MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్

Lenin Teaser: లెనిన్ టీజర్ రివ్యూ.. ఒకవైపు ప్రేమ, మరో వైపు కత్తి పట్టి విధ్వంసం.. రాయలసీమ కుర్రోడిగా అఖిల్

అఖిల్, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లెనిన్ చిత్రం జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్ ఎలాంటి హడావిడి లేకుండా టీజర్ రిలీజ్ చేశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2026, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ
Image Credit : Asianet News

అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ

అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. రాయలసీమ నేపథ్యంలో మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంత వరకు విజయాల ఖాతా తెరవలేదు. కనీసం ఈ మూవీతో అయినా హిట్ కొడతాడేమో అని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
లెనిన్ టీజర్ రివ్యూ
Image Credit : Asianet News

లెనిన్ టీజర్ రివ్యూ

ఇదిలా ఉండగా ఎలాంటి హడావిడీ లేకుండా తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ కలసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రిలీజైన టీజర్ లో ఎక్కువగా అఖిల్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. భాగ్యశ్రీ డ్రామా కంపెనీలో పనిచేసే అమ్మాయిగా కనిపిస్తోంది.

Related Articles

Related image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Related image2
Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్
35
అఖిల్, భాగ్యశ్రీ క్యూట్ రొమాన్స్
Image Credit : Asianet News

అఖిల్, భాగ్యశ్రీ క్యూట్ రొమాన్స్

రాయలసీమ పల్లెటూరి యాసలో అఖిల్, భాగ్యశ్రీ చెబుతున్న డైలాగ్స్, వాళ్ళిద్దరి మధ్య క్యూట్ రొమాన్స్ చూడముచ్చటగా ఉన్నాయి. నేను తప్పిపోయి రాలేదు.. అందరినీ వెతుక్కుంటూ వచ్చా అని అఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

45
ఆకట్టుకునేలా ప్రేమ సీన్లు
Image Credit : Asianet News

ఆకట్టుకునేలా ప్రేమ సీన్లు

ఈ మూవీలో అఖిల్, భాగ్య శ్రీ మధ్య ప్రేమ సన్నివేశాలు యువతకు ఫీస్ట్ గా ఉండబోతున్నాయి. అయితే టీజర్ లో చెప్పిన డైలాగ్స్ కొన్ని పుష్ప చిత్రం తరహాలో ఉండడం చిన్న మైనస్. టీజర్ చివర్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది.

55
చివర్లో ఫ్యాక్షన్ విధ్వంసం
Image Credit : our own

చివర్లో ఫ్యాక్షన్ విధ్వంసం

ఈ టీజర్ లో రొమాంటిక్ అంశాలు మాత్రమే కాదు. ఫ్యాక్షన్ సీన్స్ కూడా చూపించారు. చివర్లో అఖిల్ కత్తి పట్టుకుని విధ్వంసం చేస్తున్న సన్నివేశాలు కూడా చూపించారు. మరి అఖిల్ ఫ్యాక్షన్ ని, లవ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. జూన్ 26న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Memu Copulam Review: నాగబాబు వెబ్‌సిరీస్ మేము కాప్‌లం ఎలా ఉందంటే? కామెడీ మెప్పించిందా?
Recommended image2
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Recommended image3
Ram Charan vs Janhvi Kapoor: రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లలో ఎవరు ఎక్కువ రిచ్ ? ఎవరి ఆస్తి ఎంత?
Related Stories
Recommended image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Recommended image2
Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved