MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా మారని ఫేట్... అఖండ వలన ప్రగ్యా కు దక్కిందేమిటి!

Akhanda: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా మారని ఫేట్... అఖండ వలన ప్రగ్యా కు దక్కిందేమిటి!

2021 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అఖండ (Akhanda). విడుదలై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్స్ లో అఖండ జోరు తగ్గలేదు. కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తరుణంలో బాలయ్యకు అఖండ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చింది . 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 20 2021, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


 
అఖండ మూవీ విడుదలకు ముందు వరకు ప్రగ్యా జైస్వాల్ (Pragya jaiswal)పరిస్థితి కూడా అదే. ఆమె టాలీవుడ్ నుండి దాదాపు ఫేడ్ అవుట్ అయ్యారు. ప్రగ్యాకు అఖండ మూవీ ఆఫర్ దక్కడమే పెద్ద షాకే. గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించారు. 

27


మొదట అఖండ హీరోయిన్ గా నయనతారను అనుకున్నారు. ఆమెను సంప్రదించడం కూడా జరిగింది. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, అఖండ మూవీ నుండి నయనతార తప్పుకున్నారు. ఆ కారణంగా అఖండ ఆఫర్ ప్రగ్యా ఖాతాలో వచ్చి చేరింది. 

37

జిల్లా కలెక్టర్ గా, బాలయ్య (Balakrishna)భార్యగా ఆమె రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించారు. మరి వంద కోట్ల వసూళ్లకు పైగా రాబట్టిన అఖండ విజయం ప్రగ్యాకు బ్రేక్ ఇచ్చిందా అంటే.. ఆ సూచనలు కనిపించడం లేదు. బాలయ్య వన్ మ్యాన్ షోగా సాగిన అఖండ వలన ప్రగ్యాకు ఒరిగిందేమీ లేదన్న మాట వినిపిస్తుంది. 

47

అఖండ కథలో ప్రగ్యా పాత్రకు ఒకింత ప్రాధాన్యత ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. అయినప్పటికీ అఖండ క్రెడిట్ మొత్తం ఎప్పటిలాగే బాలయ్య కొట్టేశాడు.జనాల్లో, మీడియా వర్గాల్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తావనే రావడం లేదు. 

57

అఖండ మూవీ విజయం సాధించినా ప్రగ్యా కెరీర్ కి ప్లస్ కాలేదు.కెరీర్ బిగినింగ్ కొన్ని విజయాలు దక్కినా ప్రగ్యా కెరీర్ నిర్మించుకోలేకపోయారు. నటించిన చిత్రాలలో చాలా వరకు పరాజయం పాలు కావడం ఆమె అవకాశాలను బాగా దెబ్బతీశాయి. 

 

67

అఖండ హిట్ టాక్ తర్వాత కూడా ప్రగ్యా కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇంత పెద్ద విజయం కనీస ఆఫర్స్ తెచ్చిపెట్టకపోవడం నిజంగా నిరాశపరిచే అంశమే. 

77


అఖండ మూవీపై ఆశలు పెట్టుకున్నవారిలో హీరో శ్రీకాంత్ కూడా ఒకరు. ఆయన సీరియస్ విలన్ వరదరాజులు పాత్రలు విశ్వరూపం చూపించారు. టాలీవుడ్ లో విలన్ గా సెటిల్ కావాలన్న ఆయన ఆశ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. దీంతో అఖండ విజయం ఒక్క బాలయ్యకే ప్లస్ అయిందంటున్నారు. 

Also read Brahmastra :రాజ‌మౌళి ‘బ్రహ్మస్త్ర’కి బాలయ్య 'అఖండ' కు లింక్,సింక్

Also read Pragya Jaiswal: నాజూకు అందాలతో బాలయ్య హీరోయిన్ రచ్చ చూశారా.. హిట్టు పడితే అంతేగా

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Recommended image2
Dhurandhar 2 Trailer Review: ధురంధర్ 2 ట్రైలర్‌ రివ్యూ.. యాక్షన్‌తో రణ్‌వీర్ సింగ్ విధ్వంసం.. 5 పవర్‌ఫుల్ డైలాగ్స్
Recommended image3
Nayanthara House: 31 కోట్లతో 4BHK ఇల్లు, పోయెస్ గార్డెన్‌లో నయనతార కొత్త కాపురం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved