- Home
- Entertainment
- Rashmika Troll: నోరుజారిన రష్మిక మందన్నా, కన్నడ ఫ్యాన్స్ ట్రోల్స్.. కావాలనే ఆ కామెంట్ చేసిందా?
Rashmika Troll: నోరుజారిన రష్మిక మందన్నా, కన్నడ ఫ్యాన్స్ ట్రోల్స్.. కావాలనే ఆ కామెంట్ చేసిందా?
Rashmika Troll: రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతుంది. అదే సమయంలో ఆమె చుట్టూ వివాదాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఆమె తనది హైదరాబాద్ అని చెప్పడం పెద్ద రచ్చ అవుతుంది.

Rashmika Troll: నేషనల్ క్రష్‌గా రాణిస్తుంది రష్మిక మందన్నా. ఆమె ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా రాణిస్తుందని చెప్పొచ్చు. నెంబర్ వన్ పొజీషియన్‌లో ఉందని చెప్పొచ్చు. మూడేళ్లు మూడు బ్లాక్ బస్టర్స్ తో దుమ్ములేపుతుంది. మరో వెయ్యి కోట్ల సినిమాకు రెడీ అవుతుంది. ఇటీవల `పుష్ప 2`తో సుమారు రెండు వేల కోట్ల సినిమాకి కారణమయ్యింది రష్మిక, అంతకు ముందు `యానిమల్`తోనూ దుమ్మురేపింది.
ఇప్పుడు `ఛావా` మూవీతో మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అయ్యింది. విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన `ఛావా`మూవీ విశేష ఆదరణ పొందుతుంది. కేవలం హిందీ వెర్షన్‌లోనే విడుదలైన ఈ చిత్రం తొలి రోజు ఏకంగా రూ. 33కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ కి మళ్లీ ఊపిరి పోసింది.
ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలు పెద్దగా ఆదరణ పొందడం లేదు. అడపాదడపా ఒకటి అర తప్ప వరుసగా హిట్లు వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు `ఛావా` బాగానే ఆడే ఛాన్స్ ఉంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. తన నటనతోనూ మెస్మరైజ్ చేసిందీ నేషనల్ క్రష్.
Rashmika Mandanna, Vicky Kaushal
ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది `ఛావా` సినిమా విషయంలో కాదు, ఆమె చేసిన కామెంట్స్ విషయంలో. నెగటివిటీ విషయంలో ట్రోల్కి గురవుతుంది. పెద్ద రచ్చ అవుతుంది. మరి ఇంతకి రష్మిక మందన్నా ఏం చేసిందనేది చూస్తే, `ఛావా` ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్నా తాను హైదరాబాదీని అని చెప్పడం పెద్ద రచ్చగా మారింది.
రష్మిక మందన్నా మాట్లాడుతూ, `నాది హైదరాబాద్. ఇక్కడికి ఒంటరిగా వచ్చాను, ఇప్పుడు నేను కూడా మీ కుటుంబంలో ఒకరిని అనుకుంటున్నా. థ్యాంక్యూ` అని చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇందులో తనది హైదరాబాద్‌గా చెప్పడం ఆశ్చర్యపరుస్తుంది.
తాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను అనేది ట్రావెలింగ్‌కి సంబంధించి చెప్పిందా? లేక తన ఊరు హైదరాబాద్ అని చెప్పిందా అనేది క్లారిటీ లేదు. కాకపోతే ఆమె చెప్పిన తీరునిబట్టి చూస్తే తనది హైదరాబాద్ అనే చెప్పినట్టుగా అనిపిస్తుంది.
Rashmika Mandanna
ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా కన్నడ ఫ్యాన్స్ రష్మికని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విరాజ్ పేట, కొడుగుజిల్లా హైదరాబాద్‌లో ఉందా? సొంత ఇంటిని, ఊరునే మర్చిపోయావా? సక్సెస్ వస్తే ఊరినే మార్చేస్తారా? వామ్మో రష్మిక ఎక్కడ జన్మించిందో కూడా తెలియడం లేదా? అంటూ రచ్చచేస్తున్నారు.
నిన్ను ట్రోల్ చేయడం సరైనదే అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. ఆ మధ్య కన్నడ వాళ్లని తక్కువ చేసి మాట్లాడినందుకే పెద్ద గొడవ చేశారు. రష్మిక కూడా తలొగ్గి సారీ చెప్పింది. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ప్రస్తుతం టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు రహస్య డేటింగ్ చేస్తున్నా, చాలా సార్లు దొరికిపోయారు. రష్మిక కూడా పరోక్షంగా హింట్ ఇస్తూ వచ్చింది. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రష్మిక ఈ కామెంట్ చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా రష్మిక రచ్చ వేరే లెవల్
read more: Klinkaara Look Leak: రామ్ చరణ్ అడ్డంగా దొరికిపోయాడు.. క్లీంకార లుక్ లీక్, ఎంత క్యూట్‌గా ఉందో