Romantic: రొమాంటిక్ సెలబ్రిటీ రివ్యూ... దూల తీరిపోతుంది, కుర్రాళ్ళు ఫస్ట్ షో టికెట్స్ బుక్ చేసుకోండి!
దర్శకుడు పూరి నిర్మాతగా కొడుకు ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ ఎంటర్టైనర్ రొమాంటిక్. వరల్డ్ వైడ్ నేడు గ్రాండ్ గా రిలీజ్ కావడం జరిగింది.
నూతన దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన Romantic రెండు రోజుల క్రితం టాలీవుడ్ సెలబ్స్ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రీమియర్ షోకి రాజమౌళితో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ హాజరయ్యారు. మరి రొమాంటిక్ మూవీ చూసిన మన టాలీవుడ్ సెలెబ్స్ ఏమ్మన్నారంటే..
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... ముసలోడివి నీకెందుకు ఈ సినిమా అంటారేమో భయం వేసింది. రొమాంటిక్ యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఆకాష్ పూరి క్లైమాక్స్ లో అద్భుతంగా నటించాడు. ఓ సీనియర్ నటుడిలా క్లోజ్ అప్ షాట్స్ లో అలరించారు. కేతిక శర్మ కూడా మంచి నటన కనబరిచారు. దర్శకుడు అనిల్ ఫెంటాస్టిక్ గా సినిమా తెరకెక్కించారని, సినిమా విజయం సాధిస్తుందని, Rajamouli అన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆకాష్ నువ్వు క్లైమాక్స్ లో ఏడిపించేశావ్, తన మంచి నటుడని చిన్నప్పటి నుండి తెలుసు. అతన్ని ఫస్ట్ డైరెక్ట్ చేసింది నేనే. సినిమా చాలా బాగుంది. కేతిక, ఆకాష్ చాలా బాగా చేశారని, అన్నారు
ఆకాష్ క్లైమాక్స్ లో ఇరగదీశాడు.ఈ సినిమా చూశాక మీరు ఆకాష్, కేతిక ప్రేమలో పడిపోతారు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన గొప్ప లవర్ స్టోరీ రొమాంటిక్ మూవీ అని చెప్పాలి. సినిమా మొత్తం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీ చూసేటప్పుడు అందరు ఒక హ్యాంగ్ ఓవర్ లో ఉండిపోతారు... అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి తన అభిప్రాయం వెల్లడించారు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి రొమాంటిక్ మూవీపై తన రివ్యూ ఇచ్చాడు . ఈ మూవీ పూర్తిగా ఇంటెన్స్ అండ్ రొమాన్స్ డ్రామా. సినిమా మాములుగా లేదు, ఆకాష్ వన్ మాన్ షో ముఖ్యంగా కుర్రాళ్ళు మొదటి షో బుక్ చేసుకొని వెళ్ళండి. పూరి డైలాగ్స్ మాములుగా లేవు. సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.
కాగా క్రాక్ సినిమాతో ఫార్మ్ లోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని రొమాంటిక్ ప్రీమియర్ కి హాజరయ్యారు. అనంతరం మూవీపై తన రివ్యూ ఇచ్చారు. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చెప్పాలంటే పూరి గారి తర్వాతే. ఆకాష్ ఒక రాక్ స్టార్. సినిమా చాలా బాగుంది. Ketika sharma కోసం అయితే రిపీటెడ్ ఆడియెన్స్ వస్తారని, తన అభిప్రాయం వెల్లడించారు.
జగన్ గారి పెన్ చాల షార్ప్, ఇడియట్ తరహాలో రిపీటెడ్ ఆడియన్స్ రొమాంటిక్ సినిమాకు వస్తారని, దర్శకుడు మెహర్ రమేష్ అన్నారు.
పూరి ఫేవరేట్ నటుడు ఆలీ రొమాంటిక్ మూవీకి తన మార్కు రివ్యూ ఇచ్చాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు. గోవాలో విపరీతమైన ఎండలో పనిచేశారు.ఒక రకంగా చెప్పాలంటే దూల తీరిపోయింది. అంత ఉన్నా కూడా సక్సెస్ కోసం Akash puri తపిస్తున్నాడు. పరిశ్రమకు ఓ అద్భుతమైన హీరో ఇండస్ట్రీకి దొరికారడన్న అభిప్రాయం వెల్లడించారు.
ఇక దర్శకుడు అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం వెల్లడించారు. ఆకాష్ పూరి కోసం మూడు సార్లు, కేతిక కోసం మూడు సార్లు, ఎంటైర్ టీం కోసం మరొకసారి రొమాంటిక్ మూవీ చూడవచ్చని, ట్వీట్ చేశారు.
నటుడు తేజా సజ్జా రొమాంటిక్ మూవీపై తన ట్విట్టర్ రివ్యూ ఇచ్చారు. రొమాంటిక్ మూవీని అక్కడక్కడా చిన్న నవ్వుతో పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఆకాష్ పూరి చంపేశారు. కేతిక శర్మ మంచి నటన కనబరిచారు. సినిమా చాలా బాగుంది,చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో దర్శకుడు బాబీ రొమాంటిక్ మూవీపై పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ప్యూర్, ఇంటెన్స్ లవ్ డ్రామా. ఆకాష్ పూరి పరిపక్వతతో కూడిన ప్రదర్శన ఇచ్చాడు. Puri jagannadh డైలాగ్స్ కి వంద మార్కులు పడతాయి. కేతిక గుడ్.. అంటూ ఆయన తన రివ్యూ తెలిపారు.
Also read Varudu kaavalenu review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ
Also read 'వరుడు కావలెను' ప్రీమియర్ షో టాక్