MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత ఫోటోలు షేర్ చేసిన అఖిల్.. జైనబ్ తో రొమాంటిక్ గా, వైరల్

పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత ఫోటోలు షేర్ చేసిన అఖిల్.. జైనబ్ తో రొమాంటిక్ గా, వైరల్

అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని జూన్ 6న వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. జైనబ్ తో అఖిల్ వివాహం ఘనంగా జరిగింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 28 2025, 07:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అఖిల్ అక్కినేని వివాహం
Image Credit : Instagram

అఖిల్ అక్కినేని వివాహం

అక్కినేని ఫ్యామిలీ యువ వారసుడు అఖిల్ అక్కినేని జూన్ 6న వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. జైనబ్ తో అఖిల్ వివాహం ఘనంగా జరిగింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నాగార్జున ఇంట్లోనే అఖిల్ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత గ్రాండ్ గా రిసెప్షన్ కూడా నిర్వహించారు. రిసెప్షన్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇన్ని రోజుల తర్వాత పెళ్లి ఫోటోలు షేర్ చేయాలని అనిపించిందా ?
Image Credit : Instagram

ఇన్ని రోజుల తర్వాత పెళ్లి ఫోటోలు షేర్ చేయాలని అనిపించిందా ?

అఖిల్ వివాహం తర్వాత ఆ ఫోటోలని నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా కంగ్రాట్స్ చెప్పారు. కానీ అఖిల్ మాత్రం తన పెళ్లి గురించి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కానీ పెళ్లయిన దాదాపు 20 రోజుల తర్వాత అఖిల్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. 20 రోజుల తర్వాతే తన పెళ్లి విషయం అభిమానులకు చెప్పాలని అఖిల్ కి అనిపించిందా అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.

35
జైనబ్ తో రొమాంటిక్ గా.. 
Image Credit : Instagram

జైనబ్ తో రొమాంటిక్ గా.. 

పెళ్లి వేడుకలో జైనబ్ తో రొమాంటిక్ గా ఉన్న అందమైన ఫోటోలని అఖిల్ షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమమైన రోజుకు సంబంధించిన కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది అంటూ అఖిల్ తన పెళ్లి ఫోటోలని షేర్ చేశారు. పెళ్లి బట్టల్లో అఖిల్, జైనబ్ ఇద్దరూ మెరిసిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నారు.

45
వేలకోట్ల ఆస్తులకు వారసురాలు 
Image Credit : Instagram

వేలకోట్ల ఆస్తులకు వారసురాలు 

అఖిల్ భార్య జైనబ్ బడా పారిశ్రామికవేత్త జుల్ఫీ కుమార్తె. ఆమె వేల కోట్ల ఆస్తులకు వారసురాలని ప్రచారం జరుగుతోంది. జైనబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జున కుటుంబాలకు వ్యాపారంలో పరిచయాలు ఉన్నాయని సమాచారం. ఆ విధంగా అఖిల్ కి జైనబ్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమకు కారణమైంది.

55
అఖిల్ లెనిన్ మూవీ
Image Credit : Instagram

అఖిల్ లెనిన్ మూవీ

ఇక సినిమాల విషయానికొస్తే అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీల ఎంపిక కాగా ఆ తర్వాత ఆమె డేట్స్ ఇష్యూ కారణంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Recommended image2
Sobhita Dhulipala: అద్దం ముందు శోభిత ఫోజులు.. రెడ్ రోజ్ లుక్‌లో గ్లామర్ ట్రీట్!
Recommended image3
Udta Teer Trailer: ఇండియాకి వచ్చి గతం మరచిపోయిన పాకిస్తాన్ స్పై..ఆయుష్మాన్ ఖురానా సినిమా ట్రైలర్ అదుర్స్
Related Stories
Recommended image1
రష్మిక 'మైసా' ఫస్ట్ లుక్ పై విజయ్ దేవరకొండ క్రేజీ రియాక్షన్.. అతడిని ముద్దుగా ఏమని పిలిచిందో తెలుసా ?
Recommended image2
బిగ్ సర్ప్రైజ్, నితిన్ తమ్ముడు చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్.. ఆ సీన్లు తొలగించేందుకు దిల్ రాజు నో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved