- Home
- Entertainment
- ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోలు వీరే.. చిరు, అల్లు అర్జున్, మహేష్.. ఇంకా ఎవరంటే?
ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోలు వీరే.. చిరు, అల్లు అర్జున్, మహేష్.. ఇంకా ఎవరంటే?
Tollywood Roundup 2025: ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు ఆడియెన్స్ ముందుకు తమ సినిమాలతో వచ్చారు. కానీ చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి బిగ్ స్టార్స్ డిజప్పాయింట్ చేశారు.

ఈ ఏడాది ఒక్క సినిమాతోనూ అలరించని హీరోలు
ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు వచ్చి బాక్సాఫీసు వద్ద తమ సత్తాని చాటారు. ఎన్టీఆర్ `వార్ 2`తో, వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం`తో, రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్`తో, నాగార్జున `కూలీ`, `కుబేర` చిత్రాలతో, ప్రభాస్ `కన్నప్ప`, నాని `హిట్ 3`లో, రవితేజ `మాస్ జాతర`, `మిస్టర్ బచ్చన్`, విజయ్ దేవరకొండ `కింగ్‌డమ్`తో చిత్రాల్లో కనిపించారు. యంగ్ హీరోలు కూడా చాలా వరకు తమ సినిమాలతో అలరించారు. బాలకృష్ణ ఇప్పుడు `అఖండ 2`తో రాబోతున్నారు. మరి ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా అలరించని హీరోలు ఎవరో తెలుసుకుందాం.
చిరంజీవి రాక రెండేళ్లు
ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా కనిపించని హీరోలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ కాక రెండేళ్లు అవుతుంది. 2023లో `భోళా శంకర్`తో వచ్చారు. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత `విశ్వంభర` చిత్రంలో నటించారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా రూపొందిన ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. వచ్చే సమ్మర్‌లో రాబోతుంది. అంతకంటే ముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `మన శంకరవరప్రసాద్ గారు` మూవీతో రాబోతున్నారు. ఇది ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించడం విశేషమైతే, వెంకటేష్ గెస్ట్ గా మెరవబోతుండటం విశేషం. ఇలా ఈ ఏడాది చిరు తన అభిమానులను నిరాశ పరిచారని చెప్పొచ్చు. వచ్చే ఏడాది డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
రెండేళ్ల వరకు రాని హేష్ బాబు
ఇదే దారిలో మహేష్ బాబు ఉన్నారు. ఆయన చివరగా గతేడాది `గుంటూరు కారం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఆ తర్వాత రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్. ప్రస్తుతం ఆయన `వారణాసి`లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ 2027లో విడుదల కాబోతుంది. అంటే ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా మహేష్ అభిమానులను నిరాశ పర్చబోతున్నారని చెప్పొచ్చు.
అల్లు అర్జున్ కి కూడా రెండేళ్లు?
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ ఏడాది ఒక్క మూవీలో కూడి నటించలేదు. ఆయన చివరగా `పుష్ప 2`తో అలరించారు. ఇది వచ్చే ఏడాది డిసెంబర్‌లోనే విడుదలైంది. దీంతో ఈ ఏడాది ఆయన రాలేదనే ఫీలింగ్ లేకుండా నడిచిపోయింది. అయితే ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బన్నీ. సూపర్ హీరో కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది రిలీజ్ కావడానికి కూడా మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. అంటే బన్నీ ఏ ఏడాదిలోనే కాదు, వచ్చే ఏడాది కూడా కనిపించడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.
గోపీచంద్, శర్వానంద్, అఖిల్
అలాగే మరో స్టార్ హీరో గోపీచంద్ కూడా ఈ ఏడాది ఆడియెన్స్ ని అలరించలేకపోయారు. ఆయన గతేడాది `భీమ`, `విశ్వం` చిత్రాల్లో నటించాడు. కానీ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. త్వరలో ఆయన ఓ హిస్టారికల్ కథతో రాబోతున్నారు. ఇందులో వారియర్‌గా గోపీచంద్ కనిపించబోతున్నారు. దీనికి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. వీరితోపాటు శర్వానంద్, అఖిల్ కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరంతా వచ్చే ఏడాది సందడి చేయబోతున్నారని చెప్పొచ్చు.
ఇలా సర్‌ప్రైజ్ చేసిన ప్రభాస్
నిజానికి డార్లింగ్ ప్రభాస్ ఈ ఏడాది `కన్నప్ప`లో కాసేపు మెరిశారు. `బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్‌తో మెప్పించారు. కానీ తాను సోలో హీరోగా నటించిన ఒక్కమూవీ కూడా విడుదల కాలేదు. ఇప్పుడు `ది రాజాసాబ్`లో నటిస్తున్నారు.ఈ చిత్రం సంక్రాంతికి రాబోతుంది.

