిపిస్తుంది. . స్టార్ హీరోల ముందు కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేవారు భానుమతి. ఎన్టీఆర్ ఏఎన్నార్ ల కంటే ముందు ఇండస్ట్రీకి వచ్చారు. అంతే కాదు ఈ ఇద్దరు హీరోలకంటే వయసులో కూడా పెద్దవారు కావడంతో అందరు ఆమెను గౌరవించేవారు.

