MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్

Vishnupriya: యూట్యూబర్ పై కేసు నమోదు చేసిన విష్ణుప్రియ.. ఒక అమ్మాయి ఇలా చేస్తుందా అంటూ ఫైర్

తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ యూట్యూబ్‌లో అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న 'ప్లే లైక్ ఇంకాగ్నిటో' ఛానల్‌పై నటి విష్ణుప్రియ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 22 2026, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీస్ కేసు
Image Credit : Asianet News

యూట్యూబ్‌ ఛానల్‌పై పోలీస్ కేసు

చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటుల వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ భీమనేని తీవ్రంగా స్పందించారు. తనపై నిరంతరాయంగా అసత్య ప్రచారాలు చేస్తూ, అసభ్యకర వ్యాఖ్యలతో వేధిస్తున్న 'ప్లే లైక్ ఇంకాగ్నిటో' అనే యూట్యూబ్ ఛానల్‌పై ఆమె చట్టపరమైన చర్యలకు దిగారు. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె అధికారికంగా ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణను ప్రారంభించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కంప్లెంట్ వెనుక ఉన్న అసలు కారణం
Image Credit : instagram/VishnuPriya

కంప్లెంట్ వెనుక ఉన్న అసలు కారణం

ఈ కేసుకు సంబంధించిన వివరాలను విష్ణుప్రియ స్వయంగా పంచుకుంటూ.. పోలీసులు ఈ వ్యవహారంలో కఠినంగా వ్యవహరించబోతున్నారని, అందుకు తాను కృతజ్ఞతురాలినని పేర్కొన్నారు. ముఖ్యంగా సదరు యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతోంది ఒక మహిళే అయ్యుండి కూడా, తోటి మహిళా సెలబ్రిటీల గురించి అంత నీచంగా మాట్లాడటంపై ఆమె మండిపడ్డారు. కేవలం తన కోసమే కాకుండా, ఇలాంటి పనులు చేసే ఇతర ఛానల్స్ అందరికీ ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ అడుగు వేసినట్లు తెలిపారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్
Related image2
Ram Charan Peddi: హమ్మయ్య, పెద్దిగాడి అవయవాలు సేఫ్.. స్టోరీపై రూమర్స్ అన్నీ పటాపంచలు
35
సహనం నశించి తీసుకున్న నిర్ణయం
Image Credit : Asianet News

సహనం నశించి తీసుకున్న నిర్ణయం

నిజానికి ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, చాలా రోజులుగా తాను ఓపిక పడుతూ వచ్చానని విష్ణుప్రియ చెప్పారు. కానీ రోజురోజుకూ నిందలు ఎక్కువైపోవడం, సమాజంలోకి తనపై నెగిటివ్ పబ్లిసిటీతో కూడిన తప్పుడు సమాచారాన్ని కావాలనే చేరవేస్తుండటంతో ఇక లాభం లేదనుకున్నట్లు వివరించారు. అబద్ధాలను నిజాలుగా నమ్మిస్తూ ఆడియన్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నందుకే సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌పై కంప్లెంట్ చేయాల్సి వచ్చిందన్నారు.

45
క్యారెక్టర్ అస్సాసినేషన్‌పై మండిపాటు
Image Credit : Instagram

క్యారెక్టర్ అస్సాసినేషన్‌పై మండిపాటు

తాము చిత్ర పరిశ్రమలోకి వచ్చింది ప్రేక్షకులను అలరించడానికి, వారి బాధలను మర్చిపోయేలా సంతోషపెట్టడానికేనని విష్ణుప్రియ గుర్తుచేశారు. తాము చేసిన పనిలో నిజంగా ఏదైనా పొరపాటు ఉంటే విమర్శించినా, నిందించినా తలదించుకుని స్వీకరిస్తామని.. కానీ ఏమాత్రం తప్పు చేయకపోయినా క్యారెక్టర్ అస్సాసినేట్ చేస్తూ, డబ్బు కోసం దేనికైనా సిద్ధపడతారు అనే రేంజ్‌లో పెద్ద పెద్ద ఛానల్స్ మాట్లాడటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

55
నోరు మూసుకుని కూర్చునే ప్రసక్తే లేదు
Image Credit : Instagram

నోరు మూసుకుని కూర్చునే ప్రసక్తే లేదు

ఇకపై ఇలాంటి విషయాల్లో నోరు మూసుకుని కూర్చునే ప్రసక్తే లేదని, ఏ ఆడపిల్ల గురించైనా సరే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఒకరితో ఈ పోరాటాన్ని మొదలుపెట్టానని, భవిష్యత్తులో మరెవరు ఇలాంటి హద్దులు దాటిన ప్రవర్తనకు పాల్పడినా.. వారి యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ అయ్యేలా స్ట్రైక్స్ వేయిస్తామని, చట్టపరంగా కఠినమైన శిక్షలు పడేలా ముందుకు వెళ్తామని తీవ్రంగా హెచ్చరించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్
Recommended image2
Ram Charan Peddi: హమ్మయ్య, పెద్దిగాడి అవయవాలు సేఫ్.. స్టోరీపై రూమర్స్ అన్నీ పటాపంచలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved