- Home
- Entertainment
- Prema Entha Madhuram: రఘురామ్ చెంప పగలగొట్టిన మీరా.. మళ్ళీ అదే రచ్చ మొదలుపెట్టిన మాన్సీ!
Prema Entha Madhuram: రఘురామ్ చెంప పగలగొట్టిన మీరా.. మళ్ళీ అదే రచ్చ మొదలుపెట్టిన మాన్సీ!
Prema Entha Madhuram: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం (Prema Entha Maduram) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందొ తెలుసుకుందాం.

రఘురామ్ కన్ను కొట్టుకుంటుంది ఈలోపు అక్కడకు మీరా రావడంతో మీరాకు (Meera) కన్ను కొడుతున్నాడేమో అని చెంప మీద గట్టిగా కొడుతుంది. ఇక మీరా (Meera) , మాన్సీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెబుతోంది. దాంతో మాన్సీ సార్ నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని అడుగుతుంది.
దానికి రఘరామ్ (Raguram) కూడా ఎందుకు పిలుస్తున్నారో క్లారిటీ గా చెప్పండి అనగా మీ రా మళ్లీ చెంపమీద గట్టిగా కొడుతుంది. ఇక మాన్సీ, ఆర్య వర్ధన్ (Arya Vardhan) దగ్గరికి వస్తుంది. ఆర్య 'కంపెనీ ఎంప్లాయిస్ కు ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అనుకున్నాము దానికి సంబంధించిన డాక్యుమెంట్లు నీ చేతుల మీదగా పంచితే బావుంటుందని' మాన్సీ తో అంటాడు. దాంతో మాన్సీ (Mansi) స్టన్ అవుతుంది.
ఇక ఆర్య కంపెనీ ఎంప్లాయిస్ దగ్గరికి వెళ్లి మరోసారి గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ వాళ్లు విచారంగానే ఉంటారు. ఇక తర్వాత ఎంప్లాయిస్ అందరూ ఈ ఫ్లాట్ లో ఉంటే అంత స్థాయి మాది కాదు అని చెబుతారు. దాంతో అర్య (Arya) మీకు ఏం జరిగింది. మిమ్మల్ని ఎవరైనా ఈ ప్లాట్లు తీసుకోవద్దు అని అన్నారా అని అడుగుతాడు.
ఈలోపు అను (Anu) వీళ్లకు మా నాన్నలాగా ఆత్మాభిమానం ఎక్కువ అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత అర్య (Arya) పెద్ద వాళ్ళు అయితే మీకు మీ కొడుకు ప్లాట్ ఇస్తున్నాడని తీసుకోండి. చిన్న వాళ్ళు అయితే మీ అన్నయ్య ఇస్తున్నాడని తీసుకోండి అని అంటాడు. ఇక అను, మాన్సీ (Mansi) ను డాక్యుమెంట్లు పంచమని చెబుతుంది.
ఇక మాన్సీ (Mansi) , ఆ కంపెనీ సీనియర్ మోస్ట్ ఎంప్లాయ్ శంకర్ దగ్గరికి వెళ్లి ఇవ్వబోతున్న క్రమంలో మాన్సీ ఇండైరెక్ట్ గా నాన మాటలు అంటూ శంకర్ ను డాక్యుమెంట్ తీసుకోమంటుంది. కానీ శంకర్ (Mansi) డాక్యుమెంట్ ఏ మాత్రం తీసుకొడు. ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.