- Home
- Entertainment
- అకీరా నందన్ కోసం నిర్మాతలు క్యూ, హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే? అకీరా క్రేజ్‌కి థియేటర్లు బ్లాస్ట్ !
అకీరా నందన్ కోసం నిర్మాతలు క్యూ, హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే? అకీరా క్రేజ్‌కి థియేటర్లు బ్లాస్ట్ !
Akira Nandan Entry Update: పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ హీరో ఎంట్రీకి సంబంధించిన పుకార్లు ఊపందుకున్న నేపథ్యంలో ఇప్పుడు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్తలు వినిపిస్తున్నాయి.

Akira Nandan Entry Update:
Akira Nandan Entry Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానుల్లో ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటే సినిమాని ఫాలో అయ్యే వారందరికి తెలుసు. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా తెలుస్తుంది.
ఆయన రాజకీయాల్లో చేసే ప్రచారాలు, సభల్లోనూ ఆ క్రేజ్ తెలిసిపోతుంది. పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా పవన్ క్రేజ్ తగ్గలేదు. నిత్యం జనాల్లో ఉన్న కూడా ఆయన క్రేజ్ మరింతగా పెరుగుతుందని చెప్పొచ్చు.
Akira Nandan Entry Update:
అయితే అదే క్రేజ్ ఆయన కొడుకు అకీరా నందన్ కి కూడా వస్తుంది. పవన్ క్రేజీ ఫ్యాన్స్ కొడుకుని కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవల అకీరా నందన్ వీడియోలు థియేటర్లలో ప్రదర్శించడం విశేషం. ఇటీవల కాలంలో అకీరా నందన్ ఎక్కువగా బయట కనిపించాడు.
పవన్ ఎన్నికల్లో గెలిచినప్పుడు, చంద్రబాబు, మోడీని కలిసినప్పుడు, జనసేన ఆఫీసులో, ఎయిర్‌పోర్ట్ వద్ద ఇలా చాలా చోట్ల కనిపించాడు, వాటిని ఓ మ్యాషప్ వీడియోగా చేసి థియేటర్లలో ప్రదర్శించారు. దీనికి ఆడియెన్స్ ఊగిపోవడం విశేషం. ఇటీవల ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.
Akira Nandan Entry Update:
ఈ నేపథ్యంలో ఇప్పుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. అకీరా నందన్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్ట్యా నిర్మాతలు పవన్ చుట్టూ క్యూ కడుతున్నారట. తాము హీరోగా పరిచయం చేస్తామని పోటీ పడుతున్నారట.
పవన్ అనుమతి కోసం ఆయన చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తుంది. అకీరా నందన్ ఇటీవల బాగా బయట కనిపించడంతో ఆయన సినిమాల్లోకి రాబోతున్నారనే చర్చ మొదలైన నేపథ్యంలో ఇప్పుడు హీరో ఎంట్రీ వార్తలు గుప్పుమంటున్నాయి.
Akira Nandan Entry Update:
అయితే అకీరా ఎంట్రీకి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందట. ప్రస్తుతం సినిమాల్లోకి రావడానికి సంబంధించిన యాక్టింగ్, ఫిజిక్ పరంగా ఆయన రెడీ కావాల్సి ఉంది. నటనలో శిక్షణలో తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే అకీరా ఆ దిశగా ఫోకస్ చేయబోతున్నాడని సమాచారం.
అన్నీ కుదిరితే మరో రెండేళ్లలో మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. భారీ స్థాయిలో అకీరా హీరోగా ఎంట్రీకి ప్లాన్ జరుగుతుందని, ఇప్పటికే ఆ ప్లాన్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.
Akira Nandan Entry Update:
ఇదిలా ఉంటే అకీరానందన్ `ఓజీ`లో కనిపిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఓ క్లీప్ లీక్ అయ్యింది. అందులో ఉన్నది అకీరానే అన్నారు. కానీ అది క్లారిటీ లేదు. ఇటీవల రామ్ చరణ్ కూడా అకీరా త్వరలోనే థియేటర్లలో కనిపించే అవకాశం ఉందని కూడా హింట్ ఇచ్చారు.
మరి నిజంగానే ఓజీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తారా? అనేది చూడాలి. కానీ అకీరా కోసం మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఫస్ట్ సినిమా అవకాశం ఏ దర్శకుడు, నిర్మాతలకు దక్కుతుందో చూడాలి.
Read more: Klinkaara Look Leak: రామ్ చరణ్ అడ్డంగా దొరికిపోయాడు.. క్లీంకార లుక్ లీక్, ఎంత క్యూట్‌గా ఉందో
also read: Rashmika Troll: నోరుజారిన రష్మిక మందన్నా, కన్నడ ఫ్యాన్స్ ట్రోల్స్.. కావాలనే ఆ కామెంట్ చేసిందా?