- Home
- Entertainment
- వెంకటేష్ `ప్రేమంటే ఇదేరా` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? సినిమాల్లేక ఖాళీ
వెంకటేష్ `ప్రేమంటే ఇదేరా` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? సినిమాల్లేక ఖాళీ
వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `ప్రేమంటే ఇదేరా` ఒకటి. లవ్ స్టోరీస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీని ఓ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసింది. ఆమె ఎవరనేది తెలుసుకుందాం.

`ప్రేమంటే ఇదేరా` లవ్ స్టోరీస్‌లో ఒక ట్రెండ్ సెట్టర్
విక్టరీ వెంకటేష్ 90లో టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేశారు. ఆయన ఓ వైపు యాక్షన్ చిత్రాలు, మరోవైపు ఫ్యామిలీ చిత్రాలు, ఇంకోవైపు రొమాంటిక్ లవ్ స్టోరీస్ చేసి మెప్పించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వెంకీ మూవీస్ అంటే అప్పట్లో మినిమమ్ గ్యారంటీ అనే టాక్ ఉంది. పైగా ఆ టైమ్‌లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. అలాంటి టైమ్‌లో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీనే `ప్రేమంటే ఇదేరా`. ఇది ప్రేమ కథా చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పొచ్చు.
ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన `ప్రేమంటే ఇదేరా` మూవీ
`ప్రేమంటే ఇదేరా` మూవీ ఓ వైపు రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటూనే, ఫ్యామిలీ ఎలిమెంట్లతో మెప్పించింది. సాధారణంగా లవ్ స్టోరీస్ అంటే యూత్‌ని టార్గెట్ చేసి మాత్రమే వస్తుంటాయి. వాటిలో అలాంటి కంటెంటే ఉంటోంది. కానీ `ప్రేమంటే ఇదేరా` మూవీలో మాత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్లు, అలాగే యాక్షన్ కూడా ఉండటం విశేషం. ఇదే ఈ మూవీ స్పెషాలిటీ, వెంకీ చిత్రాల ప్రత్యేకత కూడా ఇదే. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇది అప్పట్లోనే ఎనిమిదిన్నర కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిందంటే మామూలు విషయం కాదు. ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు.
`ప్రేమంటే ఇదేరా`లో వెంకటేష్, ప్రీతి జింటా కెమిస్ట్రీ హైలైట్
`ప్రేమంటే ఇదేరా` మూవీ అక్టోబర్ 30 1998లో విడుదల కాగా, ఇది 60 సెంటర్లలో యాభై రోజులు, 28 సెంటర్లలో వంద రోజులు ఆడింది. ఓడియన్ డీలక్స్ లో ఏకంగా 119 రోజులు ఆడటం విశేషం. ఇందులో పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రతి పాట ఆద్యంతం కట్టిపడేస్తుంది. రమణ గోగుల అదిరిపోయే పాటలను అందించారు. రాజ్ బిజీఎం సైతం మెప్పిస్తుంది. శ్రీహరి నెగటివ్ రోల్‌లో అదరగొట్టారు. సినిమా సక్సెస్‌లో భాగమయ్యారు. ఇందులో వెంకీ డాక్టర్‌గా కనిపించడం విశేషం. ఈ చిత్రానికి జయంత్ సీ పరాన్జీ దర్శకత్వం వహించగా, ఇందులో వెంకటేష్‌కి జోడీగా ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించింది. వెంకీ, ప్రీతి జింటా మధ్య కెమిస్ట్రీ సినిమాకి మరో హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.
`ప్రేమంటే ఇదేరా` మిస్ చేసుకున్న ఐశ్వర్యా రాయ్
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారట. ఆమె కథ విని ఓకే చెప్పింది. కానీ అప్పటికే ఆమె నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు ఫెయిల్ కావడంతో ఆ ఫ్రస్టేషన్‌లో ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. అలా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని ఐశ్వర్యా రాయ్ కోల్పోయింది. అదే సమయంలో వెంకీతో కలిసి నటించే ఛాన్స్ ని కోల్పోయింది. ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకుంది. ఈ మూవీని వదులుకున్న బాధలో ఐష్.. ఆ తర్వాత తెలుగులో `రావోయి చందమామ` అనే చిత్రంలో ఓ పాటలో మెరిసింది. కానీ తెలుగులో ఆమెకి ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పుడు ఆమెకి సినిమాలే లేకపోవడం గమనార్హం. తను కూడా చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తోంది.
వెంకటేష్ బర్త్ డే రోజు `ప్రేమంటే ఇదేరా` రీ రిలీజ్
ఐశ్వర్యా రాయ్ రిజెక్ట్ చేయడంతో హీరోయిన్ గా మరో బాలీవుడ్ నటి ప్రీతి జింటాని ఎంచుకున్నారు. ఆమెకిది తొలి తెలుగు సినిమా. అప్పటికి హిందీలో కేవలం `దిల్‌సే` మూవీలో నటించింది. అది బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ వెంటనే తెలుగులో మరో హిట్ పడింది ప్రీతికి. ఆ తర్వాత తెలుగులో మహేష్ తో `రాజకుమారుడు`లో నటించింది ప్రీతి. అనంతరం బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. ఇక `ప్రేమంటే ఇదేరా` మూవీ విడుదలై 27ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 13న వెంకటేష్ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఇప్పటి ఆడియెన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

